స్మార్ట్ ఫోన్ మంచికే!
వాషింగ్టన్: అతిగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వాడకంతో పిల్లలు పాడవుతున్నారని పెద్దలు వాపోతుంటారు. అయితే వీటి వల్ల మేలు ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నెట్, ఫోన్లు తదితరాల వాడటంతో మంచి ఆహారపు అలవాట్లు అలవడటమే కాకుండా ధూమపానం, మద్య పానం వంటి వాటిని తగ్గించుకుంటారని తేలింది.
ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ఆధారిత ప్రోగ్రామ్‌ల వల్ల మంచి ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటమే కాకుండా 3 నుంచి 12 నెలల్లో బరువు కూడా తగ్గుతుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన అష్కాన్ అఫ్షిన్ పేర్కొన్నారు. దాదాపు 224 మంది ఆరోగ్యవంతమైన వారిపై 1990 నుంచి 2013 మధ్య కాలంలో జరిపిన అధ్యయనాలను సమీక్షించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.