కాలిపోయిన మృతదేహం ఎవరిది?
యాదగిరిగుట్ట, న్యూస్‌లైన్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాల నీలో గల ఓ వీధిలో శుక్రవారం రాత్రి కాలిపోయిన శవం లభ్యమైన విషయం విధితమే. ఈ ఘటనకు సంబంధించిన మిస్టరీని చేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం నల్లగొండ నుంచి క్లూస్ టీం, డాగ్‌స్కాడ్‌ను రప్పిం చారు.
మృతదేహం లభించిన ప్రదేశంలో పలు ఆధారాలు, నమూనాలు సేకరించారు. డాగ్ స్కాడ్ బృందంలోని కుక్క మృతదేహం లభ్యమైన ప్రాంతం నుంచి పట్టణంలోని పలు చోట్లకు వెళ్లి వెనక్కి వచ్చింది. కుక్క తిరిగిన ప్రదేశాల ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్కాడ్ పరిశోధనలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు మిస్టరీని చేదిం చేందుకు కృషి చేస్తామని గుట్ట ఎస్ఐ నర్సింహరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.
పట్టణంలో కలకలం
శ్రీనగర్‌కాలనీలో కాలిపోయిన శవం లభ్యం కావడం పట్టణంలో కలకలం సృష్టించింది. మృతదేహన్ని గుర్తుపట్టరాకుండా తగలబెట్టడంతో, ఈ భయానక దృశ్యాన్ని చూసి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం, నిత్యం రద్దీగా ఉండే యాదగిరిగుట్టలో దారుణ హత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.