1800లలో 10శాతం కంటే తక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు. నేడు ప్రపంచ జనాభాలో 55 శాతంతో 4.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు పెద్ద ఎత్తున వలసలు పెరగడం వల్ల 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్ని మెగాసిటీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి.
న్యూయార్క్, టోక్యోలు 1950లలో తొలిసారిగా మెగా సిటీలుగా గుర్తింపు పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 32 మెగాసిటీలు ఉన్నాయి. యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ (2018) డేటా ఆధారంగా 2030 నాటికి మెగాసిటీలుగా మారుతుందని అంచనా.
తదుపరి మెగాసిటీలు
అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య దేశాలతో సహా ఆదాయం అధిక సంఖ్యలో ఉన్న దేశాల జనాభాలో 80 శాతం పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా 2030 నాటికి తక్కువ ఆదాయ దేశాలు మెగాసిటీలుగా అవతరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా మెగా సిటీల జాబితాలో పలు దేశాల్లోని నగరాలు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment