Mega city
-
2030 నాటికి ఏర్పాటు కానున్న మెగాసిటీలు ఇవే
1800లలో 10శాతం కంటే తక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు. నేడు ప్రపంచ జనాభాలో 55 శాతంతో 4.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు పెద్ద ఎత్తున వలసలు పెరగడం వల్ల 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్ని మెగాసిటీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. న్యూయార్క్, టోక్యోలు 1950లలో తొలిసారిగా మెగా సిటీలుగా గుర్తింపు పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 32 మెగాసిటీలు ఉన్నాయి. యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ (2018) డేటా ఆధారంగా 2030 నాటికి మెగాసిటీలుగా మారుతుందని అంచనా.తదుపరి మెగాసిటీలుఅమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య దేశాలతో సహా ఆదాయం అధిక సంఖ్యలో ఉన్న దేశాల జనాభాలో 80 శాతం పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా 2030 నాటికి తక్కువ ఆదాయ దేశాలు మెగాసిటీలుగా అవతరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా మెగా సిటీల జాబితాలో పలు దేశాల్లోని నగరాలు ఇలా ఉన్నాయి. -
బెస్ట్ సిటీ ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి . రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజేతలకు ప్రధాని అభినందనలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి) 1. ఇండోర్ 2. సూరత్ 3. నవీముంబై 4. విజయవాడ 5. అహ్మదాబాద్ అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి) 1. కరాడ్ 2. సస్వద్ 3. లోనావాలా పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ) 1. ఛత్తీస్‌గఢ్ 2. మహారాష్ట్ర 3. మధ్యప్రదేశ్ పరిశుభ్రమైన రాజధాని.. 1. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కంటోన్మెంట్లలో పరిశుభ్రమైనవి 1. జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్ 2. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ 3. మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది. ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది. ► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది. -
రియల్టీలోకి ముకేశ్ అంబానీ!!
న్యూఢిల్లీ: చౌక చార్జీల జియోతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ తాజాగా రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్ తరహాలో భారీ మెగా సిటీకి రూపకల్పన చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గర్లో దీన్ని తలపెట్టినట్లు సమాచారం. ఈ మెగా సిటీ ప్రాజెక్ట్‌లో ప్రతీ విభాగం ఒక భారీ ప్రాజెక్టుగా ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం, పోర్టులకు కూడా దీన్ని అనుసంధానించనున్నట్లు వివరించాయి. ఇది పూర్తయితే ఏకంగా అయిదు లక్షల మందికి నివాసం కాగలదని, వేల కొద్దీ వ్యాపార సంస్థలకు కేంద్రం కాగలదని పేర్కొన్నాయి. వచ్చే పదేళ్లలో దీనిపై దాదాపు 75 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. టెలికం రంగంలో జియోతో చౌక చార్జీల విప్లవం తీసుకొచ్చినట్లే ఈ ప్రాజెక్టులో అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు అందించడంపై అంబానీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా దేశీయంగా పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల స్వరూపాన్ని సమూలంగా మార్చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అభివృద్ధి.. నిర్వహణ కూడా .. ఈ మెగా సిటీని అభివృద్ధి చేయడంతో పాటు దాని పరిపాలనకు సంబంధించి నిర్వహణపరమైన బాధ్యతలు కూడా రిలయన్సే చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ తీసుకున్న స్పెషల్ ప్లానింగ్ అథారిటీ లైసెన్సు ఇందుకు ఉపయోగపడనుంది. ప్రాజెక్టులో నివాసితులకు ప్రభుత్వపరమైన అనుమతులు లభించడంలో జాప్యంతో పాటు ఇతరత్రా వ్యయాలు కూడా దీనివల్ల తగ్గగలవని అంచనా. సాధారణంగా ముంబై ఖరీదైన ప్రాంతం అయినప్పటికీ అవకాశాలరీత్యా భారీగా వలస వస్తుంటారు. అదే చౌక మెగా సిటీ గానీ పూర్తయితే రివర్స్‌లో ముంబై నుంచి కొత్త నగరానికి వలసలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ధీరూభాయ్ కల.. వాస్తవానికి రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 1980లలోనే ఇలాంటి ప్రపంచ స్థా యి నగరాన్ని నవీ ముంబైలో నిర్మించాలని తలపోశారు. తద్వారా దక్షిణ ముంబై, నవీ ముంబైలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించాలని భావిం చారు. ఒకవేళ ఇదే గానీ సాకారమై ఉంటే, ముంబైలో రద్దీ గణనీయంగా తగ్గి ఉండేదని విశ్లేషణ. లీజుకు 4 వేల ఎకరాలు.. అంతర్జాతీయ స్థాయిలో ఎకనమిక్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా నవీ ముంబై సెజ్ (ఎన్‌ఎంసెజ్) నుంచి దాదాపు 4,000 ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు రిలయన్స్ ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 2,180 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్‌ఎంసెజ్‌లో ముకేశ్ అంబానీకి వాటాలు ఉండటం గమనార్హం. సుమారు పదిహేనేళ్ల క్రితమే ఈ భారీ ప్రాజెక్టుకు బీజం పడినట్లు భావించవచ్చు. ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ చైనాలోని మెగా ఆర్థిక మండళ్ల (సెజ్) తరహాలో దేశీయంగా కూడా సెజ్ ఏర్పాటు చేసే లక్ష్యంతో 2000 నుంచి పెద్ద ఎత్తున స్థలాలను సమీకరిస్తోంది. అప్పట్లో ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రా అధినేత నిఖిల్ గాంధీతో టాటా గ్రూప్ కూడా చేతులు కలిపేందుకు ప్రయత్నించింది కానీ.. ఇంతలో ముకేష్ అంబానీ ఆ అవకాశాన్ని అందుకున్నారు. 2005లో నిఖిల్ గాంధీతో చేతులు కలిపారు. ఎస్‌కేఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జై కార్ప్ ఇండియా, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్ప్ (సిడ్కో), ముకేష్లు కలిసి ఎన్ఎంసెజ్ను ఏర్పాటు చేశారు. 2006లో ప్రపంచ స్థాయి సెజ్ నిర్మాణం కోసం ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించింది. 2018లో మహారాష్ట్ర పారిశ్రామిక విధానం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం.. సెజ్‌లకు కేటాయించిన స్థలాన్ని సమీకృత పారిశ్రామిక వాడగా మార్చేందుకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఎన్‌ఎంసెజ్ కూడా దరఖాస్తు చేసుకోవడం, సెజ్‌ను ఐఐఏ కింద మార్చుకునేందుకు అనుమతులు తీసుకోవడం జరిగింది. -
రంగంపేట వద్దే మెగాసిటీ
ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో ‘నిమ్జ్’ ఏర్పాటుకు ప్రతిపాదన 11,282 ఎకరాల అటవీ భూమి డీ-నోటిఫైకి నివేదిక తయారీ తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద మెగా సిటీ నిర్మించాలని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి సూ చించింది. ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ (నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. మెగాసిటీ, నిమ్జ్ ఏర్పాటుకు 39,931 ఎకరాల ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములు తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు వారం రోజుల క్రితం ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపారు. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు జిల్లాను చేర్చుతూ 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం నౌకాశ్రయం సమీపంలో ఉండడం, సోమశిల, కండలేరు జలాశయాలు అందుబాటులో ఉండడం, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం ప్రతిపాదన ఉన్న దృష్ట్యా శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాలు పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని అప్పట్లో కేంద్రం తేల్చింది. ఏర్పేడు- శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన బిల్లులో కూడా యూపీఏ సర్కారు పేర్కొంది. నిమ్జ్‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో అప్పట్లో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. నిమ్జ్ ఏర్పాటుకు కట్టుబడినట్లు నరేంద్రమోదీ సర్కారు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఏడీబీ బృందం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమై నిమ్జ్ ఏర్పాటుపై చర్చించింది. రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేక వ్యక్తమవకుండా చూడాలనే లక్ష్యంతో సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో కీలకమైన ప్రకటన చేశారు. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నిమ్జ్, మెగాసిటీ, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు అటవీ భూమిని డీ-నోటిఫై చేసేందుకు సహకరిస్తామని విభజన బిల్లులోనే కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, బీఎన్ కండ్రి గ, కేవీబీ పురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో అటవీ, ప్రభుత్వ, డీకేటీ భూములను గుర్తించాలని ఆదేశించింది. తిరుపతికి పది కి.మీల పరిధిలో అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు ప్రతిపాదనలు పంపే బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. మెగాసిటీకి 4,290 ఎకరాలు తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం రంగంపేట వద్ద 464 ఎకరాల డీకేటీ, 148 ఎకరాల ప్రభుత్వ, 3678 ఎకరాల అటవీ వెరసి 4290 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. రేణిగుంట, వడమాలపేట మండలాల్లో అటవీ భూములు డీ-నోటిఫై చేసే స్థాయిలో అందుబాటులో లేవని తేల్చారు. రంగంపేట వద్ద ప్రైవేటు భూమి కూడా మరో నాలుగు వేల ఎకరాలను సేకరించవచ్చుననే అంచనాకు వచ్చారు. ఒక్క రంగంపేట వద్ద మాత్రమే ఎనిమిది వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండటం, కళ్యాణి డ్యాం దగ్గరలోనే ఉండటం దృష్ట్యా మెగా సిటీ ఏర్పాటుకు ఇదే అనుకూలమైన ప్రాంతమని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. రెవెన్యూ, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ నియమించి రంగంపేట ప్రాంతంలో మెగాసిటీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం తేల్చనుంది. ఆ తర్వాత డీపీఆర్‌ను తయారీకి గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని తుడా అధికారవర్గాలు పేర్కొన్నాయి. నిమ్జ్‌కు 19 వేల ఎకరాలు శ్రీకాళహస్తి మండలంలో 1900 ఎకరాల డీకేటీ, 2940ఎకరాల ప్రభుత్వ, 840 ఎకరాల అటవీ మొత్తం 5680 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జేసీ కమిటీ తేల్చింది. ఏర్పేడు మండలంలో 6980 ఎకరాల డీకేటీ, 1105 ఎకరాల ప్రభుత్వ, 5,300 ఎకరాల అటవీ వెరసి 13,385 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు తేల్చారు. రెండు మండలాల్లోనూ 19,065 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి సౌకర్యం, నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గాన్ని పూర్తిచేస్తే నిమ్జ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏర్పేడు మండలంలోనే ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు ఇప్పటికే 990 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపడం, కేంద్రం ఆమో దం తెలిపిన విషయం విదితమే. బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి మండలాల్లో 11,282 ఎకరాల అటవీ భూమిని డీ-నోటిఫై చేసేం దుకు అవసరమైన ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి కలెక్టర్ పంపారు. ఈ ప్రతిపాదనను యథాతథంగా ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
మెగాసిటీపై నిర్లక్ష్యం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు అటవీ భూములను డీ-నోటిఫై చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. డీ-నోటిఫై ప్ర తిపాదనలు పంపడానికి మరో వారం మాత్రమే గడువు ఉన్నా.. ఇప్పటికీ కమిటీ సమావేశం నిర్వహించకపోవడం అందుకు తార్కాణం. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని సెప్టెంబర్ 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించిన విషయం విదితమే. నగరాన్ని మెగాసిటీగా మార్చాలంటే అటవీ భూములను డీ-నోటిఫై చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. కృష్ణారావు నేతృత్వంలో అటవీ, రెవెన్యూ, పురపాలకశాఖ కార్యదర్శులతో సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో ఉన్నత స్థా యి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి చుట్టూ పది కిమీల పరిధిలోని అటవీ భూములను కనీసం పది వేల ఎకరాలను గుర్తించి.. డీ-నోటిఫై చేయాలని నిర్ణయించారు. అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు జాయింట్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా అధ్యక్షులుగా, తూర్పు విభాగం డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి మెంబర్ కన్వీనర్‌గా, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డి.సాంబశివరావు, వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ సభ్యులుగా కమిటీని నియమిస్తూ అక్టోబర్ 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డీ-నోటిఫై ప్రతిపాదనలను 30 రోజుల్లోగా పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన గడువు మరో వారం రోజుల్లో ముగియనుంది. హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జాయింట్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా విశాఖపట్నంలో కొన్నాళ్లు మకాం వేశారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గడువును మరో నెలపాటు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు రెవెన్యూవర్గాలు వెల్లడించాయి. తిరుపతికి పది కిమీల పరిధిలో అటవీ భూములు భారీ ఎత్తున అందుబాటులో లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. చంద్రగిరి మండలం రంగంపేట పరిసర ప్రాంతాల్లోని రిజర్వు అటవీ ప్రాంతంలో చామల రేంజ్లో నాగపట్ల సెక్షన్లో భూములు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి కళ్యాణి డ్యాం కూడా సమీపంలో ఉండటం గమనార్హం. ఆ భూములను డీ-నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. -
తిరుపతి చుట్టు పక్కల మెగా సిటీ: బాబు
-
తిరుపతి చుట్టు పక్కల మెగా సిటీ: బాబు
హైదరాబాద్: తిరుపతిలో కళ్యాణి డ్యాం చుట్టుపక్కల మెగా సిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం కళ్యాణి డ్యాం చుట్టుపక్కల ఐదు వేల ఎకరాల శేషాచలం అటవీ భూమి డీ నోటిఫికేషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మెగా సిటీలో భూములు కేటాయిస్తే ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా సిటీ ఏర్పాటునకు ప్రైవేట్ సం స్థలు ముందుకు వస్తాయనేది బాబు అభిప్రాయంగా ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐఎంజీ భారత్ అనే క్రీడా సంస్థకు రెండు చోట్ల కారు చౌకగా ఎకరం రూ.50 వేల చొప్పున 850 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. అదే తరహాలో తిరుపతిలో క్రీడా సిటీకి వందల ఎకరాలను కేటాయించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. తక్కువ ధరకు భూములను కేటాయిస్తే ఇతర దేశాల సంస్థలతో పాటు దేశీయ సంస్థలు కూడా యూనిట్లు ఏర్పాటునకు ముందుకు వస్తాయనేది చంద్రబాబు అభిప్రాయంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే తిరుపతిలో ఏకంగా ఐదు వేల ఎకరాల్లో మెగా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారనేది అధికార వర్గాలు అభిప్రాయం. -
స్మార్ట్, మెగాసిటీల నిర్మాణంలో ఇంజినీర్లదే కీలక బాధ్యత
మార్కాపురం: నవ్యాంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోయే 14 స్మార్ట్, 3 మెగా సిటీల నిర్మాణంలో ఇంజినీర్లదే కీలకబాధ్యత అని, భవిష్యత్‌లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో నష్టాలు మన రాష్ట్రానికే ఎక్కువ జరిగాయన్నారు. ఇంజినీర్‌గా రాణించాలంటే ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యం ఉండాలన్నారు. ఇంజినీరింగ్ విద్యలో వస్తున్న అధునాతన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులు వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని, స్థాయికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ కష్టపడేతత్వం, పరిశోధన, తపన ఉంటే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వరరావు, ప్రొఫెసర్లు మస్తానయ్య, మురళీకృష్ణ, సుబ్బారెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈఈ రాఘవరెడ్డిని, డీఈ శ్రీనివాసమూర్తిని ఎమ్మెల్యే సురేష్ ఘనంగా సన్మానించారు. -
కాసులు లేకవిల విల
నిధులు లేక అల్లాడుతున్న పంచాయతీలు ఏడాది దాటినా విడుదల కాని ‘ఏకగ్రీవం’ సొమ్ము సకాలంలో రాని కేంద్ర, రాష్ట్ర నిధులు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం... స్మార్ట సిటీలు, మెగా సిటీలతో మొత్తం సీన్ మార్చేస్తాం.. ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మిస్తాం... ఆ విధంగా ముందుకు పోదాం అని హామీలిచ్చే నేతలు వెనుకబడుతున్న పల్లెలను పట్టించుకోవడం లేదు. నిధులు లేక పంచాయతీల్లో అభివృద్ధి అటకెక్కింది. ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పించలేని దుస్థితిలో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అంతంత మాత్రంగా నిధులు విడుదల చేస్తుండడంతో అవి ఏ మూలకూ చాలడం లేదు. విశాఖ రూరల్ : రకరకాల హామీలు గుప్పిస్తున్న సీఎం చంద్రబాబు పల్లెలను మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామ ఖజానాలు నిండుకున్నా.. ఆర్థికంగా ఆదుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాక.. పన్నులు సక్రమంగా వసూలు కాక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పాలకవర్గాల వద్ద చిల్లిగవ్వ లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఏడాదైనా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో సర్పంచ్‌లు నామమాత్రంగా మారిపోయారు. నిధులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు. ప్రతి గురువారం నిర్వహించాలని తలపెట్టిన గ్రామదర్శిని కార్యక్రమంలో తొలి వారమే స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీయడంతో అధికారులు కంగుతిన్నారు. ప్రత్యేక నిధులెక్కడ : జిల్లాలో 920 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది జూలైలో 907 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 13 వాయిదా పడ్డాయి. 70 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పటికి రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయలేదు. సాధారణంగా ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఆ నిధులు తమ ఊరి అభివృద్ధికి దోహదపడతాయని ప్రజలు భావించడంతో 70 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటిలో నోటిఫైడ్ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రత్యేక గ్రాంట్‌గా అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దఫా ఏకగ్రీవమైన 70 పంచాయతీలకు అదే పద్ధతిలో నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రత్యేక నిధులతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని భావించిన వారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఆదాయం అంతంత మాత్రమే ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు లేకపోవడంతో కొత్త సర్పంచ్‌లు కొలువు తీరాక భారీగా నిధులు వస్తాయని భావించారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు వృత్తి పన్ను, సీనరేజి పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15.78 కోట్లు, ఎస్ఎఫ్సీ రూ.1.3 కోట్లు, ఏజెన్సీకి రూ.4.2 కోట్లు మంజూరయ్యాయి. అయితే గత రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని, ఈ నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. పన్నుల ద్వారా కూడా ఆదాయం సక్రమంగా రావడం లేదు. 2013-14 సంవత్సరానికి సంబంధించి రూ.25.47 కోట్లు పన్నులు రావాల్సి ఉండగా కేవలం రూ.8.51 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవతర్సంలో రూ.18 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.10 కోట్లు మాత్రం వసూలు కావడం గమనార్హం. దీంతో పంచాయతీలకు ఆదాయం లేక గ్రామాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు. -
మెగా సిటీగా విశాఖ, తూర్పులో పెట్రోలియం వర్శిటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనలు చేశారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్న నేపథ్యంలో ఇరవై పేజీల ప్రకటనను విడుదల చేశారు. ప్రతిపాదనల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నూతన పారిశ్రామిక నగరంగా శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పోర్టు కళింగపట్నం పోర్ట్ అభివృద్ధి స్మార్ట్ సిటీగా శ్రీకాకుళం, నూతన విమానాశ్రయం, ఫుడ్ పార్క్ వంశధార, నాగావళిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం శ్రీకాకుళానికి ఓపెన్ యూనివర్సిటీ, ఎలక్టానిక్స్, హార్డ్‌వేర్ పార్క్ విజయనగరం విజయనగరంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం నూతన పారిశ్రామిక నగరంగా విజయనగరం ఏడాదిలోగా తోటపల్లి రిజర్వాయర్ పూర్తి విజయనగరానికి పుడ్ పార్క్, గిరిజన యూనివర్శిటీ హార్డ్‌వేర్ పార్క్, పోర్టు, సంగీతం, లలిత కళల అకాడెమీ, మెడికల్ కళాశాల విశాఖ మెగా సిటీగా విశాఖ విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఇండస్ట్రీయల్ కారిడార్, మెట్రోరైలు విశాఖలో ఐఐఎం, ఐఐఎఫ్‌టీ, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం విశాఖలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ హబ్, పుడ్ పార్క్ విశాఖలో ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్, రైల్వే జోన్ తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాకు పెట్రోలియం యూనివర్శిటీ పోర్ట్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్, వీసీఐసీ కారిడార్ విశాఖ -చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్లోకి కాకినాడ తెలుగు యూనివర్శిటీ కొబ్బరిపీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్ స్మార్ట్ సిటీస్‌గా రాజమండ్రి, కాకినాడ ఫుడ్ పార్క్ టూరిజం, భూఉపరితల జలమార్గం కాకినాడలో ఎస్ఎన్జీ టెర్మినల్ తునిలో నౌక నిర్మాణ కేంద్రం ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్ ఐటీ హబ్‌గా రాజమండ్రి పశ్చిమ గోదావరి జిల్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ నరసాపురం పోర్టు తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు సిరామిక్ పరిశ్రమ ఆయిల్ పామ్ పరిశ్రమ పర్యాటక కేంద్రంగా కొల్లేరు జలమార్గాల అభివృద్ధి చింతలపూడి ప్రాంతంలో బొగ్గు వెలికితీత పోలవరం ప్రాజెక్టు కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమలు మెట్ట ప్రాంతాల్లో 100 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఆక్వా కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉద్యానవన పరిశోధన కేంద్రం -
తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం: కేఈ
తిరుమల : తిరుపతి పట్టణాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎర్రచందనం అక్రమరవాణాను అడ్డుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇద్దరు మంత్రులూ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
'తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరాన్ని మెగాసిటీగా మారుస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని కేఈ తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చడంమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు మీడియా సహకారంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చాలా వరకు అరికట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న బి,సి గ్రేడ్ ఎర్రచందనాన్ని ఆన్లైన్ ద్వారా వేలం వేస్తామని బొజ్జల చెప్పారు. అంతకు ముందు తిరుమలలో శ్రీవారిని కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు దర్శించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగానాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. -
మెగా సిటీగాగుంటూరు
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోని 13 జిల్లాలకు వారధిగా ఉన్న గుంటూరు నగరాన్ని మెగా సిటీగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విజయవాడలో గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గుంటూరు నగరానికి సంబంధించి పలు విషయాలను చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వివరించారు. వీటిలో ప్రధానాంశాలను పరిశీలిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు గంటపాటు చేసిన ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వ ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. ముఖ్యంగా నూతన రాష్ట్రంలో అభివృద్ది పరిచే నాలుగు మెగా సిటీల్లో గుంటూరు ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నగర మాస్టర్ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు సంబధించి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సమగ్ర నివేదిక అందజేసినట్లు సమాచారం. ప్రధానంగా నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది. గుంటూరు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెగా సిటీగా అభివృద్ధి పరిస్తే, ప్రపంచ బ్యాంకు ద్వారా చేపట్టిన రూ. 460 కోట్ల సమగ్ర తాగునీటి పథకాన్ని తక్షణం పూర్తి చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు సంబధించి అంశాలను ప్రత్యేకంగా వివరించారు. పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు గల సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ కోరినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వీలుగా రహదారుల విస్తరణ చేపట్టడం తో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రత్యేక నివేదిక అందజేసినట్లు తెలిసింది. జిల్లాలోనే రాజధాని ఏర్పడబోతోందన్న వార్తల నేపథ్యంలో భూముల లభ్యతపై సీఎంకు వివరించారని సమాచారం. జిల్లాలో ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు, సౌర విద్యుత్ ప్లాంటు నెలకొల్పేందుకు గల అవకాశాలను వివరించారు.