సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన ఇండోర్.. పేరును మార్చేందుకు అధికార భారతీయ జనతాపార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. ఇండోర్ పేరును ఇందూర్‌గా మార్చాలంటూ ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కౌన్సెలర్ ప్రతిపాదించారు. ఇంద్రేశ్వర్ మహాదేవుడి పేరు మీద ఈ నగరం ఏర్పడిందని.. కాల క్రమంలో అది కాస్తా ఇండోర్‌గా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు.
‘ఎవరు అంగీకరించినా. అంగీకరించకపోయినా.. ఇది చరిత్ర వాస్తవం. దీనిని ఎవరూ మార్చలేరు. ఈ నగరం ఇంద్రేశ్వర్ పేరుమీద ఏర్పడింది. ఇప్పుడు తిరిగి దీనిని ఇందూర్‌గా మార్చాలి’ అని బీజేపీ కౌన్సెలర్ సుధీర్ డిగ్డే స్పష్టం చేశారు. హోల్కర్ రాజుల కాలంలో ఈ పట్టణాన్ని ఇందూర్ అని పిలిచేవారని.. ఈ పేరును బ్రిటీష్ అధికారులు ఇండోర్‌గా మార్చారని ఆయన పేర్కొన్నారు.
ఇండోర్ నగరానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను సైతం సుధీర్ డిగ్డే మునిసిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకువచ్చారు. డిగ్డే ప్రతిపాదనపై మునిసిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ సింగ్ నరుకా స్పందించారు. తదపరి సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment