భూమి.. సూర్యుని చుట్టూ తిరుగుతూ, దాని చుట్టు అది తిరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ నేపధ్యంలో కొన్ని విచిత్రమైన ఖగోళ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహణం సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇతర ఖగోళ సంఘటనలు భూమి నుండి కనిపిస్తాయి.
ఇప్పుడు భారతదేశం మరో సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని గొలపనుంది. ఈ రోజు భారతదేశంలో షాడో డే ఆవిర్భవించనుంది. అంటే దీని అర్థం గురువారం(ఆగస్టు 3) భారతీయులు తమ నీడను తాము కాసేపు చూసుకోలేరు. ఇలా నీడ పడని కాలం ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఏ కారణం చేత జరుగుతుందో తెలుసుకుందాం.
జీరో షాడో డే అంటే ఏమిటి?
జీరో షాడో డే నాడు కొద్ది సమయం పాటు మన నీడ మనకు కనిపించదు. జీరో షాడో డే నాడు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు మన తలపైకి వచ్చే సమయంలో మన నీడ ఏర్పడదు. ఈ పరిస్థితినే జీరో షాడో అంటారు. ఇది ఆగస్ట్ 3, 2023న 12.23కి భారతదేశంలో సంభవించనుంది. దీని ప్రభావం హైదరాబాద్ సమీపంలో అధికంగా ఉంటుందని, ఇందుకోసం హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
దీని వెనుక సైన్స్ ఇదే..
ఖగోళంలో సంభవించే ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి తన అక్షంలో కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వంపుతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ వంపు కారణంగా సూర్యకిరణాల కోణం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. ఫలితంగా నీడ పొడవు, దిశ కూడా మారుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ కోణం కారణంగా సూర్యుని వంపు కూడా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు మన నీడ కనిపించదు. అయితే ఇది అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం దేశంలోని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీరో షాడో డే ప్రభావం ఉంటుంది హైదరాబాద్ అక్షాంశం 17.3850°N. గురువారం మధ్యాహ్నం 12.23 సమయంలో సూర్యుడి కోణం నిటారుగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌లో కొంత సమయం పాటు నీడ కనిపించదు.
ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఫ్రీ ఫైర్ గేమ్‌తో పరిచయం ఏర్పడి..
Comments
Please login to add a commentAdd a comment