Zero Shadow Day
-
కొద్దిసేపటిలో హైదరాబాద్‌లో ఖగోళ అద్భుతం.. అస్సలు మిస్సవకండి!
భూమి.. సూర్యుని చుట్టూ తిరుగుతూ, దాని చుట్టు అది తిరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ నేపధ్యంలో కొన్ని విచిత్రమైన ఖగోళ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహణం సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇతర ఖగోళ సంఘటనలు భూమి నుండి కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశం మరో సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని గొలపనుంది. ఈ రోజు భారతదేశంలో షాడో డే ఆవిర్భవించనుంది. అంటే దీని అర్థం గురువారం(ఆగస్టు 3) భారతీయులు తమ నీడను తాము కాసేపు చూసుకోలేరు. ఇలా నీడ పడని కాలం ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఏ కారణం చేత జరుగుతుందో తెలుసుకుందాం. జీరో షాడో డే అంటే ఏమిటి? జీరో షాడో డే నాడు కొద్ది సమయం పాటు మన నీడ మనకు కనిపించదు. జీరో షాడో డే నాడు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు మన తలపైకి వచ్చే సమయంలో మన నీడ ఏర్పడదు. ఈ పరిస్థితినే జీరో షాడో అంటారు. ఇది ఆగస్ట్ 3, 2023న 12.23కి భారతదేశంలో సంభవించనుంది. దీని ప్రభావం హైదరాబాద్ సమీపంలో అధికంగా ఉంటుందని, ఇందుకోసం హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని వెనుక సైన్స్ ఇదే.. ఖగోళంలో సంభవించే ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి తన అక్షంలో కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వంపుతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ వంపు కారణంగా సూర్యకిరణాల కోణం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. ఫలితంగా నీడ పొడవు, దిశ కూడా మారుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ కోణం కారణంగా సూర్యుని వంపు కూడా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు మన నీడ కనిపించదు. అయితే ఇది అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం దేశంలోని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీరో షాడో డే ప్రభావం ఉంటుంది హైదరాబాద్ అక్షాంశం 17.3850°N. గురువారం మధ్యాహ్నం 12.23 సమయంలో సూర్యుడి కోణం నిటారుగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌లో కొంత సమయం పాటు నీడ కనిపించదు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఫ్రీ ఫైర్ గేమ్‌తో పరిచయం ఏర్పడి.. -
నిర్మల్‌లో జీరోషాడో
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌లో మంగళవారం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. నిమిషం 40 సెకన్ల పాటు నీడ మాయమైంది. మధ్యాహ్నం 12.12 నుంచి 12.13 నిమిషాల 40 సెకన్ల పాటు మనుషులు, వస్తువుల నీడ కనిపించలేదు. ఒక వస్తువుపై సూర్యకిరణాలు పడితే మరోవైపున వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడటం సర్వసాధారణమే. దీనికి భిన్నంగా ఉష్ణమండలంలోని కర్కాటక రేఖ, మకరరేఖ 23.4 డిగ్రీల మధ్యన నీడలేని రోజు (జీరో షాడో డే) సంవత్సరానికి రెండుసార్లు ఏర్పడుతుంది. ఈ ఏడాది నిర్మల్ జిల్లాకేంద్రంలో శ్రీనీడలేని రోజుశ్రీ మే 16న కనిపించింది. ఇదే ఘటన తిరిగి జూలై 27న మరోసారి పునరావృతం కానుంది. నిర్మల్‌లో నీడ మాయం కావడంతో పలువురు చిన్నారులు పొడువాటి వస్తువుతో పరీక్షించారు. భూమి అక్షం సూర్యునితో గల కోణంలో వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణాలు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతుంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి సూర్యుని మధ్యరేఖను సౌరక్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని జిల్లాకేంద్రానికి చెందిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు పురస్తు శ్రీనివాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఏడాదిలో రెండుసార్లు కనిపిస్తుందన్నారు. -
హైదరాబాద్ లో జీరో షాడో డే
-
Zero Shadow Day: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు నిమిషాలపాట నీడ మాయమైంది. మధ్యహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య మనుషులు, వస్తువుల నీడ కన్పించలేదు. సూర్య కిరణాలు నడినెత్తి మీద పడటంతో షాడో మాయమైంది. దీన్ని 'జీరో షాడో డే'గా పిలుస్తారు. నీడ మాయమవుతుందని తెలియడంతో నగరంలో అనేక మంది రోడ్ల మీదకు వచ్చి గుమిగూడారు. నీడ పడుతుందో లేదో చెక్ చేశారు. 12:12 నుంచి 12:14 వరకు షాడో మాయం కావడం ప్రత్యక్షంగా వీక్షించారు. వస్తువులను కూడా రోడ్లపై పెట్టి షాడో పడుతుందో లేదో పరీక్షించారు. ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కన్పిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది చదవండి: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి.. -
Zero Shadow Day 2023: నేటి మధ్యాహ్నం 12:12 నిమిషాలకు నీడ ఉండదు
సాక్షి, హైదరాబాద్: విశ్వంలో వింతలు ఎన్నెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యం ఈరోజు ఆవిష్కృతం కానుంది. అది ‘నీడ లేని రోజు’ (జీరో షాడో డే). ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కనిపించనుంది. సూర్యుడు తలపైకి వచ్చిన తరువాత (మధ్యాహ్నం 12:12 నిమిషాలకు) దేని నీడా కనిపించదు. అక్షం వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. హైదరాబాద్ నగర అక్షాంశం 17.3850(ఎన్)డిగ్రీల ప్రకారం ఇక్కడ నేడు మధ్యాహ్నం 12:12 నిమి షాలకు నీడను చూడలేం. బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శన... జీరో షాడో డేపైన అందరికీ అవగాహన కల్పించడానికి నగరంలోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయో గాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్ పైన ఒక వస్తువును నిలబెట్టి మధ్యాహ్నం 12 నుంచి దాని నీడను గమనిస్తే సరిగ్గా 12:12 నిమిషాలకు అప్పటివరకు మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడ కూడా కనిపించదు. ఈ ప్రయోగాన్ని ఇంటివద్ద కూడా చేసి నీడ కోల్పోవడాన్ని గమనించవచ్చు.