సాక్షి, హైదరాబాద్: విశ్వంలో వింతలు ఎన్నెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యం ఈరోజు ఆవిష్కృతం కానుంది. అది ‘నీడ లేని రోజు’ (జీరో షాడో డే). ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కనిపించనుంది.
సూర్యుడు తలపైకి వచ్చిన తరువాత (మధ్యాహ్నం 12:12 నిమిషాలకు) దేని నీడా కనిపించదు. అక్షం వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. హైదరాబాద్ నగర అక్షాంశం 17.3850(ఎన్)డిగ్రీల ప్రకారం ఇక్కడ నేడు మధ్యాహ్నం 12:12 నిమి షాలకు నీడను చూడలేం.
బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శన...
జీరో షాడో డేపైన అందరికీ అవగాహన కల్పించడానికి నగరంలోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయో గాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్ పైన ఒక వస్తువును నిలబెట్టి మధ్యాహ్నం 12 నుంచి దాని నీడను గమనిస్తే సరిగ్గా 12:12 నిమిషాలకు అప్పటివరకు మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడ కూడా కనిపించదు. ఈ ప్రయోగాన్ని ఇంటివద్ద కూడా చేసి నీడ కోల్పోవడాన్ని గమనించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment