Birla Planetarium
-
Zero Shadow Day 2023: నేటి మధ్యాహ్నం 12:12 నిమిషాలకు నీడ ఉండదు
సాక్షి, హైదరాబాద్: విశ్వంలో వింతలు ఎన్నెన్నో. అలాంటి ఓ అద్భుత దృశ్యం ఈరోజు ఆవిష్కృతం కానుంది. అది ‘నీడ లేని రోజు’ (జీరో షాడో డే). ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కనిపించనుంది. సూర్యుడు తలపైకి వచ్చిన తరువాత (మధ్యాహ్నం 12:12 నిమిషాలకు) దేని నీడా కనిపించదు. అక్షం వంపు కారణంగా నీడ సంభవిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. హైదరాబాద్ నగర అక్షాంశం 17.3850(ఎన్)డిగ్రీల ప్రకారం ఇక్కడ నేడు మధ్యాహ్నం 12:12 నిమి షాలకు నీడను చూడలేం. బిర్లా ప్లానిటోరియంలో ప్రదర్శన... జీరో షాడో డేపైన అందరికీ అవగాహన కల్పించడానికి నగరంలోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయో గాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్ పైన ఒక వస్తువును నిలబెట్టి మధ్యాహ్నం 12 నుంచి దాని నీడను గమనిస్తే సరిగ్గా 12:12 నిమిషాలకు అప్పటివరకు మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడ కూడా కనిపించదు. ఈ ప్రయోగాన్ని ఇంటివద్ద కూడా చేసి నీడ కోల్పోవడాన్ని గమనించవచ్చు. -
ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!
580 ఏళ్లలో సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం భారతకాలమానం ప్రకారం నవంబరు 19(కార్తీక పౌర్ణమి)న మధ్యాహ్నం 12.48 గంటలకు కనిపించనుంది. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది అని ఎంపీ బిర్లా ప్లానిటోరియం పరిశోధన & అకడమిక్ డైరెక్టర్ డెబిప్రోసాద్ దుయారీ తెలిపారు. పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. గ్రహణం కాలవ్యవధి 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుంది. ఇది 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనది అని మిస్టర్ దుయారీ తెలిపారు. మళ్లీ 648 ఏళ్ల తర్వాత చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న పాక్షిక చంద్రగ్రహణం సంభవించిందని, మళ్లీ అద్భుతాన్ని ఫిబ్రవరి 8, 2669న చూడవచ్చని ఆయన చెప్పారు. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అప్పుడు చంద్రునిలో 97 శాతం భూమి నీడతో కప్పబడి ఉంటుంది. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సమయంలో చంద్రుడు ఎరుపు రంగును పొందుతాడు. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని పేర్కొంది. ఈ చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు ఉండనుంది. ఫ్రాస్ట్ మూన్ ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా.. మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి. (చదవండి: Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది) -
‘తొలి’ చంద్రగ్రహణం నేడే
కోల్‌కతా: ప్రస్తుత ఏడాదిలో ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో నాలుగు చంద్రగ్రహణాలు కాగా.. మరో రెండు సూర్య గ్రహణాలు. ఇక ఈ ఏడాదిలో మొట్టమొదట ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం కానుంది. జనవరి 10వ తేదీ రాత్రి 10.37 గంటలకు ప్రారంభమై జనవరి 11వ తేదీ తెల్లవారుజాము 2.42 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగనున్నట్లు ఎంపీ బిర్లా ప్లానెటోరియమ్ బుధవారం తెలిపింది. జూన్ 5, జూలై 5, నవంబర్ 30 తేదీల్లో మరో మూడు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి. -
ఇంక్‌స్పిరేషన్స్
జైల్లో ఉన్న గాంధీకి ఇందిరాగాంధీ ఉత్తరాలు రాస్తే.. ‘అందులో విషయాలు సరే ముందు దస్తూరి మార్చుకో. సరిగ్గాలేదని’ తిరిగి జాబు రాశారట గాంధీ! చేతిరాతకున్న ప్రాధాన్యం అలాంటిది. ఆ రాత రాసే వాళ్ల ఆసక్తిమీదే కాదు కాగజ్.. కలం.. దవాత్కున్న అనుబంధం మీదా ఆధారపడి ఉంటుంది అంటాడు కాలిగ్రఫీ ఎక్స్పర్ట్, నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ డెరైక్టర్ వై.మల్లికార్జునరావు. అందులో పెన్ను పాత్ర అంతా ఇంతా కాదుట. ఆ విశిష్టతను చాటడానికి ‘ఇంక్‌స్పిరేషన్స్’ పేరిట బిర్లా ప్లానెటోరియంలో ప్రదర్శన ప్రారంభించాడు. దేశంలోనే ఇది తొలి ప్రదర్శన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.... చిన్నప్పటి నుంచి హ్యాండ్ రైటింగ్‌పై ప్రత్యేక ఆసక్తి. ఎంతంటే... హ్యాండ్‌రైటింగ్‌లో రీసెర్చ్చేసేంత. ఆ క్రమంలోనే దస్తూరికి, పెన్నుకి మధ్య ఉన్న అనుబంధమూ అర్థమైంది. పెన్సిల్, ఫౌంటెన్ పెన్, బాల్‌పాయింట్ పెన్.. ఫైబర్ పెన్ ఇట్లా వీటన్నిటిలో కెల్లా పెన్సిల్‌తో రాసిన దస్తూరి అందంగా ఉంటుంది. మొదటి స్థానం ఫౌంటెన్ పెన్నుదే. కానీ పెరిగిన వేగం ఫౌంటెన్ పెన్నుని పక్కన పెట్టాయి. బాల్‌పాయింట్ పెన్నయితే చకాచకా రాయడానికి వీలుంటుందని అందరూ వాటినే ఇష్టపడతున్నారు. కానీ ప్రపంచంలో గొప్పవాళ్లందరూ ఇప్పటికీ ఇష్టపడేది, ఉపయోగించేది ఫౌంటెన్ పెన్నునే. పెన్నుల సేకరణ... ఎలక్ట్రానిక్ లెటర్ ఎవరి రాతనైనా ఒకే రకంగా చూపిస్తుంది. కానీ చేతిరాత ఏ ఇద్దరిదీ ఒకే రకంగా ఉండదు. అలాగే ఒక్కో పెన్ను ఒక్కో రకంగా అక్షరాలు పేరుస్తుంది. ఈ విషయం గమనించాక.. అసలు ప్రపంచంలో ఎన్ని పెన్నులున్నాయో వాటిన్నటినీ సేకరించడం మొదలుపెట్టాను. అలా ఇప్పటి వరకు దాదాపు రెండు వేల రకాల పెన్నుల్ని సేకరించా. ఇందులో అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాక్ (మోబ్లా) పెన్నులూ ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని వెయ్యిమంది ప్రముఖుల స్వదస్తూరీ ప్రతులనూ సేకరించా. ఇందులో అరిస్టాటిల్ మొదలు మహాత్మాగాంధీ, మదర్‌థెరిస్సా, లాంటి 350 మంది అత్యంత ప్రముఖులవీ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం... పెన్నుల ద్వారా చేతిరాత విశిష్టతను తెలపడమే. కంప్యూటర్లు వచ్చాక పెద్దవాళ్లెవరూ పెన్నుల్ని ఉపయోగించడంలేదు. రాసే అలవాటునూ మర్చిపోతున్నారు. పిల్లలు కూడా దస్తూరీపై శ్రద్ధ పెట్టడం లేదు. ఎప్పుడో సివిల్స్ రాయాల్సివచ్చినప్పుడు మాలాంటి వాళ్ల దగ్గరకొచ్చి ట్రైనింగ్తీసుకుంటున్నారు. అదేదో చిన్నప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవచ్చు కదా. అందుకే ఇలాంటి వారి కోసం చేతి రాతను చక్కదిద్దుకునే శిక్షణనిస్తున్నా. పదిహేడేళ్ల కిందట మొదలుపెట్టిన ఈ పని నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ పేరుతో కొనసాగిస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్లో.. ఓల్డ్ మోడల్ ఫౌంటెన్‌పెన్ నుంచి రాకెట్ పెన్, గన్ పెన్, స్క్రూడ్రైవర్పెన్, కార్పెన్, కర్రపెన్ను, కీ పెన్ను, కత్తెర పెన్నులాంటి రకరకాల పెన్నులున్నాయి. అలాగే లగ్జర్ కంపెనీ కొత్త ప్రొడక్ట్ (ఇంకా మార్కెట్లోకి విడుదల కాని) ఫౌంటెన్ పెన్ను కూడా ఉంది. మొత్తమ్మీద స్కూల్ పిల్లలను ఈ ఎగ్జిబిషన్ బాగా ఆకట్టుకుంటోంది. సరస్వతి రమ