‘కుడా’కు క్యాబినెట్ ఆమోదం
Published Tue, Feb 14 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
కర్నూలు(టౌన్) కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)కి మంత్రి మండలి మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీంతో కర్నూలు నగరం మరింత విస్తరించనుంది. కుడా పరిధిలోకి కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్ నగర పంచాయతీలతో పాటు కల్లూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, మహానంది మండలాలు వస్తాయి. ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. 219 గ్రామాలను కలుపుకుని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఏర్పాటు కానుంది.
మునిసిపాలిటీ నుంచి..
మున్సిపాలిటీగా ఉన్న కర్నూలు 1994లో కార్పొరేషన్‌గా ఏర్పడింది. 2002 సంవత్సరం ఫిబ్రవరిలో కల్లూరు గ్రామ పంచాయతీని, 2014 సంవత్సరంలో మామిదాల పాడు, మునగాలపాడు, స్టాంటన్ పురం గ్రామ పంచాయతీలను కారొ్పరేషన్లో విలీనమయ్యాయి. దీంతో నగరం విస్తరించిపోయింది. ఇప్పుడు కుడాగా మారడంతో మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది.
ఇప్పటికే పట్టణాభివృద్ధి అథారిటీ బిల్ 2015 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రభుత్వమే చైర్మన్‌లను నియమిస్తుంది. ప్రస్తుతం నగర విస్తీర్ణం 49.74 చదరపు కిలోమీటర్లు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,23,829 మంది ఉన్నారు. అలాగే మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 1,43,797 మంది ఉన్నారు.
మున్సిపాల్టీ/మండలాలు విస్తీర్ణం 2011 జనాభా లెక్కల చ.కి.మీ ప్రకారం
1. కర్నూలు (అర్బన్) 355.72 4,06,737
2. కల్లూరు 327.01 1,96,288
3. గూడూరు (అర్బన్) 163.08 46,286
4. నందికొట్కూరు (అర్బన్) 177.13 83,748
5. జూపాడుబంగ్లా 226.70 37,686
6. మిడుతూరు 302.74 41,652
7. ఓర్వకల్లు 371.72 58,487
8. కోడుమూరు 287.06 74,594
9. వెల్దుర్తి 334.62 63,120
10. బేతంచర్ల 296.25 88,726
11. పాణ్యం 283.29 51,428
12. గడివేముల 243.53 42,310
13. నంద్యాల (అర్బన్) 217.08 2,83,368
14. మహానంది 259.64 38,487
15. డోన్ (అర్బన్) 430.28 1,20,232
–––––––––––– ––––––––––––––––––––––––––––––––––
మొత్తం 4224.82 16,19,587
––––––––––––––––––––––––––––––––––––––––––––––
Advertisement