KUDA
-
అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?
‘కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ’ (కుడా) వరంగల్ నగర శివారును ఆనుకొని ఉన్న గ్రామాల్లోని రైతుల భూముల్లో గత మూడేళ్ల నుంచీ రహస్య సర్వే చేస్తోంది. మొదట్లోనే స్థానిక రైతాంగం ‘మా భూముల్లో మా అనుమతి లేకుండా సర్వే చేయడం ఏమిటి?’ అని అడ్డుకున్నారు. అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ‘కుడా’ ప్రయత్నాలను ఆదిలోనే రైతులు అడ్డుకోవ డంతో ఒక అడుగు వెనక్కి వేసి సర్వేను ఆపుతున్నాం అని అధికారులు ప్రకటించారు. వరంగల్ చుట్టూరా అవుటర్ రింగురోడ్డును ఆనుకొని పచ్చని పంట భూములు ఉన్నాయి. అక్కడి నుంచే కొత్తిమీర, పుదీనా, వంకాయ ఇతర కూర గాయలు ఉదయం 3 గంటలకే వరంగల్ మార్కెట్‌కు చేరుకుంటాయి. హన్మకొండ, వరంగల్ సిటీ ప్రజలకు 90 శాతం కూరగాయలు సిటీ శివారు గ్రామాల రైతులు తీసుకొచ్చేటివే. కూరగాయలు, మార్కెట్ వ్యాపారంపై చిన్న, సన్నకారు పేద రైతులు వేలాదిగా ఆధారపడి ఉన్నారు. ‘కుడా’ అవుటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న 27 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం 21,510 ఎకరాల భూమిని సేకరించాలని సర్వే చేసింది. ఆ తర్వాత సర్వే నంబర్లతో సహా జీవో నం. 80(ఎ) విడుదలయింది. 27 గ్రామాల్లో 2 గ్రామాల రైతుల అభిప్రాయ సేకరణ జరగలేదు. ముందుగా అసైన్డ్ భూముల సర్వే చేశారు. ఇవి పడావ్ భూములు కావు. దశాబ్దాల కాలం నుండి రైతుల వద్ద సాగులో ఉన్న భూములే. తర్వాత రైతుల పట్టా భూముల్లో సర్వే చేశారు. మొత్తంగా తమ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమి మొత్తాన్ని సేకరించారు. 27 గ్రామాల్లోని 21,510 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేయబోతున్నారు. అందులో నుండి భూమి ఇచ్చిన రైతుకు 1200–1400 గజాల భూమిని ప్లాట్ల రూపంలో ఇస్తారు. వ్యవ సాయ భూమి ప్లాట్ల రూపంలోకి మారడం వల్ల... భూమి రేటు రెట్టింపు అవుతుంది. కాబట్టి మొత్తం 1400 గజాల్లో రైతుకు లాభం కోట్లల్లో వస్తుందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే వేలాది ఎకరాల పంట భూముల్ని భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదన్న మాట! మొన్న వరంగల్, పరకాల మీటింగ్‌లలో మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు. రైతుల భూమిని రైతుల అనుమతి లేకుండా గుంజు కొని ప్రభుత్వమే రియల్ భూవ్యాపారం అధికారి కంగా చేస్తుందనేది ఇందువల్ల రూఢి అయింది. ల్యాండ్ పూలింగ్‌పై ప్రజలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఈ సందేహాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే. ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇచ్చిన రైతు భవిష్యత్ ఏమిటి? భూమిపై ఆధారపడి పంటలు పండిస్తూ బ్రతికే రైతును ప్రభుత్వమే భూమి లేని వాడిగా చేస్తోంది. కూలీగా మార్చివేస్తోంది. 21,510 ఎకరాలను ప్లాట్లుగా మార్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి... వచ్చిన ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టమయింది. (క్లిక్: వారికో న్యాయం.. ఊరికో న్యాయం) భూ వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకొని వరంగల్ నగర అభివృద్ధి అంటే ఎలా? వరంగల్ చుట్టూ ఎత్తయిన భవనాల నిర్మాణం జరిగేతేనే అభివృద్ధా? ఇందులో బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనం దాగి ఉంది. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ల్యాండ్ పూలింగ్ వేగవంతం అవుతోంది. రైతుల ఆందోళనల ఫలితంగా ‘కుడా’ చైర్మన్ ల్యాండ్ పూలింగ్ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలో కూడా స్పష్టత లేదు. ల్యాండ్ పూలింగ్ కోసం తెచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలి. రైతాంగానికి ప్రజలందరూ అండగా నిలబడాలి. (క్లిక్: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?) - ఎల్. రాజు సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి, వరంగల్ -
ప్రశ్నార్థకంగా ‘కుడా’ భవితవ్యం
హైదరాబాద్ : కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ (కుడా) ఉనికి కోల్పోతోంది. గత కొంత కాలంగా నిధులు విడుదల కాకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగక కుడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులకు చేతిలో పని లేకుండా పోయింది. పనులు లేక దారుషిఫాలోని కుడా ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. అధికారులతో పాటు సిబ్బంది గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి టి. అంజయ్య 1981లో దారుషిఫాలో ‘కుడా’ను ఏర్పాటు చేశారు. 1981-82 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 25 లక్షలతో ఏర్పాటైన కుడాకు అంచెలంచెలుగా బడ్జెట్ పెరుగుతూ అప్పట్లో రూ. 9 కోట్లకు చేరుకుంది. పాతబస్తీలోని మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, గోషామహాల్ తదితర నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా కుడా పని చేసింది. పెరిగిన అవసరాల దృష్ట్యా ఏటా బడ్జెట్ పెరగాల్సి ఉన్నా కేటాయించిన నిధులే సకాలంలో విడుదల కాకపోవడంతో కుడా భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారింది. ప్రత్యేక తెలంగాణలో కుడా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని భావించిన సిబ్బంది, పాతబస్తీ ప్రజలకు నిరాశే మిగిలింది. కుడాకు నిధుల కేటాయింపుపై పాతబస్తీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. దీంతో ఫిర్యాదులు, సమస్యలతో వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు మాత్రమే ప్రస్తుతం కుడా కార్యాలయాన్ని వాడుకుంటున్నారు. -
వరంగల్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్: కేటీఆర్
సాక్షి, వరంగల్: వరంగల్ నగర అభివృద్ధి ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఉంటుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్ధ (కుడా) కార్యాలయంలో బుధవారం వరంగల్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 15 కల్లా మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తామని తెలిపారు. నగరం చుట్టూ 500 ఎకరాల్లో టౌన్షిప్ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మమునూరు ఎయిర్‌పోర్టును త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. కూడా భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా వరంగల్‌లో సమగ్ర రవాణ సర్వే చేస్తామని కేటీఆర్ తెలిపారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, హరిత, నగర మేయర్ నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం అయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
‘కుడా’ ఏర్పాటుకు రూ. 10 కోట్లు విడుదల
- జీఓ 420 జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ కర్నూలు (టౌన్) : కుడా (కర్నూలు ఆర్బన్ డెవలప్మెంటు ఆథారిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ జీఓ నెంబర్ 420 జారీ చేశారు. కర్నూలు నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో అమోదం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి రూ. 40 కోట్లు కేటాయించింది. మొదటి విడత కింద రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను కుడా కార్యాలయ ఏర్పాటుకు ఖర్చు చేయనున్నారు. -
‘కుడా’కు ఆమోదం
2599.50 చదరపు కిలోమీటర్లతో ఏర్పాటు – 117 గ్రామాలు, 9 మండలాల విలీనం – ఇందులోనే డోన్ నగర పంచాయతీ కర్నూలు(టౌన్): కర్నూలులో కుడా(కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జీఓ 277ను మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి కరికాల్ వలవన్ జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కుడా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పట్లో 2414.69 కిలోమీటర్ల పరిధిలో కుడాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కుడా పరిధిలోకి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, నంద్యాల మున్సిపాలిటీ, గూడూరు నగర పంచాయతీతో పాటు 111 గ్రామాలు, 8 మండలాలను తీసుకొచ్చారు. కుడా ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని గత ఏడాది నవంబర్ 4వ తేదీ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కుడా ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో అధికారికంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్ నగర పంచాయతీని అదనంగా కలుపుకుని 117 గ్రామాలు, 9 మండలాలు విలీనమయ్యాయి. కుడా పరిధిలో భూముల అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, అలాగే తనిఖీలు, జరిమానాలు వంటి కార్యక్రమాలను కుడా చేపట్టనుంది. ఏపీ మెట్రో పాలిటన్ రీజియన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ–2016 ప్రకారం కుడా పనిచేయనుంది. -
‘కుడా’కు క్యాబినెట్ ఆమోదం
కర్నూలు(టౌన్) కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కి మంత్రి మండలి మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీంతో కర్నూలు నగరం మరింత విస్తరించనుంది. కుడా పరిధిలోకి కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్ నగర పంచాయతీలతో పాటు కల్లూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, మహానంది మండలాలు వస్తాయి. ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. 219 గ్రామాలను కలుపుకుని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఏర్పాటు కానుంది. మునిసిపాలిటీ నుంచి.. మున్సిపాలిటీగా ఉన్న కర్నూలు 1994లో కార్పొరేషన్‌గా ఏర్పడింది. 2002 సంవత్సరం ఫిబ్రవరిలో కల్లూరు గ్రామ పంచాయతీని, 2014 సంవత్సరంలో మామిదాల పాడు, మునగాలపాడు, స్టాంటన్ పురం గ్రామ పంచాయతీలను కారొ్పరేషన్లో విలీనమయ్యాయి. దీంతో నగరం విస్తరించిపోయింది. ఇప్పుడు కుడాగా మారడంతో మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే పట్టణాభివృద్ధి అథారిటీ బిల్ 2015 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రభుత్వమే చైర్మన్లను నియమిస్తుంది. ప్రస్తుతం నగర విస్తీర్ణం 49.74 చదరపు కిలోమీటర్లు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,23,829 మంది ఉన్నారు. అలాగే మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 1,43,797 మంది ఉన్నారు. మున్సిపాల్టీ/మండలాలు విస్తీర్ణం 2011 జనాభా లెక్కల చ.కి.మీ ప్రకారం 1. కర్నూలు (అర్బన్) 355.72 4,06,737 2. కల్లూరు 327.01 1,96,288 3. గూడూరు (అర్బన్) 163.08 46,286 4. నందికొట్కూరు (అర్బన్) 177.13 83,748 5. జూపాడుబంగ్లా 226.70 37,686 6. మిడుతూరు 302.74 41,652 7. ఓర్వకల్లు 371.72 58,487 8. కోడుమూరు 287.06 74,594 9. వెల్దుర్తి 334.62 63,120 10. బేతంచర్ల 296.25 88,726 11. పాణ్యం 283.29 51,428 12. గడివేముల 243.53 42,310 13. నంద్యాల (అర్బన్) 217.08 2,83,368 14. మహానంది 259.64 38,487 15. డోన్ (అర్బన్) 430.28 1,20,232 –––––––––––– –––––––––––––––––––––––––––––––––– మొత్తం 4224.82 16,19,587 –––––––––––––––––––––––––––––––––––––––––––––– -
కుడాపై ప్రజాభిప్రాయ సేకరణ
– అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌కు విన్నవించండి – జీవో 277 జారీ కర్నూలు(టౌన్): కుడా(కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని మున్సిపల్ కార్యదర్శి కరికల్ వలవన్ జీవో 277ను జారీ చేశారు. నెల రోజుల పాటు ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. కర్నూలు మండల పరిధిలో 17 గ్రామాలు, కల్లూరులో 18, గూడూరులో 10, ఓర్వకల్లులో 20, వెల్దుర్తిలో 16, పాణ్యంలో 12, నంద్యాలలో 7, బేతంచెర్లలో 11 గ్రామాలు కలిపి మొత్తం 111 గ్రామాలు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి రానున్నాయి. కుడాపై ఆయా గ్రామాల పరిధిలో స్థానిక ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే జిల్లాకలెక్టర్‌కు విన్నవించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కుడాకు గ్రీన్ సిగ్నల్
– మంత్రిమండలి ఆమోదం కర్నూలు(టౌన్): కర్నూలు నగర పరిధి మరింత విస్తరించనుంది. చుట్టుపక్క మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలుపుకొని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కుడా పరిధిలో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్ నగర పంచాయతీలు విలీనం కానున్నాయి. అదేవిధంగా కల్లూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, మహానంది మండలాలు కూడా ఈ పరిధిలోకి రానున్నాయి. మంత్రిమండలి ఆమోదంతో పాటు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.50 కోట్లు మంజూరు చేసింది. 219 గ్రామాలను కలుపుకుని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఏర్పాటు కానుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో భాగంగా పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మున్సిపాల్టీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా, కార్పొరేషన్లను పట్టణ అభివృద్ధి సంస్థలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పట్టణాభివృద్ధి అథారిటీ బిల్ 2015 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రభుత్వమే చైర్మన్లను నియమిస్తుంది. కుడాపై దృష్టి సారించిన అధికారులు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై ఆరు నెలలుగా నగరపాలక అధికారులు కసరత్తు ప్రారంభించారు. 1994 సంవత్సరంలో కర్నూలు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. 2002 ఫిబ్రవరిలో కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీని కర్నూలు కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం 49.74 చదరపు కిలోమీటర్లు కాగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,23,829 మంది జనాభా ఉన్నారు. అలాగే మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 1,43,797. –––––––––––––––––––––– మున్సిపాల్టీ/మండలాలు విస్తీర్ణం 2011 జనాభా లెక్కల చ.కి.మీ ప్రకారం –––––––––––––––––––––––––––– 1. కర్నూలు (అర్బన్) 355.72 4,06,737 2. కల్లూరు 327.01 1,96,288 3. గూడూరు (అర్బన్) 163.08 46,286 4. నందికొట్కూరు (అర్బన్) 177.13 83,748 5. జూపాడుబంగ్లా 226.70 37,686 6. మిడుతూరు 302.74 41,652 7. ఓర్వకల్లు 371.72 58,487 8. కోడుమూరు 287.06 74,594 9. వెల్దుర్తి 334.62 63,120 10. బేతంచర్ల 296.25 88,726 11. పాణ్యం 283.29 51,428 12. గడివేముల 243.53 42,310 13. నంద్యాల (అర్బన్) 217.08 2,83,368 14. మహానంది 259.64 38,487 15. డోన్ (అర్బన్) 430.28 1,20,232 ––––––––––––––––––––––––––––––––– మొత్తం 4224.82 16,19,587 ––––––––––––––––––––––––––––––––