
కాకినాడలో ‘కూడా’(కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
సాక్షి, కాకినాడ: కాకినాడలో ‘కూడా’(కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. పరిమితికి మించి స్టేజ్‌పైకి ఎక్కవ మంది చేరడంతో కుప్పకూలింది. వేదిక కూలడంతో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కిందపడిపోయారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత యథావిధిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.