stage collapsed
-
‘కుడా’ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో ‘కూడా’(కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. పరిమితికి మించి స్టేజ్‌పైకి ఎక్కవ మంది చేరడంతో కుప్పకూలింది. వేదిక కూలడంతో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కిందపడిపోయారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత యథావిధిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. -
ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభలో చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేజీ కుప్ప కూలిపోయింది. దీంతో చినరాజప్ప, మాగంటి బాబు, పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్ కింద పడిపోయారు. పలువురు టీడీపీ నేతలు గాయపడ్డారు. వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చదవండి: ‘ఎల్లో మీడియా నుంచి స్క్రిప్ట్.. ఓ పథకం ప్రకారం కథ’ -
కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి కిందపడ్డ నాయకులు..
రాయ్‌పూర్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో కాంగ్రెస్ ఆదివారం చేపట్టిన టార్చ్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేజీపైకి పదుల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎక్కడంతో బరువు ఆపలేక అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్నవారంతా కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. అయితే ఈ ఘటనను కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. స్టేజీ కూలిన వెంటనే అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. అందరూ తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ర్యాలీ యథావిధిగా కొనసాగింది. #WATCH | Chhattisgarh: Stage breaks down during torch rally organized by Congress to protest against termination of Rahul Gandhi's membership of Lok Sabha in Bilaspur. (02.04.23) pic.twitter.com/PjnXREl5JN — ANI (@ANI) April 3, 2023 2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్ రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయను సంఘీభావం తెలిపాయి. కాగా.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ సవాల్ చేశారు. సోమవారం సోదరి ప్రియాంక గాంధీతో కోర్టుకు వెళ్లారు. రాహుల్‌కు ఈసారైనా అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో చూడాలి. చదవండి: జమిలీ ఎన్నికలు తథ్యం.. -
మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. లాలూ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో అపశృతి దొర్లింది. మంగళవారం ఆర్వాల్ లో లాలూ పాల్గొన్న ప్రచార సభ వేదిక కూలిపోయింది. దీంతో వేదికపై ఉన్న లాలూతో పాటు ఆర్జేడీ నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదం నుంచి లాలూ సురక్షితంగా తప్పించుకున్నారు. ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 16న జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో ఆర్వాల్ నియోజక వర్గం ఉంది. -
టిడిపి బహిరంగ సభలో అపశృతి