మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. లాలూ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో అపశృతి దొర్లింది. మంగళవారం ఆర్వాల్ లో లాలూ పాల్గొన్న ప్రచార సభ వేదిక కూలిపోయింది.
దీంతో వేదికపై ఉన్న లాలూతో పాటు ఆర్జేడీ నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదం నుంచి లాలూ సురక్షితంగా తప్పించుకున్నారు. ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 16న జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో ఆర్వాల్ నియోజక వర్గం ఉంది.