'మోదీ బ్రహ్మరక్కసి, అమిత్ నరభక్షకుడు' | Modi is a dangerous ghost, Amit Shah man eater, says Lalu | Sakshi
Sakshi News home page

'మోదీ బ్రహ్మరక్కసి, అమిత్ నరభక్షకుడు'

Published Sat, Oct 10 2015 3:20 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

'మోదీ బ్రహ్మరక్కసి, అమిత్ నరభక్షకుడు' - Sakshi

'మోదీ బ్రహ్మరక్కసి, అమిత్ నరభక్షకుడు'

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదఫా పోలింగ్కు సంబంధించిన ప్రచారం ముగుస్తుండటంతో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ బ్రహ్మరక్కసి అని, అమిత్ షా నరభక్షకుడని దుయ్యబట్టారు. బ్రహ్మరక్కసి అయిన మోదీని చేతిబడి చేసి దూరం తరమాలని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

అనంతరం నవాడలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ను ఎత్తివేయాలని భావిస్తున్నదని విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాకూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement