పాట్నా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బుద్ధి లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ శనివారం విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. బిహార్‌లో జంగిల్‌రాజ్ అంటూ అమిత్ షా పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి గుజరాత్‌లో అమిత్ షా ఉన్నప్పుడే జంగిల్‌రాజ్ రాజ్యమేలిందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
లాలూప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ‘ప్రతిపక్షాల ఐక్యతే’ ప్రధాన అజెండా అని లాలూ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ర్యాలీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. మరికొందరు ప్రతిక్ష నేతలు ఈ ర్యాలీలో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment