కొవ్వుకేక | The problem of overweight | Sakshi
Sakshi News home page

కొవ్వుకేక

Published Sat, Oct 18 2014 11:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

కొవ్వుకేక - Sakshi

కొవ్వుకేక

  •  గ్రేటర్‌లోని ప్రతి ఆరుగురిలో ఒకరికి అధిక బరువు సమస్య
  •  ‘కొవ్వు కరిగింపు’లో సిటీ టాప్
  •  ఒబెక్యూర్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి
  • సాక్షి, సిటీబ్యూరో: ఊబకాయం... మోసేవారికే కాదు... చూసేవారికీ ఇబ్బంది కలిగించేది. ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది.  ఒబెక్యూర్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధ పడుతుంటే, గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఆరుగురు పెద్దవాళ్లలో ఒకరు, ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. 2025 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక రు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ప్రతి ఏడుగురు బాధితుల్లో ఒకరు 100 కేజీలకు పైగా బరువు ఉన్నవారే. బాధితుల్లో 65 శాతం మహిళలు ఉంటే, 35 శాతం పురుషులు ఉంటున్నారు.
     
    ఇక్కడే కరిగించుకుంటున్నారు

    తగ్గిన శారీరక శ్రమ.. నిశిరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జాలు, బర్గర్లు... వెరసి  శరీరంలో కొవ్వు కొండలా పేరుకుపోతోంది. పీల గా ఉన్న వారిని సైతం పీపాలా తయారు చేస్తున్నాయి. దీంతో త్వరగా సన్నబడాలనే కాంక్షతో సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిష్ణాతులైన వైద్యులు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య పరికరా లు హైదరాబాద్‌లో అందుబాటులో ఉ న్నా యి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వైద్య ఖర్చులు కూడా ఇక్కడ తక్కువ. దీంతో నగర వాసులే కాకుండా టాంజానియా, ఇథియోపియా, కెన్యా దేశీయులు సైతం గ్రేటర్ వైద్యులనే ఆశ్రయిస్తుండటం విశేషం. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2012-13లో దేశ వ్యాప్తంగా 6వేల శస్త్రచికిత్సలు జరిగితే, అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 800కు పైగా నిర్వహించారు. ఢిల్లీలో నెలకు 50, ముంబైలో 40, గ్రేట ర్‌లో 70కిపైగా ఆపరేషన్లు జరుగుతున్నా యి.
     
    1400 కేలరీలు చాలు

    అవసరమైన దానికంటే అధిక  ఆహారం తీసుకోవడం, దాని ద్వారా లభించే కేలరీలు ఖర్చయ్యే స్థాయిలో శారీరక శ్రమ లేకపోవడం సమస్యగా మారింది. ప్రాసెస్డ్ ఆహారం, పిజ్జాలు, బర్గర్లు విరివిగా లభిస్తున్నాయి. వీటిని ఒకసారి తింటే చాలు.. ఆ రోజుకు సరిపడే కేలరీలు లభిస్తాయి. ఇవి ఎంత త్వరగా విడుదలవుతాయో అంతే త్వరగా జీర్ణమవుతాయి. ఇవి ఖర్చుకాకపోతే బరువు పెరుగుతుంది. రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2300-2500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారు 1400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్‌ఫుడ్  తీసుకుంటే శరీరంలో అదనంగా కేలరీలు పోగవుతాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయం ఓ తీవ్రమైన జబ్బు కాకపోయినా.. పరోక్షంగా ఇది మధుమేహం, గుండెపోటు, మోకాలి నొప్పులు, హైపర్‌టెన్షన్, మిహ ళల్లో సంతానలేమి, రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తుంది.
     
    మితాహారమే ఉత్తమం

    సాధ్యమైనంత వరకు బరువు పెరుగకుండా చూసుకోవాలి.
         
     నిత్యం కనీసం అరగంటైనా వ్యాయమం చేయాలి.
         
     పరిమితికి మించి ఆహారం తీసుకోవద్దు.
         
     మాంసాహారం, మద్యంపై నియంత్రణ ఉండాలి.
         
     లైపోసక్షన్, బెరియాట్రిక్ సర్జరీలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే.
         
     కాస్మోటిక్ సర్జరీల వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
     - డాక్టర్ మహిధర్ వల్లేటి, బెరియాట్రిక్ సర్జన్, నోవా స్పెషాలిటీ ఆస్పత్రి
     
     లైపొసక్షన్ సర్జరీ

     శరీరంలోని కొవ్వును రెండు పద్ధతుల్లో తొలగిస్తారు. ఇందులో మొదటిది లైపొసక్షన్ సర్జరీ. ఇది కాస్మోటిక్ సర్జరీ. ఇంజక్షన్ సాయంతో శరీరంలోని కొవ్వును తొలగిస్తారు. ఈ చికిత్సలో ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత.. మళ్లీ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సినీ తారలు ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత కొవ్వును తీసేసిన ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
     
    బెరియాట్రిక్ సర్జరీ

    రెండోది బెరియాట్రిక్ సర్జరీ. ఇది 1950 నుంచి అందుబాటులో ఉంది. గతంలో పొట్టను పూర్తిగా కోసి కొవ్వును తొలగించేవారు. తాజాగా ల్యాప్రోస్కోపిక్ విధానంతో పొట్టపై చిన్న కోతపెట్టి, జీర్ణకోశం సైజును తగ్గిస్తారు. శరీరంలోని కొవ్వునంతా ఒకేసారి తొలగింకుండా రోజు వారీ వ్యాయామం, ఆహార నియంత్రణతో నెమ్మదిగా బరువును తగ్గిస్తారు. తొమ్మిది నెలల్లో 60-70 శాతం కొవ్వు దానంతటదే శరీరంలో కరిగిపోతుంది. కేవలం బరువే కాకుండా బీపీ, షుగర్, నొప్పులు కూడా తగ్గుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement