సాక్షి, చెన్నై: నల్లధనం వెల్లడిలో అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ తాజాగా పన్ను ఎగవేత దారుల జాబితా నగరాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. దేశంలోని నగరాల్లో తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ ఐటీ డిఫాల్టర్స్ లో మొదటి స్థానంలోఉంది. ఇక్కడ 25మంది భారీ పన్ను ఎగవేతదారులున్నారని తాజా నివేదికలు తేల్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 96మంది భారీ పన్ను ఎగవేత దారులుగా తేలగా..20 మందితో అహ్మదాబాద్ రెండవ స్థానంలో ఉంది.
1980 నుంచి ప్రారంభించిన అంచనా సంవత్సరానికి ఆదాయపు పన్ను బకాయిలు రూ. 3,614.14 కోట్లు. మొత్తం 96 ఐటీ డిఫాల్టర్లలో వ్యక్తులు, సంస్థలు, కంపెలు ఉండగా..వీరినుంచి ఒక్కపైసా కూడా వసూలు కాలేదుట.
ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం, సెక్షన్ 222, 227, 229, 232 సెక్షన్ల కింద ఆదాయపన్ను బకాయిలను వసూలు చేసే అధికారం ఆదాయపన్ను శాఖకు ఉంది ట్టడానికి అధికారం ఉంది. కానీ పన్ను ఎగవేతదారులను గుర్తించడంలో ఆదాయపన్ను విభాగం చాలా కేసుల్లో విఫలమవుతోంది. ముఖ్యంగా ముంబైకి చెందిన ఉదయ్ ఆచార్య (చనిపోయారు) రూ. 779.04 చెల్లించాల్సిఉంది. కానీ అనంతరం దివాలా ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment