మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్టు
కర్నూలు(అర్బన్): నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తున్న నలుగురు సభ్యులు ముఠాలోన ముగ్గురిని అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. వీరి నుంచి ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న ట్లు చెప్పారు. రెండు మోటార్ సైకిళ్లను మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్‌నగర్, రైతు బజారు ప్రాంతాల్లో.. మిగిలిని నాలుగు మోటార్ సైకిళ్లు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, భవాని నగర్, కృష్ణానగర్, బృందావన్ నగర్‌లలో దొంగలించినట్లు విచారణలో వెల్లడయిందన్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలతో పాటు మోటార్ సైకిళ్లను అపహరిస్తున్నట్లు గుర్తించామన్నారు. నాల్గవ ముద్దాయి కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీరిని అరెస్టు చేసిన వారిలో ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ భాస్కర్ ఉన్నారన్నారు.