
సాక్షి, హైదరాబాద్ : మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. వరుస డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, డైమండ్ హౌస్, రోడ్ నెంబర్ 45ల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో చెక్‌పోస్ట్ వద్ద 8కార్లు, 4బైక్‌లను సీజ్ చేశారు. పరిమితికి మించి మద్యం సేవించిన ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పోలీసుల కన్ను కప్పి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు చేజ్ చేసిమరీ పట్టుకున్నారు.
మద్యం మత్తులో మరికొంత మంది పోలీసులపై చిందులేశారు. మరికొంత మంది గుట్టు చప్పుడు కాకుండా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల ముందు వారి పప్పులు ఉడకలేదు. పరిమితికి మించి మద్యం సేవించిన వారందరినీ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడంతో పాటు, జరిమానా విధించారు. డైమండ్ హౌజ్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు మరో 8కార్లు, 11 టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment