మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములు శాసించగలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు 44 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేవి.