వివాహ వేడుకకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు.
పట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివాహ వేడుకకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు.
ఈ సంఘటన ఔరంగాబాద్ జిల్లాలోని కమా బిఘా సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 12 మందికి గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపడుతున్నారు.