ఔరంగాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నిధి చిలుముల, సౌజన్య భవిశెట్టి ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. వీరితో పాటు జాతీయ చాంపియన్ ప్రేరణ బాంబ్రీ, రెండో సీడ్ ప్రార్థన తొంబరే సెమీస్ పోరుకు అర్హత సంపాదించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ నిధి వరుస సెట్లలో మూడో సీడ్ రిషిక సుంకరకు షాకిచ్చింది.
గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆమె 6-3, 6-3తో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున ఏపీ అమ్మాయి రిషికను కంగుతినిపించింది. సౌజన్య 6-4, 7-5తో రుతూజా భోంస్లేపై చెమటోడ్చి నెగ్గింది. ప్రేరణ బాంబ్రీ 4-6, 6-2, 6-3తో అంకిత రైనాపై, ప్రార్థన 6-2, 6-7 (4/7), 6-0తో నటాషా పల్హాపై గెలిచారు. సౌజన్య డబుల్స్‌లోనూ సెమీస్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. సౌజన్య-శర్మదా బాలు జోడి 6-0, 6-0తో ఎమి ముతగుచి-చిహిరో న్యునోమ్ జంటపై గెలుపొందగా, రిషిక-శ్వేతా రాణా ద్వయం 6-4, 6-1తో తీర్థ అక్షర-ఇస్కా (ఏపీ) జోడీని ఓడించింది. అనుష్క భార్గవ (ఏపీ)- ఈతీ మెహతా జంట 2-6, 5-7తో అంకిత రైనా-ప్రార్థన తొంబరే జోడి చేతిలో పరాజయం చవిచూసింది.
సెమీఫైనల్లో నిధి, సౌజన్య
Published Fri, Jan 10 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement