సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
Published Thu, Jan 2 2014 3:58 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఔరంగాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ (02740) ఏసీ సూపర్‌ఫాస్ట్ ఈ నెల 12న రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-సికింద్రాబాద్ (02739) ఈ నెల 13న సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్‌లలో ఆగుతాయి.
అదనపు బెర్తులు: పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. సికింద్రాబాద్-రాజ్‌కోట్ -సికింద్రాబాద్ (17018/17017) ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 6 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఒక త్రీటైర్ ఏసీ కోచ్ ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్-సాయినగర్-సికింద్రాబాద్ (17002/17001) షి రిడీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 3,10,17,24,31 తేదీలలో, షిరిడీ నుంచి వచ్చేటప్పుడు ఈ నెల 4,11,18,25, ఫిబ్రవరి 1 తేదీలలో ఒక ఏసీ త్రీటైర్ అదనంగా అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12770/ 12769) సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 3,7, 10, 14, 17, 21, 24, 28,31 తేదీల్లో, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఈ నెల 6,10,13,17, 20,24,27,31, ఫిబ్రవరి 3 తేదీ ల్లో రెండు స్లీపర్ క్లాస్ బోగీలు అదనంగా ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ - మన్మాడ్ -సికిం ద్రాబాద్ (17064/ 17063) అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 2 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఒక స్లీపర్ క్లాస్ బోగీ అదనంగా ఏర్పాటు చేస్తారు.
Advertisement