కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం | Man arrested for raping his daughters | Sakshi
Sakshi News home page

కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం

Published Thu, May 15 2014 8:54 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం - Sakshi

కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం

ఓ తండ్రి తన కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేయడమేకాకుండా... ఆ దృశ్యాలను వీడియో తీసిన తన కంప్యూటర్లో భద్రపరుచుకున్నాడో ప్రబుద్దుడు.

ఓ తండ్రి తన కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేయడమేకాకుండా... ఆ దృశ్యాలను వీడియో తీసిన తన కంప్యూటర్లో భద్రపరుచుకున్నాడో ప్రబుద్దుడు. ఆ విషయాన్ని గమనించిన అతడి భార్య మహారాష్ట్రలోని పర్బనీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును ఔరంగాబాద్లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు నిందితుడైన కన్నతండ్రి (46)ని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... నిందితుడు తరచుగా ఇద్దరు కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో కుమార్తెలకు రెండు సార్లు గర్భస్రావం కూడా చేయించాడు. అయితే కూతుళ్లపై అత్యాచారం దృశ్యాలను వీడియో తీసి తన నివాసంలో కంప్యూటర్లో భద్రపరిచాడు. ఆ విషయాన్ని గమనించిన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు ప్రముఖ కంపెనీలో ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement