JD-U
-
'మాబంధం ఎవ్వరూ బద్ధలు కొట్టలేరు'
పాట్నా: తమ కూటమిని ఎవరూ బద్ధలు కొట్టలేరని, అత్యంత దృఢమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. జేడయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలతో ఏర్పడిన కూటమి బీటలు పాయనిదని, శక్తిమంతమైనదని చెప్పారు. ఈ పార్టీలను కలుపుకొని ఎన్సీపీ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. రెండు రోజుల పార్టీ జాతీయ మండలి సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఆర్జేడీ, జేడీ యూ విలీనం కావు
పాట్నా: బీహార్లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లు విలీనంకాబోతున్నట్టు వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీ యూ నేత నితీష్ కుమార్ తోసిపుచ్చారు. ఈ రెండు పార్టీలు విలీనంకాబోవని నితీష్ స్పష్టం చేశారు. కాగా వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ యూ, ఆర్జేడీ కలసి పోటీ చేయనున్నట్టు నితీష్ చెప్పారు. ఇరు పార్టీలు విలీనమయ్యే ప్రసక్తేలేదని, ఒకే కూటమిగా మాత్రమే పోటీ చేస్తాయని తెలిపారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించడానికి సెక్యులర్ పార్టీలన్ని ఏకంగా కావాలని నితీష్ పిలుపునిచ్చారు. ఆర్జేడీ, జేడీ యూ విలీనమైతే ఉపయోగంగా ఉంటుందని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నితీష్ వివరణ ఇచ్చారు. -
'అందుకే ఆ పార్టీలతో జట్టు కట్టాం'
లండన్: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా తమ రాష్ట్రంలో అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ అన్నారు. కమలనాథులతో కటిఫ్ ప్రభావం తమ రాష్ట్రంపై అంతగా లేదని ఆయన తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాము జేడీ(యూ) ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్ లో ఆర్థికాభివృద్ధి మందగించిందని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంజ్హీ అన్నారు. మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకే ఆర్జేడీ, కాంగ్రెస్, పార్టీలతో జేడీ(యూ) జట్టు కట్టిందని వివరించారు.