బీహార్లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లు విలీనంకాబోతున్నట్టు వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీ యూ నేత నితీష్ కుమార్ తోసిపుచ్చారు
పాట్నా: బీహార్లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లు విలీనంకాబోతున్నట్టు వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీ యూ నేత నితీష్ కుమార్ తోసిపుచ్చారు. ఈ రెండు పార్టీలు విలీనంకాబోవని నితీష్ స్పష్టం చేశారు.
కాగా వచ్చే ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ యూ, ఆర్జేడీ కలసి పోటీ చేయనున్నట్టు నితీష్ చెప్పారు. ఇరు పార్టీలు విలీనమయ్యే ప్రసక్తేలేదని, ఒకే కూటమిగా మాత్రమే పోటీ చేస్తాయని తెలిపారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించడానికి సెక్యులర్ పార్టీలన్ని ఏకంగా కావాలని నితీష్ పిలుపునిచ్చారు. ఆర్జేడీ, జేడీ యూ విలీనమైతే ఉపయోగంగా ఉంటుందని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నితీష్ వివరణ ఇచ్చారు.