
గర్ల్ ఫ్రెండ్ లేనిది ఎవరికి:బీహార్ సీఎం
పాట్నా:ఓ మహిళ పోలీస్ ను లైంగిక వేధించిన ఘటనలో తన కుమారుడు పాత్ర ఉందన్న బీజేపీ ఆరోపణలను బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ తిప్పికొట్టారు. తన అధికారంతోనే కొడుకును తండ్రి తప్పించాడన్న బీజేపీ నేతలు విమర్శలను జితన్ మంజ్హీ తన దైన శైలిలో ఖండించారు. ' ఒక మహిళ పట్ల నా కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడనడానికి సాక్షాలే లేవు. ఆ విషయాన్ని హోటల్ సీసీ ఫుటేజే తేటతెల్లం చేసింది. ఇంక ఏ ఆధారాలున్నాయని బీజేపీ విమర్శలకు చేస్తుంది' అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఎవరుంటున్నారని అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరికీ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది సర్వ సాధారణం అయ్యిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని తెలిపారు. తన అధికార బలంతో కొడుకును కాపాడుకునే యత్నం చేస్తున్నారని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.