బీహార్ సీఎంపై రెండు కేసులు నమోదు | Two court cases against Manjhi for controversial remark | Sakshi
Sakshi News home page

బీహార్ సీఎంపై రెండు కేసులు నమోదు

Published Fri, Nov 14 2014 3:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

Two court cases against Manjhi for controversial remark

పాట్నా: అగ్రవర్ణాల వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝిపై రెండు కేసులు నమోదు చేశారు. పశ్చిమ చంపరన్ జిల్లాలోని బెట్టియా కోర్టులో సంజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి మాంఝిపై కేసు దాఖలు చేశారు. ఈ కేసును వచ్చే నెల 10న విచారించనున్నారు. ఇదే విషయంపై సమస్తపూర్ జిల్లాలోనూ విజయ్ మిశ్రా అనే కాంగ్రెస్ నాయకుడు మాంఝిపై మరో కేసు దాఖలు చేశారు.

దళితులు, గిరిజనులే భారతీయులని,  అగ్రకులస్తులు విదేశీయులని, ఆర్యుల సంతతి వారసులని మాంఝి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  అగ్రవర్ణాల వాళ్లు విదేశాల నుంచి ఇక్కడికొచ్చారని మాంఝీ వ్యాఖ్యానించారు.  దాంతో ఆయనపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement