
నా పడవ మునగదు: మంఝి
న్యూఢిల్లీ: తన పడవ ఎన్నటికీ మునగబోదని ఉద్వాసనకు గురైన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి దీమా వ్యక్తం చేశారు. తన సీఎం పదవి ఊడిపోయినప్పటికీ ఆయన ధైర్యంగా కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆదివారం ఆయన ఢిల్లీ వచ్చారు. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రిని కలుస్తారు. బీహార్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ప్రధానితో మంఝి చర్చించనున్నారు.
ఈ సందర్భంగా తన రాజకీయ భవితవ్యంపై విలేకరులు ప్రశ్నించగా.. 'మంఝి పడవ మునగబోదు' అంటు ఆయన సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ భేటీకి మంఝి హాజరుకావడాన్ని జేడీ(యూ) ఆమోదించలేదు.