'బీజేపీతోనే నా అడుగు' | Manji announces poll tie-up with BJP | Sakshi
Sakshi News home page

'బీజేపీతోనే నా అడుగు'

Published Thu, Jun 11 2015 8:37 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'బీజేపీతోనే నా అడుగు' - Sakshi

'బీజేపీతోనే నా అడుగు'

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ బీజేపీతో జతకట్టారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని బీహార్లో గెలవనివ్వకూడదనే ఉద్దేశంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్, ములాయం, తాజాగా శరద్ పవార్ అంతా కలిసి జనతా పరివార్ ఏర్పడిన విషయం తెలిసిందే.

అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకోసం మహాదళిత నాయకుడు అయిన మాంఝీతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు ముగిసిన అనంతరం మాంఝీ ఈ విషయాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement