మాంఝీపై వేటు వేసిన జేడీయూ
పాట్నా : ముఖ్యమంత్రి పీఠం దిగేందుకు ససేమిరా అంటున్న జితన్ రాం మాంఝీపై వేటు పడింది. జేడీయూ సోమవారం ఆయన్ని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అసెంబ్లీలో బలం నిరూపించుకొని తీరుతానంటూ సవాలు విసిరిన మాంఠీ నిన్న ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే.
మరోవైపు జేడీయూ శాసనసభాపక్ష (ఎల్పీ) కొత్త నేతగా ఎన్నికైన నితీశ్ కుమార్ ...ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలవనున్నారు. దాంతో గవర్నర్ నిర్ణయంపై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శనివారం తమ పదవులు వీడిన 20మంది మంత్రల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే.
కాగా బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝిని పార్టీ నుంచి బహిష్కరించి, జేడీయూ శాసనసభ పక్ష నాయకుడిగా నితీష్కుమార్ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే మంఝి రాజీనామా చేయకపోవడం, మెజార్టీ ఎమ్మెల్యేలు నితీష్కు మద్దతు తెలియజేస్తుండంతో బీహార్లో రాజకీయం సంక్షోభం ఏర్పడింది.