
సీఎం పనితీరుపై మంత్రులకే సందేహం!
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా మారిని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి ఈసారి తన మంత్రి వర్గ సహచరులపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. తన పనితీరుపై కొందరు మంత్రులు సందేహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
'నేను టెస్టు క్రికెట్ ఆడుతున్నానని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు వన్డే ఆడుతున్నానని చెబుతున్నారు. ఇంకొందరు టీ-20 ఆడుతున్నానని కితాబిస్తున్నారు. ఎవరేమన్నా, ఏ ఫార్మాట్ అయినా నేను ఆడగలను. హామీలను నురవేర్చగలనని మంత్రులు అర్థం చేసుకుంటారు' అని మంజీ అన్నారు.