
బీహార్ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ- బ్లాక్ మార్కెటింగ్ ను సమర్థిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్నవ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేయడం నేరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వారిపై చర్యలేమీ తీసుకోబోమని కూడా చెప్పారు.
తమ జీవనం కోసం, పిల్లలను బాగా చదివించుకోవడం కోసం చిన్న వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడతారని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి వారిపై తమ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోబోదని అన్నారు. మంజ్హీ వ్యాఖ్యలతో అక్కడే ఉన్న కేంద్ర వ్యవసాయ శాఖ రాధా మోహన్ సింగ్ అవాక్కయ్యారు.