
'అధికారం లేకపోతే ఆయన బతకలేరు'
న్యూఢిల్లీ: రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి స్పష్టం చేశారు. శాసనసభలో మెజారిటీ నిరూపించుకుంటానని దీమా వ్యక్తం చేశారు. ఒకవేళ మెజారిటీ నిరూపించుకోలేకపోతే ముఖ్యమంత్రి పీఠం వదులుకుంటానని చెప్పారు.
ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జేడీ(యూ) నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం లేకపోతే నితీష్ కుమార్ బతకలేరంటూ ధ్వజమెత్తారు.