
జితన్ రాం మాంఝీ(ఫైల్)
పట్నా: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నివాసం వద్ద ఉన్న వందలాది మామిడి చెట్లకు పండ్లను కోయకుండా ఉండేందుకు గాను నితీశ్ కుమార్ ప్రభుత్వం 24 మంది పోలీసులను నియమించిందని బుధవారం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా ఆరోపించింది.
వీరిలో 8 మంది ఎస్‌ఐలు, 16 మంది కాన్‌స్టేబుళ్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, బిహార్ సీఎంగా పదవి నుంచి దిగిపోయినా, మాంఝీ ఇంకా ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన 1, ఆన్నే మార్గ్ బంగ్లాలోనే ఉంటున్నారు.