
ఆ ఎన్నికలు రాష్ట్రానికే పరిమితం కావు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ తన దైనశైలిలో స్పందించారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావని..దేశానికి జరగబోయే ఎన్నికలంటూ నరేంద్ర మోదీ సర్కారుకు చురకలంటించారు.
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ తన దైనశైలిలో స్పందించారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావని.. దేశానికి జరగబోయే ఎన్నికలంటూ నరేంద్ర మోదీ సర్కారుకు చురకలంటించారు. వచ్చే నెలలో బీహార్ లో జరుగనున్న ఎన్నికలు.. దేశం మొత్తానికి ప్రతిబింబిస్తాయన్నారు.
రాష్ట్రంలో ఉన్న మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఈ వివరాలు ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ ఎన్నిక అక్టోబర్ 12న మొదలవుతుంది. ఫలితాలను నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో లాలు ప్రసాద్కు చెందిన ఆర్జేడీ, సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) కూటమిగా కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మాత్రం విడివిడిగా పోటీ చేయనున్నాయి.