
'మా మద్దతు లేకుండా ప్రభుత్వాలు నడవవు'
తమ పార్టీ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం నడవలేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అన్నారు.
పాట్నా: తమ పార్టీ మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం నడవలేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తమ మద్దతు లేకుండా కేంద్రంలోగానీ, బిహార్ లోగానీ ప్రభుత్వాలు మనలేవని పేర్కొన్నారు. తూర్పు చంపారన్ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతూ... బీజేపీని అడ్డుకునేందుకునే బిహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని తెలిపారు.
తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వం కూడా తమ పార్టీతో మద్దతుతోనే నడవాల్సివుంటుందని ఆయన జోస్యం చెప్పారు. లాలూ వ్యాఖ్యలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామకృపాల్ యాదవ్ స్పందించారు. వార్తల్లో ఉండేందుకే లాలూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.