'వాళ్లకు జిన్నా భూతం పట్టింది'
పాట్నా: కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు బిహార్‌ను పాకిస్థాన్‌లాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రేతాత్మ వారిలోకి ప్రవేశించడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 'జిన్నాభూతం నితీశ్, లాలూలోకి ప్రవేశించింది. వారు బిహార్‌ను పాకిస్థాన్ చేయాలనుకుంటున్నారు' అని ఆయన శనివారం పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్‌లో బాణాసంచా పేల్చి సంబురాలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం ఇష్టంలేనివారు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.