
పెద్దోడికి 25.. చిన్నోడికి 26 ఏళ్లు
పెద్దోడి వయసు 25 ఏళ్లు.. చిన్నోడు వయసు 26 ఏళ్లు. ఇదేలా సాధ్యమని ఆశ్చర్యంగా ఉందా?
పాట్నా: పెద్దోడి వయసు 25 ఏళ్లు.. చిన్నోడు వయసు 26 ఏళ్లు. ఇదేలా సాధ్యమని ఆశ్చర్యంగా ఉందా? ఈ విషయం బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీం లాలు ప్రసాద్ యాదవ్ పుత్రరత్నాలకే తెలియాలి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ పోటీచేస్తున్నారు. అన్న తేజ్ ప్రతాప్ వయసు 25, తమ్ముడు తేజస్వి వయసు 26 ఏళ్లని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వైశాలి జిల్లాలోని మహు నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్, రఘోపూర్ నుంచి తేజస్వి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో వయసును తప్పుగా రాయడంపై లాలు కానీ ఆయన కుమారులు కానీ స్పందించలేదు. లాలు కుటుంబ సన్నిహితుల ప్రకారం తేజస్వి వయసు అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా 26 ఏళ్లే. తేజ్ ప్రతాప్కు 28 ఏళ్లు ఉంటాయని చెప్పారు. అయితే అఫిడవిట్లో తేజ్ ప్రతాప్ తన వయసును ఎందుకు తప్పుగా రాశాడో?