మోదీ ఎన్నారైగా మారిపోయారు: లాలూ | lalu prasad flacks narendra modi as nri | Sakshi
Sakshi News home page

మోదీ ఎన్నారైగా మారిపోయారు: లాలూ

Published Tue, Nov 18 2014 3:04 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

మోదీ ఎన్నారైగా మారిపోయారు: లాలూ - Sakshi

మోదీ ఎన్నారైగా మారిపోయారు: లాలూ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నారైలా మారిపోయారని, భారతీయులకు అందుబాటులో ఉండట్లేదని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ మండిపడ్డారు. ప్రధాని పదిరోజుల్లో మూడు దేశాల పర్యటన చేస్తున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇక ఈ దేశానికి ప్రధానిగా ఏమాత్రం వ్యవహరించడం లేదని, ఆయన ఎన్నారై అయిపోయారని అన్నారు.

ఆయన పేరు భజన చేసే మీడియాను వెంటపెట్టుకుంటున్నారని తెలిపారు. బూటకపు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి ఫొటోలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సొంతదేశంలో సరిహద్దులు సమస్యాత్మకంగా ఉంటే.. ఆయన మాత్రం విదేశాల్లో తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని లాలూ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement