ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. చైబాసా ట్రెజరీ అవకతవకల కేసులో లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రాను రాంచీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి గురువారం శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే దాణా కుంభకోణానికి సంబంధించిన రెండు కేసులలో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.