పట్నా: 50 నియోజకవర్గాల్లో బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. 53.32% పోలింగ్ నమోదైంది. ఇది మొదటి, రెండో దశల పోలింగ్ శాతం కన్నా తక్కువ. ఈ దశలోనూ పురుషుల(52.5%) కన్నా మహిళలే(54%) ఉత్సాహంగా ఓటేశారు. బక్సర్‌లో అత్యధికంగా 56.58%, పట్నాలో అత్యల్పంగా 51.82% ఓటింగ్ జరిగినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్ వీ నాయక్ తెలిపారు. సరన్ జిల్లాలో 123 ఏళ్ల వృద్ధురాలు ఓటుహక్కును వినియోగించుకుందన్నారు.
భక్తియార్‌పూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఓటేశారు. ఈ ప్రాంతంలో సరైన వైద్యం అందని కారణంగా ఒక బాలిక మృతి చెందిన విషయమై ఆయన కొంత నిరసనను ఎదుర్కొన్నారు. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవీ తదితరులు ఓటేశారు.
బిహార్ మూడో దశలో 53 శాతం పోలింగ్
Published Thu, Oct 29 2015 3:32 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM
Advertisement
Advertisement