'త్వరలో లాలూకు గట్టి సమాధానమిస్తా' | Will give befitting reply to Lalu, Rahul: Nitish Kumar | Sakshi
Sakshi News home page

'త్వరలో లాలూకు గట్టి సమాధానమిస్తా'

Published Thu, Jul 27 2017 5:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

'త్వరలో లాలూకు గట్టి సమాధానమిస్తా'

'త్వరలో లాలూకు గట్టి సమాధానమిస్తా'

పట్నా: అవకాశవాది, నమ్మక ద్రోహి అంటూ తనపై వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు త్వరలోనే గట్టి సమాధానం చెబుతానని బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూకు, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తగిన సమయంలో దిమ్మతిరిగిపోయే సమాధానం చెబుతానని చెప్పారు. మరోసారి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నితీశ్‌కుమార్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

నితీశ్‌కుమార్‌ నమ్మకద్రోహి, ఆయన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఆయన అన్నారు. బీజేపీతో నితీశ్‌ చేతులు కలుపడం మ్యాచ్‌ ఫీక్సింగేనని ఆరోపించారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొనే తాను బీజేపీతో చేతులు కలిపానని అన్నారు. బిహార్‌ అభివృద్ధి, న్యాయం తనముందున్న ప్రాధాన్యత అంశాలని నితీశ్‌ చెప్పారు. బిహార్‌ ప్రజల యోగక్షేమాలే తనకు తొలి ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ బిహార్‌ ప్రజలకు సేవ చేస్తానంటూ ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement