'లాలు, నితీష్ పాకిస్థాన్కు వెళ్లిపోవాలి' | Nitish and Lalu should go to Pakistan: BJP MP | Sakshi
Sakshi News home page

'లాలు, నితీష్ పాకిస్థాన్కు వెళ్లిపోవాలి'

Published Wed, Nov 4 2015 3:55 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'లాలు, నితీష్ పాకిస్థాన్కు వెళ్లిపోవాలి' - Sakshi

'లాలు, నితీష్ పాకిస్థాన్కు వెళ్లిపోవాలి'

పట్నా: బిహార్ ఎన్నికల సందర్భంగా మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ లు పాకిస్థాన్కు వెళ్లిపోవాలని బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చౌబే వ్యాఖ్యానించారు. 'నవంబర్ 8న బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక లాలు, నితీష్ పాకిస్థాన్కు వెళ్లాలి' చౌబే అన్నారు.

బిహార్కు చెందిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. 'నితీష్, లాలు.. బిహార్ను పాకిస్థాన్లా మార్చాలని భావిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. గిరిరాజ్ వ్యాఖ్యల అనంతరం చౌబే.. లాలు, నితీష్పై ఫైర్ అయ్యారు. ఇంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బిహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి, ఐదో దశ పోలింగ్ 5న జరగనుండగా, ఫలితాలు 8న వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement