బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోస్యం చెప్పారు.
న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ బిహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గెలుపు తప్పదని, ఎన్నికల ఫలితాలు మొత్తం రాజకీయాల్లోనే మార్పు తెస్తుందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బిహార్ ప్రచార బాధ్యతలను చక్కగా నిర్వర్తించినందుకు గర్వంగా ఉందన్నారు. కాగా మహా కూటమి 97, ఎన్డీయే కూటమి 91, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.