'ఇక్కడ కులమే పెద్ద స్టార్' | Caste is the biggest star in Bihar, says Lalu Prasad | Sakshi
Sakshi News home page

'ఇక్కడ కులమే పెద్ద స్టార్'

Published Sat, Oct 3 2015 10:43 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'ఇక్కడ కులమే పెద్ద స్టార్' - Sakshi

'ఇక్కడ కులమే పెద్ద స్టార్'

బిహార్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. కులరాజకీయాలు ప్రధాన పాత్ర పోషించే ఈ రాష్ట్రంలో ఆ చిచ్చును మరింత రెచ్చగొట్టేందుకే నాయకులు ప్రయత్నిస్తున్నారు. చేతికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. బిహార్ రాజకీయాల్లో కులానిదే ప్రధాన పాత్ర అని, ఇక్కడ కులమే పెద్ద స్టార్ అని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ తాజాగా వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ మాట అన్నారు. బీజేపీ నేతృత్వంలోని అగ్ర కులాలకు, మహాకూటమి తరఫున ఉన్న వెనకబడిన కులాలకు మధ్య యుద్ధంగానే ప్రస్తుత ఎన్నికలు ఉండబోతున్నాయని లాలు వ్యాఖ్యానించారు.

మన దేశంలో కులాన్ని ఎప్పుడూ వదలిపెట్టలేమని, అది పచ్చి వాస్తవమని అన్నారు. ఇప్పటికే ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో కులాల ప్రస్తావన తెచ్చినందుకు ఎన్నికల కమిషన్ లాలుపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక్కడ జంతువులకు కూడా కులాలు ఉంటాయని, ప్రధానంగా ఏనుగులకు కులాలు ఉంటాయని లాలు చెప్పారు. బిహార్లో బీజేపీ పని అయిపోయిందని, గురుశిష్యులిద్దరూ (మోదీ, అమిత్ షా) మూటా ముల్లో సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement