caste politics
-
లౌకికవాదానికి గొడ్డలిపెట్టు రాజకీయం
భారతదేశంలో కుల రాజకీయాలు మరింత ఊపు అందుకుంటున్నాయి. హరియాణా, జమ్ము–కశ్మీర్ ఎన్నికల్లోని సామాజిక సమీకరణలను పరిశీలిస్తే – అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా చెప్పిన కులం పునాదుల మీదే ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టమవుతుంది. హరియాణాలో కాంగ్రెస్ కుల ఓట్లను సమీకరించింది. కాంగ్రెస్‌కు ప్రతిగా బీజేపీ కూడా ఎంబీసీ కులాలను సమీకరించడం మొదలుపెట్టింది. జాట్లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాదు. అయినా జాట్లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసు కోగలిగింది. అయితే, బీసీల్లోని మతపరమైన నమ్మకాలను రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందని మనం గమనించాలి.కాంగ్రెస్ మొదటి నుండీ ఆయా రాష్ట్రా లలో భూస్వామ్య కులాల మీద ఆధారపడి తన రాజకీయాలు నెరపుతున్నదని భాషా రాష్ట్రాల రూపకల్పన నాడే అంబేడ్కర్ స్పష్టం చేశారు. రామ్ మనోహర్ లోహియా తన ‘కులాల సమస్య’లో భారతదేశంలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుందనీ, జాతీయ స్థాయిలో వాళ్ళ పెత్తనాన్ని హిందూ బ్రాహ్మణ రాజకీయ వ్యవస్థ నడిపిస్తుందనీ అన్నారు. శూద్ర కులాలు వారికి సామంతులుగా ఆ యా రాష్ట్రాలను పాలించుకుంటున్నాయనీ, బ్రాహ్మణా ధిపత్యంలో ఏ దోపిడీ అయితే ఉందో శూద్ర భూస్వామ్య కులాల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలలో కూడా అదే ఆధిపత్యం కొనసాగుతుందనీ చెప్పారు. ఇవాళ హరియాణాలో కాంగ్రెస్ కుల ఓట్లను సమీకరించింది. కాంగ్రెస్‌కు ప్రతిగా బీజేపీ ఎంబీసీ కులాలను సమీకరించడం మొదలు పెట్టింది. కాంగ్రెస్ తాము గెలుస్తున్నామనే భావనలో పూర్తి ఫలితాలు వచ్చాక చేసుకునే ఉత్సవాలను అత్యుత్సాహంతో ముందే చేసు కోవటం, జాట్ల వల్ల అణగదొక్కబడుతున్న బీసీ కులాలు సమీకృతమై బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ పునరాలోచించుకోవలసిన అవసరం వుంది. బీజేపీ తన హిందూవాద సిద్ధాంతాన్ని ఆచరించడంలో వెనుకంజ వేయడం లేదు. కానీ ప్రత్యర్థులు ఎన్నికల్లో ఏ కులాల్ని ఆశ్రయిస్తున్నారో చూసి వాటికి భిన్నమైన కులాల సమీకరణకు పూనుకుంటోంది. కాంగ్రెస్ ఉదార బ్రాహ్మణ వాదంలో బీజేపీని ఎదురించలేదు. ప్రత్యామ్నాయ రాజ కీయ వ్యవస్థా నిర్మాణంతోనే దానిని ఎదురించగలుగుతుంది.నిజానికి మండల్ కమిషన్ రిపోర్టును బీసీలకు అనుసరింపచేసే విషయంలోనే జనతా పార్టీ నుండి జనసంఘ్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ముందుకు వచ్చింది. బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఛైర్మన్‌గా, ఆర్.ఆర్.భోలే, దివాన్ మోహన్ లాల్, కె. సుబ్ర హ్మణ్యం, దీనబంధు సాహు సభ్యులుగా 1978 డిసెంబర్ 20న బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో ప్రకటించారు. దీనబంధు సాహు ఆరోగ్య కారణాల రీత్యా 1979 నవంబర్ 5న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఆర్.ఎల్.నాయక్‌ను నియమించడం జరిగింది.మండల్ కమిషన్ తన రిపోర్టును 1980 డిసెంబర్ 31న రాష్ట్రపతికి సమర్పించింది. ఓబీసీ సంక్షేమ పథకాలకు ప్రస్తుతం కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదు; నిధుల కొరత కారణంగా మరిన్ని పథకాలు చేపట్టలేకపోతున్నామని పలు రాష్ట్రాలు మండల్ కమిషన్ దృష్టికి తెచ్చాయి; అందువల్ల ప్రత్యేకంగా బీసీల కోసం ఉద్దేశించిన పథకాలకు ఎస్సీ, ఎస్టీ పథకాల వలెనే కేంద్రం సహాయం అంద జేయాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మండల్ సిఫారసులను పక్కకు పెట్టాయి. జనతాదళ్ అధికారంలోకి వచ్చాక మండల్ కమిషన్ సిఫా రసుల అమలు కోసం వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి కేంద్ర సంయుక్త కార్యదర్శి కృష్ణాసింగ్ 1990 ఆగస్ట్ 13న మెమొరాండం జారీ చేశారు.‘అనేక తారతమ్యాలు గల మన వంటి సమాజంలో, రాజ్యాంగంలో పొందు పరచిన విధంగా సామాజిక న్యాయ సాధన త్వరగా జరగటం తప్పనిసరి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అప్పటి ప్రభుత్వం రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియమించింది. దానినే మండల్ కమిషన్ అని పిలుస్తున్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు కమిషన్ అభిప్రాయ పడిన విధంగా తగు ప్రయోజనాలను ప్రస్తుత సందర్భంలో ఏ విధంగా సమకూర్చాలన్న ప్రశ్నను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. ఆ ప్రకారం ఆ యా తరగతులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ సంస్థలలో ముందుగా కొన్ని అదనపు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది’. భారత ప్రభుత్వ పరిధిలో గల సివిల్ ఉద్యో గాలు, సర్వీసులలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీలకు 27 శాతం ఖాళీలు రిజర్వ్ అవుతాయి; ఈ రిజర్వేషన్లు నేరుగా రిక్రూట్ చేసే ఖాళీలకు వర్తిస్తాయి; ఓపెన్ పోటీలో తమ ప్రతిభ ద్వారా ఎంపికయే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీ అభ్య ర్థులు 27 శాతం రిజర్వేషన్ కోటా కిందకు రారు’ అని అందులో పేర్కొన్నారు.మండల్ కమిషన్ రిపోర్టును అమలు జరుపుతామని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పలేకపోతోంది. కులగణన వరకే కాంగ్రెస్ పరిమితం అయితే, ఆ రోజు తమ హక్కులను కాలరాయడానికే కొత్త పార్టీ పెట్టిన బీజేపీ వైపే బీసీలు మళ్ళీ వెళ్తారు. కానీ వారిలోని మతపరమైన నమ్మకాలను రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందని మనం గమనించవలసిన అవసరం వుంది. బీజేపీ పాలనా పద్ధతిని బీసీలు గుర్తించలేకపోతున్నారు. ఈ విషయాన్ని తెలియ జెప్పటంలో కూడా కాంగ్రెస్, దళిత బహుజన పార్టీలు వెనుకబడి ఉన్నాయి.మండల్ కమిషన్ సిఫారసులను, వాటి అమలును వ్యతిరేకిస్తూ అనేక కేసులు దాఖలైనాయి. 1993లో సుప్రీంకోర్టు మండల్ ప్రతిపా దించిన బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ బీసీ కులాలను గుర్తించడానికి శాశ్వతంగా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అప్పటికి పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి. అందువల్ల పి.వి. హయాంలో మండల్ కమిషన్ సిఫారసుల్లో ఒకటైన ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాజకీయ, సామాజిక, పారిశ్రామిక తదితర సమస్త రంగాల్లో బీసీ రిజర్వేషన్లను అమలు జరపాల్సే ఉంది. హరియాణాలో జాట్లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాదు. అయినా జాట్లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసుకోగలిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు హుడా, సెల్జా మధ్య విభేదాలు బహిరంగంగానే బయట పడటం, సెల్జాను పక్కన పెట్టడం కొన్ని తరగతుల ప్రతినిధులను దూరం చేశాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ‘ఆప్’ ఒంటరిగా పోటీ చేయడం; స్థానికంగా ఉంటున్న జేజేపీ, దళితుల మద్దతున్న భీమ్ ఆర్మీ పార్టీతోనూ; ఐఎన్ఎల్డీ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకోవడం కూడా ఓట్ల చీలికకు దారి తీసింది.నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న ఉచితాలు కూడా బడ్జెట్లకు అతీతంగా ఉంటున్నాయి. ప్రజలను సోమరులను చేసే పథకాల కంటే కూడా ప్రజలను ఉత్పత్తిలో భాగం చేసి శ్రమ ద్వారా ధనం సంపాదించే ప్రణాళికలు ముఖ్యం. మాయావతి ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ అభివృద్ధికి, దళిత బహుజనుల ఆర్థిక సామాజికాభివృద్ధికి, మైనారిటీ సంక్షేమానికి, లా అండ్ ఆర్డర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి కాన్షీరాం బీసీలను, దళితులను ఐక్యం చేసే రాజకీయ వ్యూహాలు రచించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజనుల రాజ్యాధికరమే రావాల్సి ఉంది. ఇకపోతే జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి విజయపతాకం ఎగురవేయడం ఒక చారిత్రక అంశం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన దానికి ఫలితంగా ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. నిజానికి హిందూ రాజకీయాలు లౌకికవాదానికి గొడ్డలిపెట్టు. ఉత్పత్తిని, ఉపాధిని, శ్రమ సంస్కృతిని, మానవ జీవన వ్యవస్థల ప్రజ్వలనాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళే రాజకీయ ప్రణాళిక ఇప్పుడు అవసరం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మరీ ఇంత పిచ్చిగానా?.. ప్రజలు గమనిస్తున్నారు బాబూ..
అవినీతి కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికే కేవలం కమ్మ కుల నాయకుడిగా మార్చి మరీ పిచ్చిగా, ఆ కులానికి చెందిన కొందరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు అరెస్టుపైనే ఆందోళనతో ఉన్నట్లు చిత్రించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని టీడీపీ మీడియా సంస్థలు చేస్తున్న యత్నాలు కూడా ఇదంతా కమ్మ కులం అతి అన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నాయి. చంద్రబాబు జైలులో ఉంటే కృతజ్ఞతా సభల పేరుతో అవి అభినందన సభలో, సానుభూతి సభలో, సంతాప సభలో అర్థం కాని రీతిలో సంగీత విభావవరిలు నిర్వహిస్తున్నారు. అది కూడా పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్‌లో.. ✍️మరో వైపు ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో కొందరు దాడి చేసి నోటికి వచ్చినట్లు దూషించడం దారుణం. ఇంత కాలం ఆ కులం వారికి కాస్త సభ్యత, సంస్కారం ఉంటాయిలే అనుకున్నవారందరికి, ఇదేమిటి! ఈ కమ్మోళ్లు ఇంత నీచంగా మారారు అన్న అభిప్రాయం తెప్పిస్తున్నారు. ఒకవేళ రాంబాబుకు ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది. అది మళ్లీ రెండు కులాల మధ్య రగడగా మారేది కాదా!. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు ఆంధ్ర ప్రాంతం అంతా ఎలా అట్టుడికిందో తెలిసి కూడా కొంతమంది ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం దురదృష్టం. ✍️అంబటి రాంబాబు తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని ఇప్పటికే ఆరోపించారు. ఆయననే కాదు. కొడాలి నాని వంటి నేతలను చంపితే ఏభై లక్షలు ఇస్తామని కమ్మ సంఘం సమావేశంలో ఒక వ్యక్తి అంటే అది ఎంత వైరల్ అయిందో అందరికి తెలుసు. దాని వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే ప్రమాదం ఏమీ లేదు. కాని కమ్మ కులంలో పుట్టినవారందరిని ఇతరులు అసహ్యించుకునే పరిస్థితి తెస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం! ఏ కులాన్ని ఉద్దరించడం కోసం! ఎవరో కొందరు తెలివి తక్కువవాళ్లు చేసే చెత్త పనులకు ఆ కులంలో ఉన్నవాళ్లంతా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిగతా సమాజానికి దూరం అయ్యేలా చేస్తున్నారు. ✍️నిజానికి ఎవరూ చెప్పి ఫలానా కులంలో పుట్టరు. కాని మన సమాజంలో కుల వ్యవస్థ అన్నది ఒక వాస్తవంగా తయారైంది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటివారు ఈ కుల వ్యవస్థపై పోరాటాలు జరిపారు. మురళీమోహన్ వంటి సినీ ప్రముఖులకు చంద్రబాబు అంటే అభిమానం ఉండవచ్చు. ఆయన వల్ల రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ది పొంది ఉండవచ్చు. అంత మాత్రాన చంద్రబాబు అరెస్టుతో ప్రపంచం అంతా మునిగిపోయినట్లు, కమ్మ వారందరికి ఏదో అయిపోయినట్లు, అసలు చంద్రబాబు అవినీతికే పాల్పడనట్లు మాట్లాడుతున్న తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. బహుశా మరే కులంలో ఇంత పిచ్చి ఉండదని జనం అనుకునేలా చేస్తున్నారు. ✍️నిజంగానే అవినీతి లేకపోతే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ 118 కోట్లకు నోటీసు ఎందుకు ఇచ్చింది. రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని సీబీటీడీ గతంలో ఎందుకు ప్రకటన చేసింది? చంద్రబాబు మాజీ పి.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయాడు? వీటికి వీరెవ్వరూ జవాబు ఇవ్వడం లేదు. చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ లేదనేంత స్థాయికి ఈ వర్గం ప్రచారం చేయడం హాస్యాస్పదం. ఆ మాటకు వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బారేజీ, పోచంపాడు, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన గొప్పవాళ్లందరిని ఏమి అనుకోవాలి. హైదరాబాద్ లో కొందరు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు, పాటల కార్యక్రమాలు అన్ని అదేదో ఐటి నిపుణులనో, వేరే ఫ్రొఫెషనల్స్ చేస్తున్నారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో పాల్గొంటున్నవారిలో తొంభై శాతం మంది కమ్మవారే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ✍️ఆ మధ్య వీరి పైత్యం ఎక్కడివరకు వెళ్లిందంటే మెట్రో రైలులో ఎక్కి నిరసనలు తెలిపేవరకు. అక్కడ ఒకాయన ఇదేమి పని అడగవలసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో అలాంటి ఆందోళనలు చేయదలిస్తే ఆ పార్టీ పేరుతోనే చేయాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కుహానా మీడియాలను అడ్డం పెట్టుకుని వేరుపేర్లతో ఎందుకు చేయడం. లేదంటే ధైర్యం ఉంటే కమ్మ సంఘం పేరుతో నిరసనలు చేపట్టగలగాలి. ఈ మధ్య కొన్ని చోట్ల కమ్మ సంఘం సమావేశాలు జరిపి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఇంతవరకు క్లారిటీ ఉన్నట్లు లెక్క. అలాకాకుండా తెలుగుదేశం పార్టీవారే నిరసనలు చెబుతూ, ఏవేవో పేర్లు తగిలించడం వల్ల ఈనాడు వంటి మీడియాలలో ప్రచారానికి ఉపయోగపడుతుందే తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ✍️సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు కులాలకు అతీతంగా ఉండాలని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించరాదని నీతులు చెబుతుండేవారు. చివరికి ఆయనే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా మారారన్న అభియోగాలకు గురికావడం, అవినీతిని పూర్థిస్థాయిలో సమర్ధించడం చూస్తుంటే ఇంతకాలం ఈయన జనాన్నిమోసం చేశారా అన్న భావన ఏర్పడదా! చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే కమ్మవారు ఇంతగా కలత చెందవలసిన అవసరం ఏమి ఉంటుంది? ఆయనతోటే కమ్మకులం లేదు. లేదా ఆయన కమ్మవారిపైనే ఆధారపడి ఉండరు. ✍️నిజానికి చంద్రబాబు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కుమ్మక్కై ఏపీకి పరిశ్రమలే రాకుండా ఎంత నష్టం చేశారో వీరికి తెలియదా! కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత దానిని వదిలివేయడం,ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం అర్రులు చాచడం, మరో వైపు కాంగ్రెస్ కు తెలంగాణలో మేలు చేయడం కోసం కమ్మవారిలో ఎక్కువ మంది ఓట్లు కాంగ్రెస్ కు వేసేలా ప్లాన్ చేయడం.. ఇవన్ని సమాజానికి మంచిదా! తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీచేయడం లేదో ప్రజలు ఊహించలేరా? ఇతర రాజకీయ పార్టీలు గమనించలేవా?ఇలాంటి అనైతిక రాజకీయాలు చేస్తూ దానికి కులం రంగు పులిమి ఆ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయం ఎవరికి ఉపయోగం?. చంద్రబాబుకు హైదరాబాద్‌లో అంత ప్రజాభిమానం ఉందనుకుంటే టీడీపీ ఇప్పుడు ఎందుకు అక్కడ పోటీచేయడం లేదు. ✍️అసలు 2004లోనే ఇప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంగా ఉన్న చోట టీడీపీ ఘోరంగా ఓడిపోయిందే. కులం పునాదితో ఏ పార్టీ మనలేదన్న సంగతి వీరు గుర్తించాలి. ఏపీ ప్రజలను హైదరాబాద్ నుంచి ప్రభావితం చేయడానికో, న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచడానికో సభలు పెడితే వాటిని నమ్మడానికి అమాయకపు కాలం కాదు. గ్రాఫిక్స్ కాలం అంతకన్నా కాదు. చంద్రబాబు కేసులో నిరసనలు చెప్పడమే తప్పు. నిజంగా అక్రమ కేసులు అయితే సీఐడీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కోర్టులలో తమ వాదనలు వినిపించాలి. అవన్ని వదలివేసి ప్రజలలో అలజడి సృష్టించాలని చూడడం, అదేదో ఒక కులానికి వ్యతిరేకం అన్న కలరింగ్ ఇవ్వడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. పార్టీ పరంగా ఏమైనా చేసుకోండి. కులానికి మాత్రం ఈ బురద పులమకుండా ఉంటే మంచిదని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆస్తులు అమ్ముకుని పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం వారిని బుజ్జగిస్తూ..
జనం ఛీకొట్టినా తెలుగుదేశం నాయకత్వంలో మార్పు రావడంలేదు. ఆ పార్టీలో ఒక్కో కులానికి ఒక్కో న్యాయం అమలవుతోంది. అధికారంలో ఉన్నా అంటే.. అధికారం పోయినా అంతే. చంద్రబాబు సామాజికవర్గ నేతలకు ఇబ్బంది కలిగితే వెంటనే యాక్షన్ ఉంటుంది. ఇతర కులాల నేతలకు ఎంత ఇబ్బంది కలిగించినా పట్టించుకునేవారుండరు. ఇప్పుడిదే గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు గుంటూరు పచ్చపార్టీలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజికవర్గానికి మాత్రమే చెందిన పార్టీ అని తొలి నుంచి ప్రచారం ఉంది. పదవులు ఎవరికి ఇచ్చినా పెత్తనం మాత్రం ఒకే సామాజికవర్గం చేతుల్లో ఉంటుంది. అది చంద్రబాబు సామాజిక వర్గం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడుగు, బలహీనవర్గాల పార్టీ అని చంద్రబాబు పదే పదే డప్పు కొడుతుంటారు. కాని ఆయన చెప్పేదొకటి.. చేసేదొకటి. బీసీలైతే ఏమాత్రం తేడా వచ్చినా తొక్కేస్తారు. అదే మనోడైతే నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పచ్చపార్టీలో ఇదే జరుగుతోంది. నర్సరావుపేటలో గత ఎన్నికల్లో బీసీ నేత చదలవాడ అరవిందబాబు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నాలుగేళ్లనుంచి ఇన్చార్జిగా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే అరవిందబాబు ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఆస్తులను సైతం అమ్ముకుని నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీని నడుపుతున్నాడు. చదవండి: అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్లో మునకేశాడా? మరో ఏడాదిలోగా ఎన్నికలు రానున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు తెరపైకి వచ్చారు. తాము కూడా టికెట్ రేసులో ఉన్నామంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు కమ్మ సామాజికవర్గం నేతలతో సమావేశమై ఈసారి టికెట్ మన సామాజికవర్గానికే దక్కేలా చూడాలని కులపెద్దలను కోరినట్లు సమాచారం. అరవిందబాబును కట్టడి చెయ్యడానికి ఒకవైపు నల్లపాటి రాము, మరోవైపు కడియాల వెంకటేశ్వర్లు ఇద్దరూ తెగ పోటీ పడుతున్నారు. ఇన్ చార్జిగా ఉన్న అరవిందబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా ప్రతిరోజూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేష్ కు ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నర్సరావుపేటలో టీడీపీ అభిమానులందరూ పార్టీని బతికించడానికి అరవిందబాబు ఆస్తులు అమ్ముకుంటే.. చంద్రబాబు మాత్రం పార్టీని నాశనం చేస్తున్న కమ్మ సామాజికవర్గానికి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ నేతలతోపాటు పార్టీకి సపోర్టు చేస్తున్న ఎల్లో మీడియా కూడా బీసీ నేత అరవిందబాబుకు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నాయి. నర్సరావుపేట పక్కనే ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజికవర్గం నేతలు ఇన్ ఛార్జిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సత్తెనపల్లి టీడీపీ ఇన్ ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కన్నాను ఇన్ ఛార్జిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కోడెల శివరాం సొంత కుంపటి ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించినా ఎటువంటి చర్యలు లేవు. పైగా చంద్రబాబును విమర్శిస్తే పార్టీ నేతలు శివరాంను బుజ్జగించారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కన్నా కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కోడెల శివరాం కమ్మ సామాజికవర్గంకు చెందిన నేత కావడంతోనే పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నాయకులే. పుల్లారావుకు వ్యతిరేకంగా బాష్యం ప్రవీణ్ నారా ట్రస్ట్ పేరుతో పాగా వెయ్యడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నేతలు కొట్టుకోవడం మొదలయ్యింది. ఇక్కడ ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలు కావడంతో.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రక్షించుకోవడానికి అధినాయకత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. పుల్లారావును జో కొడుతూ భాష్యం ప్రవీణ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. షోకాజ్ నోటీసు పేరుతో అగ్ర నాయకత్వం భాష్యం ప్రవీణ్‌ను పిలిపించి బుజ్జగించి పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా భాష్యం ప్రవీణ్‌పై చర్యలు తీసుకోకపోవడానికి కమ్మ సామాజికవర్గం నేత కావడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇలా టీడీపీ అధినేత తన సామాజికవర్గానికి ఒక న్యాయం.. మిగతా సామాజికవర్గాలకు మరొక న్యాయం అంటూ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్!
తెలుగుదేశం యువ కిశోరం లోకేష్ బాబుకు ఉన్నట్టుండి రెడ్లు గుర్తుకు వచ్చారు. రాయలసీమలో పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్న లోకేష్‌కు ప్రత్యేకించి కడప జిల్లాకు వచ్చాకా రెడ్లు గుర్తుకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో అయినా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అయినా లోకేష్‌కు రెడ్లు గుర్తుకు రాలేదు. ఎందుకో ప్రత్యేకించి కడప జిల్లాకు వచ్చాకా రెడ్లు అంటూ మాట్లాడు తున్నారు. రెడ్ల సామాజిక వర్గ మీటింగులు పెడుతున్నారు! ఆ మీటింగుల్లో ఎవరో ఒక రెడ్డి చెప్పారట.. లోకేష్ పేరును లోకేష్ రెడ్డిగా పెట్టుకోమంటూ! ఏమిటో ఈ కలికాలం! చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా కడపకు మించిన స్థాయిలోనే రెడ్ల జనాభా ఉంది. అయితే లోకేష్ ఆ జిల్లాల్లో ఎక్కడా రెడ్ల ప్రస్తావన, రెడ్లను ఉద్ధరించే ప్రస్తావన తీసుకురాలేదు. మరి కడప రెడ్లనే లోకేష్ ఉద్ధరిస్తారు కాబోలు. తమది రెడ్ల పార్టీ అని చెప్పుకోవడానికి కడప జిల్లాలో లోకేష్ చాలా ప్రయాసపడుతున్నారు. తనకు నోరు తిరగని రీతిలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అయితే లోకేష్‌కు రెడ్లపై ప్రేమాప్యాయాతలు కారిపోతున్న దశలో గుర్తుకు చేసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. వాటిల్లో ఒకటి.. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలాల్లో హతమైన రెడ్లకు ఇప్పుడు లోకేషుడు ఏం సమాధానం ఇస్తారనేది! తన తండ్రి సీఎంగా ఉండగా.. అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర నాయకత్వంలో సాగించిన ఫ్యాక్షన్ హత్యాకాండలో కనీసం రెండు వందల మందికి పైగా ప్రాణాలు తీశారు కదా!. అందులో మెజారిటీ మంది కాంగ్రెస్ కార్యకర్తలు. కనీసం వంద మందికి పైగా రెడ్లు. రాజకీయ కక్షల కొద్దీ, అక్కసు కొద్దీ, ఆధిపత్యం కోసం జరిగిన హత్యలవి. మరి ఆ హత్యలు జరిగినప్పుడు రెడ్లు గుర్తుకు రాలేదా!. బహుశా అప్పటికి లోకేష్‌కు ఈ మాత్రం బుద్ధి కూడా రాలేదనుకుందాం. మరి చంద్రబాబుకు తెలియదా! 1995 నుంచి 2004ల మధ్యన అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఎంతమంది రెడ్లు కేవలం రాజకీయ కారణాలు, ఆధిపత్యం, ఫ్యాక్షన్ కారణాలతో హత్యకు గురయ్యారో లోకేష్‌కు తెలుసోలేదో కానీ... స్థానికులకు తెలుసు. అప్పటి చరిత్రను మరిచిపోదాం అంటారా.. 2014 నుంచి 2019 మధ్యన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెడ్లను తెగ నరకలేదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, లోకేషుడు మంత్రయ్యాకానే.. పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కంగటి నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయలేదా! పెద్దగా హడావుడి లేకుండా, కేవలం తన జీప్ లో మాత్రమే ప్రయాణిస్తూ.. ప్రత్యర్థులు తన కోసం పొంచి ఉంటారనే భయపడాల్సిన నేపథ్యం లేని నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయడంలో తెలుగుదేశం నేతల పాత్ర ఎంతో అప్పుడు లోకేష్ చెప్పరా?. రాప్తాడు ఎమ్మార్వో ఆఫీసులో ప్రసాద్ రెడ్డిని కత్తులతో నరికినప్పుడు లోకేష్‌కు రెడ్లు గుర్తుకు రాలేదు కాబోలు! నారాయణరెడ్డి కానీ, ప్రసాద్‌రెడ్డి కానీ విపరీతమైన ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వారు కాదు. కేవలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అడ్డుగా ఉన్న వారే కానీ.. వారేమీ తమ ప్రత్యర్థులను హత్యలు చేసిన వారు, చేయించిన వారు కాదు. కేవలం రాజకీయంగా అడ్డున్నారనే కారణాలతోనే ఈ హత్యలు జరిగాయి. ఇవే కావు.. పరిటాల రవి, ఆర్వోసీ కాలం నాటి హత్యలు కూడా కేవలం క్రూరత్వంతో, రాక్షసత్వంతో జరిగిన హత్యలే హత్యలను సమర్థించుకోవడానికి వాటికి ఫ్యాక్షన్ రంగును పులిమారు. చదవండి: బాబు బాగా ‘వరెస్టు’.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం.. ప్రత్యేకించి చంద్రబాబు తనయుడు అనంతపురం దాటాకా, కర్నూలు దాటుకుని వచ్చాకా.. కడపలో అడుగుపెట్టాకా రెడ్ల సంక్షేమం, రెడ్లపై ప్రేమాప్యాయతలు కురిస్తూ కామెడీ చేస్తున్నారు. ఇలా రెడ్లపై మాట్లాడే దమ్ము కనీసం, ప్రేమ చూపే శక్తి పక్క జిల్లాల్లో కూడా నీకు లేకపాయె కదా లోకేషా! తండ్రికి మించిన జిత్తుల మారిలా ఉన్నావే! ఎన్నికల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని స్వయంగా లోకేష్ తన ప్రకటన ద్వారా నిరూపించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు సరి కాదంటున్నారు రాయలసీమ వాసులు. ఒక రాయలసీమ రెడ్డి సోదరుడు సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం ఇది. -సత్యానందరెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్ -
చంద్రబాబు చేసింది కీడా? మేలా?.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అది. అభ్యర్ధి ఎవరైనా సరే క్యాడర్ అంతా కలిసి గెలిపించుకునేవారు. కాని గత ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. సైకిల్‌ను ముక్కలు చేసి మూలకు విసిరేశారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఆ ముక్కల్ని అతికించుకోవడానికి సైకిల్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. అధినేత అభ్యర్థిని ప్రకటించినా.. ఓ కమ్మ నేత టిక్కెట్ మాకే ఇవ్వాలంటూ పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చారట. జగ్గయ్యపేట తమ్ముళ్ల క్యాస్ట్ పాలిటిక్స్ మీరే చదవండి. కులం చుట్టూ రాజకీయం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటలా ఉండేది. టీడీపీ కేడర్ గతంలో కులం చూడకుండా అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేసేవారు. కాని నాలుగేళ్ళుగా అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయంటున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటకు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ తన భుజాన వేసుకుని నిర్వహిస్తున్నారు. అయితే ఏడాది క్రితం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన బొల్లా రామకృష్ణ జగ్గయ్యపేట పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యారట. అప్పట్నుంచి అక్కడి టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందట. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కీలకం కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని బొల్లా రామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన లోకేష్‌కు సన్నిహితుడు కావడం, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో బొల్లా ఏడాది నుంచి సెపరేటుగా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఆ మధ్య చంద్రబాబు జగ్గయ్యపేట వచ్చినపుడు బొల్లా, శ్రీరాం రాజగోపాల్ వేరువేరుగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు పార్టీలో పెద్ద రచ్చ రాజేశాయట. జగ్గయ్యపేట సీటు తనదంటే తనదని ఇద్దరూ కొట్టుకుంటున్న సమయంలో.. శ్రీరాం రాజగోపాల్‌ను ఆశీర్వదించాలంటూ తన పర్యటనలో చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించేశారు. చంద్రబాబు ప్రకటనతో తన లైన్ క్లియర్ అయ్యిందని శ్రీరాం రాజగోపాల్ సంతోష పడుతున్నప్పటికీ అసలు ముసలం ఇక్కడ్నుంచే మొదలైందట. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నెట్టెం రఘురామ్ ప్రస్తుతం టీడీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నను చంద్రబాబు ఒక్క మాటైనా అడగకుండానే శ్రీరాం రాజగోపాల్ ను జగ్గయ్యపేట అభ్యర్ధిగా ప్రకటించడంపై మూడు నెలలుగా నెట్టెం రగిలిపోతున్నాడట. మొన్నటి వరకూ శ్రీరాం రాజగోపాల్‌కు అండగా ఉన్న నెట్టెం ఇప్పుడు తన సామాజికవర్గానికి చెందిన బొల్లాకు మద్దతుగా నిలుస్తున్నారట. ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇప్పించాలనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తమ ఆశల పై నీళ్లు చల్లడాన్ని తట్టుకోలేకపోతున్నారట . అధిష్టానం నిర్ణయం మార్చుకుంటే సరేసరి లేకపోతే యుద్ధమే అంటున్నారట. మరోవైపు శ్రీరాం రాజగోపాల్ ను ఒంటిరిని చేసి... బొల్లా రామకృష్ణతో నెట్టెం చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారట. పాతాళానికి ప్రతిష్ట కమ్మ సామాజికవర్గ నేతకు కాకుండా శ్రీరాం రాజగోపాల్ కు సీటు ఇస్తే ఒప్పుకునేదే లేదని..అతనికి సహకరించేదే లేదని నెట్టెం రఘురాం తేల్చేశారట. ఇదే సమయంలో బొల్లా రామకృష్ణ పార్టీలో ఉన్న ముఖ్యనేతలను, క్యాడర్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కుల బలంతో పాటు క్యాడర్ అండ కూడా ఉందని అధిష్టానం ముందు బలప్రదర్శన చేయాలనే ఆలోచనలో ఉన్నారట బొల్లా. ఐతే టీడీపీ పెట్టిన నాటి నుంచి నియోజకవర్గంలో లేని క్యాస్ట్ పాలిట్రిక్స్ ను ఇప్పుడు చూసి జగ్గయ్యపేట తమ్ముళ్లు తల బాదుకుంటున్నారట. ఓవైపు చంద్రబాబేమో గెలిచేది మనమే ... వచ్చేది మనమే అని డబ్బా కొడుతుంటే ... జగ్గయ్యపేట నేతలేమో ఇలా కులం పేరుతో కొట్టుకోవడం పట్ల పార్టీలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఆ కులాల ఓటే శాసనం
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్పుట్లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్పుట్లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్పుట్గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది. 50% జనాభా ఆ రెండు కులాలే రాష్ట జనాభాలో రాజ్పుట్లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్పుట్లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్పుట్లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు. బీసీ, ఎస్టీలపై బీజేపీ వల రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్పుట్లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గులాబీ బాస్ మదిలో ఏముంది.. ఆ సీనియర్ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాలూ షెడ్యూల్డు తెగలకు రిజర్వు చేసినవే. ఆదివాసులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కావడంతో వీటిని వారికే రిజర్వు చేశారు. అటవీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి. కాలక్రమంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడి కాంగ్రెస్, టీఆర్ఎస్ హవా ఎక్కువైంది. జిల్లా కేంద్రం భద్రాచలం కూడా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్? భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థులే 8 సార్లు విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నా భద్రాచలం రూరల్ ప్రాంతాలు ఏపీలో కలవడంతో సీపీఎం హవా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పోదెం వీరయ్య మళ్ళీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. అంతకుముందు మూడు సార్లు విజయం సాధించిన సీపీఎం నేత సున్నం రాజయ్య గత ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు గాని కుమార్తె గాని బరిలో నిలబడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య వచ్చే ఎన్నికల్లో పినపాక వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు. అటు బీజేపీ సైతం భద్రాచలం ఫై ఫోకస్ పెట్టింది. కుంజా సత్యవతిని బరిలో దించాలని కమలం పార్టీ భావిస్తోంది. రెండు పార్టీలు బలంగానే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. జనరల్ సెగ్మెంట్ కావడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై కులాలు కచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ బలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో జలగం వెంకట్రావు కారు గుర్తు మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వనమా వెంకటేశ్వరరావు హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. దీంతో కొత్తగూడెంలో టిఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. చాలాకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న వనమా, జలగం ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో జలగం వెంకట్రావు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం ప్రచారాన్ని ఖండిస్తూ సైలెంట్ గా ఉంటున్నారు. అయితే జలగం వెంకట్రావు అధికార పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్య ఘటనతో వనమా వెంకటేశ్వరరావు అప్రదిష్టపాలయ్యారు. ఆయన కుమారుడు రాఘవ వల్ల ఎమ్మెల్యే గిరీ పోతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వేడి చల్లారింది. ఈ ఘటన తర్వాత వనమాకు ప్రాధాన్యం తగ్గి, తిరిగి జలగం వెంకట్రావుకు టిక్కెట్ ఇస్తారనే ఊహాగానాలు సాగాయి. అయితే పార్టీలో అటువంటి మార్పు జరుగుతుందనే సూచనలేమీ కనిపించడంలేదు. సీనియర్ నేతగా ఉన్న జలగంకు పార్టీ ప్రయార్టీ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టిక్కెట్వచ్చే అవకాశం లేకపోతే పాత ఇల్లు కాంగ్రెస్‌లో చేరే ఆలోచనలో జలగం ఉన్నట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు గులాబీ బాస్ కూడా జలగం వెంకట్రావును పొమ్మనలేక పొగబెడుతున్నారని చర్చించుకుంటున్నారు. మూడు గ్రూపులుగా విడిపోయి.. కాంగ్రెస్ విషయానికి వస్తే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం టిక్కెట్ఆశిస్తున్న ముగ్గురు నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు సైతం మూడు గ్రూపులుగా చీలిపోయి చేస్తున్నారు. బీజేపీ కొత్తగూడెం ఇన్చార్జ్గా కొనేరు చిన్ని కొనసాగుతున్నారు. ఆయన పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవంలేదు. ఫేస్‌వాల్యూ ఉన్న నాయకులు లేకపోవడమే బీజేపీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. కోల్డ్ వార్.. ఎస్టీ నియోజకవర్గమైన పినపాకలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ పార్టీ ఏదైనా అభ్యర్థుల గెలుపు ఓటములపై గిరిజనుల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలు పోడు భూములను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార బరిలో దిగుతుంటాయి. ఎన్నికల లోపు పోడు భూముల సమస్యను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరిస్తే ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. లేదంటే ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌నేత రేగా కాంతరావు పోటి చేసి గెలుపోందారు. గెలిచిన తర్వాత రేగా కాంతరావు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రేగా కాంతారావు వ్యవహరిస్తున్నారు. రేగా టీఆర్ఎస్లో చేరడంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కోల్డ్ వార్ నడుస్తోంది. రేగా కాంతరావు టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు నాయకుడు లేకుండా పోయారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పినపాకలో సైతం తరచుగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోదెం వీరయ్యను పినపాక నుంచి బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కారు పార్టీలో అసంతృఫ్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు నియోజకవర్గం వామపక్షాలకు కంచుకోట. సీపీఐ ఎంఎల్ పార్టీ నుంచి గుమ్మడి నర్సయ్య వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం గెలిచింది. కాని ఇప్పటికీ ఇల్లెందులో వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గంలో సైతం పోడు భూముల సమస్య తీవ్రంగానే ఉంది. గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇది అధికార పార్టీకి ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఇక్కడ హరిప్రియ, కోరం కనకయ్య ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2014లో కనకయ్య కాంగ్రెస్తరపున పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి హరిప్రియపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో హరిప్రియ కాంగ్రెస్తరపున పోటీ చేయగా..కనకయ్య టీఆర్ఎస్నుంచి బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్అభ్యర్థి హరిప్రియ విజయం సాధించారు. మొత్తం మీద ఎంఎల్‌పార్టీ కంచుకోటలో కాంగ్రెస్పాగా వేసింది. అయితే హరిప్రియ గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్‌పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకే పార్టీలో ఉన్న ప్రత్యర్థుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ కోరం కనకయ్య కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారనే టాక్నడుస్తోంది. అశ్వారావుపేటలో రసవత్తర పోరు.. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్యే పోటీ జరగబోతోంది. గత ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన మెచ్చ నాగేశ్వరరావు తర్వాత అందరితో పాటు కారు పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి గులాబీ గూటిలో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే తాటి వెంకటేశ్వర్లుకు గులాబీ టిక్కెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. టీఆర్ఎస్కు రాజీనామా చేస్తూ... తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్ మీద హాట్ కామెంట్స్ చేశారు తాటి వెంకటేశ్వర్లు. అయితే గెలిచినా గెలవకపోయినా గ్రూప్‌లు కట్టడంలో ముందుండే కాంగ్రెస్‌లో ఇప్పుడు మరో గ్రూప్ తయారైంది. ముగ్గురు నాయకులు టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే ప్రధాన పోటీ జరగబోతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు ఈ మధ్యన ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. దశాబ్దాలుగా ఉన్న పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీని గురించి పట్టించుకోకపోవడంతో ఆదివాసుల్లో గులాబీ పార్టీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఒకవైపు పోడు భూముల వివాదం, మరికొన్ని సంఘటనలు అటు ఎమ్మెల్యేకు..ఇటు అధికార పార్టీకి సమస్యగా పరిణమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ పేరుకు ఉంది గాని.. ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? -
Pawan Kalyan: ఉండాలంటాడా? పోవాలంటాడా?
ఎవరైనా బాణాన్ని గురి చూసి కొడతారు. పవన్ కల్యాణ్ ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దాన్ని ఊరికే గాల్లోకి వేస్తారు. అది ఎవరికి తగులుతుందో ఆయనకే తెలీదు. ఒక్కోసారి అది తిరిగొచ్చి ఆయనకే గుచ్చుకోవచ్చు కూడా! ‘కులభావన’ అని ఆయన మాట్లాడిన వాగ్బాణాల విషయంలో జరిగింది ఇదే. పవన్ తెలిసి మాట్లాడారో, అమాయకంగా మాట్లాడారో గానీ, ఏపీలో అన్ని కులాలూ ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ఇస్తున్నాయన్న అర్థం వచ్చింది. దాన్ని కవర్ చేయడానికి ఎల్లో మీడియా ఆ వార్తనే తిప్పిరాసింది. ఇంతకీ కులభావన చచ్చిపోతే సంతోషించవలసింది పోయి, అది ఉండాలని చెబుతున్నారంటే పవన్ దిగజారి మాట్లాడారని అనుకోవాలా? లేక, ఆయన ఒరిజినాలిటీ బయటపడిందని భావించాలా? ‘‘నేను అడుగుతున్నాను. ఏపీలో కుల భావన అన్నా పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. కుల భావన కూడా సచ్చిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి... అన్ని కులాల వ్యక్తులను చూడండి... కాపులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు.. ఎస్సీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అందరూ కలిపి వారి కులాలకు చేసుకున్నా నేను ఆనందపడతా! కానీ అలా చేయడం లేదు. ఆయన బాగుంటే చాలు, మా ముఖ్యమంత్రి నవ్వితే చాలు... అన్నట్లుగా ఉంటున్నారు. కడుపు నిండిపోతుందనుకుంటున్నారు. వారు చివరికి తమ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు.’ ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. సోషల్ మీడియాలో ఇది సహజంగానే వైరల్ అయింది. ఆ వీడియో చూస్తే, అందులో ఎడిటింగ్ జరిగినట్లు కనిపించదు. ఒకవేళ అందుకు భిన్నంగా అని ఉంటే దానిని కూడా తప్పుపట్టాలి. దీనికి ఈనాడు పత్రిక రాసిన వార్త చూడండి: ‘వివిధ కులాలకు చెందిన మంత్రులు వారి వర్గాల ప్రజలను అభివృద్ధి చేసే పరిస్థితి ఇక్కడ లేదు. మంత్రులంతా కలిసి మా సీఎం నవ్వితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు’ అని పేర్కొంది. నిజంగా పవన్ ఈ మాట అని ఉంటే అలా రాయడం తప్పు కాదు. అలాకాకుండా సోషల్ మీడియాలో వచ్చినది కరెక్టు అనుకుంటే, ఈనాడు పత్రిక ఎంత మోసపూరితంగా వార్తా కథనాన్ని ఇచ్చిందో ఇట్టే తెలిసిపోతుంది. అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు అని పవన్ అంటే, ఈనాడు మాత్రం దానిని మంత్రులను ఉద్దేశించి అన్నట్లుగా రాసింది. ఒకవేళ పవన్ ఆ మాట అని ఉంటే అభ్యంతరం లేదు. కానీ ముందుగా అన్న విషయాన్ని కూడా రాసి, ఆ తర్వాత పవన్ సర్దుకున్నారని రాస్తే అది నిజమైన జర్నలిజం అవుతుంది. అలాకాకుండా పవన్ తనకు నష్టం కలిగేలా మాట్లాడారని గ్రహించిన ఈనాడు దానిని సరిచేసే యత్నం చేసిందా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టిన దుష్టచతుష్టయంలో ఈనాడు మీడియా కూడా చేరిందన్న భావన ఏర్పడుతుంది. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు అని కూడా ఆయన అంటుంటారు. ఆ దత్తపుత్రుడిని కాపాడుకునే పనిలో ఈనాడు గట్టిగానే పనిచేస్తోందని అనుకోవచ్చు. పవన్ టీడీపీ భాషలోనే మాట్లాడడమే కాదు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిరి మాటలు మార్చడంలోనూ పోటీ పడుతున్నారు. ఒక్కోసారి అసలు కులం ఏమిటి? మతం ఏమిటి? కాపులకు రిజర్వేషన్ ఏమిటి? అంటూ ప్రసంగాలు చేసిన ఆయన ఇప్పుడు ఏపీలో ఆయా వ్యక్తులు తమ కులాలకు పని చేసుకోవాలని చెబుతున్నారు. కుల భావన సచ్చిపోయింది అంటే దానర్థం వివిధ కులాలు కలిసిమెలిసి ఉంటున్నాయనే కదా! కాపు కులానికి చెందినవారు కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదన్న ఆక్రోశం ఆయనలో కనిపిస్తుంది. అక్కడికి పవన్ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గాజువాక, భీమవరం నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పోటీచేసినా, రెండు చోట్లా ఓడిపోయారు. అది ఆయనకు జీర్ణించుకోలేని అంశమే. ఈ నేపథ్యంలోనే పవన్ నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయనిపిస్తుంది. ఆయా కులాల వారు ముఖ్యమంత్రి జగన్ నవ్వితే చాలు అన్నట్లు చూస్తున్నారని అంటే దానర్థం ఆయన వారందరినీ బాగా చూసుకుంటున్నట్లే కదా! ఒక రకంగా జగన్‌కు పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారన్నమాట. పవన్ కల్యాణ్ జనవాణి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం, ఆ తర్వాత మీడియాతో సంభాషించినప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే... అచ్చంగా తెలుగుదేశం–2 అని ఎవరైనా అనుకుంటే అందులో తప్పు కనబడదు. చంద్రబాబు నాయుడు ఏ విమర్శలు చేస్తున్నారో, వాటినే పవన్ కూడా చేస్తున్నారు. టీడీపీ చెప్పే అసత్యాలనే ఈయన కూడా భుజాన వేసుకుంటున్నారు. ఈయనకు సొంతంగా భాష, భావం లేవా? అన్న ప్రశ్నకు ఆస్కారం ఇస్తున్నారు. జనవాణి నిర్వహించడం మంచిదే. కానీ ప్రజల సమస్యల పరిష్కారం కన్నా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై ఎంత వీలైతే అంత బురద జల్లాలన్న తాపత్రయం కనబడుతుంది. ఉదాహరణకు రేణిగుంట వద్ద ఒక మహిళకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆరోపణ వచ్చింది. ఆ మహిళను బహుశా స్థానిక జనసేన నేతలు తెచ్చి ఉంటారు. వారికి వాస్తవం తెలిసి ఉండాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమె స్థలం రద్దు అయింది. దానికి కారణం ఆమె అక్కడ నిబంధన ప్రకారం ఇల్లు నిర్మించుకోకపోవడమే. ఆ తర్వాత మరో వ్యక్తికి అధికారులు స్థలం కేటాయించారు. అయినా ఆమెకు మళ్లీ స్థలం ఇవ్వాలని కోరితే తప్పు పట్టనవసరం లేదు. అలా కాకుండా వైసీపీ నేతల దౌర్జన్యం అని పవన్ ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ వాస్తవాలు వెలుగులోకి తెచ్చింది. ఇలా అవకాశం ఇవ్వడం ద్వారా పవన్ తనకు కూడా విశ్వసనీయత లేదని చెప్పకనే చెప్పినట్లయింది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు జతచేయడంపై చెలరేగిన వివాదంలో టీడీపీ, జనసేనల పాత్రపై; మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను దగ్ధం చేసిన తీరుపై అప్పుడే పవన్ ఖండించి ఉన్నట్లయితే ఆయనకు మంచి పేరు వచ్చేది. అప్పుడేమో టీడీపీ లాగానే కులచిచ్చు అన్నారు. ఇప్పుడు అంబేడ్కర్ జిల్లాను స్వాగతిస్తున్నామని చెబుతూనే, ఏదో పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందనీ, అలా చేస్తూ ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా అంబేడ్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లా, లేదా? ఒక స్టూడియో యజమానిని విశాఖలో వైసీపీ నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. దాన్ని స్పష్టమైన ఆధారాలతో బయటపెడితే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది కదా! ఆ పనిచేయరు. అది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమేనన్నమాట. వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక గొడుగు కిందకు వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తూ, ఇంటికి ఒకరు బయటకు వచ్చి ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు. తదుపరి మూడు రోజులకు పవన్ నోట అవే పలుకులు వచ్చాయి. తన ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని కూడా పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదెలా సాధ్యం? పవన్‌కు ఏపీలో ఏమైనా ఆస్తులుంటే వాటిని ప్రభుత్వం లాక్కుందా? ఆయనకు వచ్చే సంపాదన రాకుండా చేసిందా? తన సినిమాలు ఆపేస్తున్నారని ఆయన అన్నారు. కొంతకాలం క్రితం ఆయన సినిమా విడుదలైంది కదా! ఎవరైనా ఆపగలరా? నిజంగా అలా జరిగితే ఈ పాటికి కోర్టుకు వెళ్లి గందరగోళం చేసేవారు కాదా? వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో తామే తెలియజేస్తామని ఆయన అన్నారు. మంచిదే. అంతకు ముందుగా తాను ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేతగా వ్యవహరించాలి కదా! సినిమా షూటింగులా మధ్యలో వచ్చి డైలాగులు చెప్పి వెళ్లిపోవడానికి ఇది సినిమా కాదు కదా! ప్రజా జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ తాను ఎంత బాధ్యతగా ఉన్నానన్న విషయాన్ని ఆయనే ఆత్మ విమర్శ చేసుకోవాలి. సింççహాసనం ఖాళీ చేయండి... ప్రజలు వస్తున్నారు... అని ఒక కవి మాటలను పవన్ ఉటంకించడం బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో అదే ప్రజలు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారన్న సంగతిని గుర్తించడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు. అదే అసలు సమస్య. తనను ఘోరంగా ఓడించి, జగన్‌ను ఇంత ఘనంగా గెలిపిస్తారా అన్న దుగ్ధ. సరిగ్గా చంద్రబాబు కూడా ఇదే సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారు. జగన్ తనకంటూ ఒక సొంత అజెండాను పెట్టుకుని జనంలోకి వెళ్లి, వాళ్ల ఆదరణ పొందారు. కానీ పవన్ కల్యాణ్ వేరేవారి అజెండా కోసం తన జెండాను మోస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
జీవితంలో మూడేళ్లు వృథా
అహ్మదాబాద్: కాంగ్రెస్‌లో ఉండి తన జీవితంలో మూడేళ్లు వృథా చేసుకున్నానని గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వాపోయారు. ఆయన బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని హార్దిక్ మండిపడ్డారు. గురువారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో అధికార బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ లేదా మరో రాజకీయ పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదనన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి ఘనతలు బీజేపీ సాధించిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌లో ముందుచూపు లేని నేతలు ఉన్నారని, గుజరాత్ ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతం.. వాడుకో, వదిలించుకో గుజరాత్లో తనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినప్పటికీ ఏనాడూ సరైన పని అప్పగించలేదని, గౌరవం కల్పించలేదని హార్దిక్ ఆక్షేపించారు. పటీదార్ కోటా ఉద్యమంతో గుజరాత్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతగానో లాభపడిందన్నారు. అయినప్పటికీ కీలకపార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో 25 ఏళ్లుగా 7–8 మందే పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. సెకండ్ క్యాడర్ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. వాడుకో, వదిలించుకో.. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు కావాల్సింది చింతన్(మేధోమథనం) కాదు, చింత అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. హార్దిక్ పటేల్‌కు జైలు భయం: కాంగ్రెస్ హార్దిక్ వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తిప్పికొట్టారు. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా పత్రం తయారు చేసుకున్నాడని విమర్శించారు. అతడిపై దేశద్రోహం కేసు నమోదయ్యిందని గుర్తుచేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే కాంగ్రెస్‌ను వీడాడన్నారు. -
కులాల లెక్కన...‘ఆకర్ష్’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రస్తుతం కులాలు, వర్గాల వారీగా ఓట్లను రాబట్టగల నేతలను ఆకర్షించడంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రధాన కులాలను ప్రభావితం చేయగల సమర్ధులైన కీలక నేతలపై ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు, వారిని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా యూపీలో అధికారాన్ని కాపాడుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే ఫిరాయింపుదారులకు రెడ్‌కార్పెట్ వేయగా, ఎన్నికల షెడ్యూల్ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీజేపీ వ్యూహాన్ని చిత్తుచేసే పనిలో పడింది. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు రాజీనామా చేసి బీజేపీని వీడటం, వారి బాటలోనే బీజేపీకి మరో నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో వలసల పర్వం హీటెక్కుతోంది. ముందే చేరికలను తెరతీసిన బీజేపీ గడిచిన ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే అన్ని పార్టీల కన్నా ముందుగానే మేల్కొన్న పార్టీ అధిష్టానం గత ఏడాది నవంబర్ నుంచే ప్రభావవంతమైన నేతలను ఆకట్టుకునే యత్నాలు ఆరంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కాళీచరణ్, మహారాజ సుహేల్దేవ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బాబన్ రాజ్‌భర్‌ను పార్టీలో చేర్చుకుంది. 2.4 శాతంగా ఉన్న రాజ్భర్లు గతంలో బీజేపీతోనే ఉన్నా సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో వీరి ఓట్ల అటువైపుకు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. ఇక బ్రాహ్మణ వర్గాలు ఏమాత్రం చేజారిపోకుండా కాంగ్రెస్‌కు చెందిన మాజీ హోంమంత్రి, ప్రయోగ్‌రాజ్ నుంచి మూడుస్లార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద్ర త్రిపాఠితో పాటు మరో మాజీ మంత్రి జై నారాయణ్ తివారీ, మరో కీలక నేత విజయ్ మిశ్రాలను పార్టీ కండువా కప్పింది. బీఎస్పీ నుంచి ఎస్పీకి దళిత ఓటు బ్యాంకు వెళ్లకుండా ఎస్సాలోని ప్రముఖ దళిత నేత సుభాస్ ఫసికి కాషాయ కండువా కప్పింది. ఎస్పీని బలహీనపర్చే యత్నంలో గత నవంబర్‌లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రవిశంకర్సింగ్, నరేంద్రసింగ్ భాటి, సీపీచాంద్, రామ్ నిరంజన్లను పార్టీలోకి లాగేసింది. వీరంతా ఠాకూర్ వర్గానికి చెందిన వారే. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా నేపథ్యంలో మేల్కొన్న బీజేపీ బుధవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరిఓంలను పార్టీలో చేర్చుకుంది. æ ఆటలో వేడి పెంచిన ఎస్పీ చేరికలపై బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన మరుక్షణమే వారికి షాక్ ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్‌లోనే ఆరుగురు బీఎస్పీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో ఆట మొదలు పెట్టిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ప్రస్తుతం మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌ల రాజీనామాతో వేడి పెంచారు. స్వామి ప్రసాద్ సహా ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన నలుగురు ఎమ్మెల్యేలు 14న ఎస్పీలో చేరే అవకాశం ఉంది. ఓబీసీ వర్గాల్లో స్వామి ప్రసాద్‌కు గట్టు పట్టు ఉండగా, మిగతా ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే వారే. వీరితో పాటు మరో 13 నుంచి 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా ఓబీసీ, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ముస్లిం వర్గాల్లో గట్టి పట్టున్న ఇమ్రాన్ మసూద్‌ను ఎస్పీ చేర్చుకోగా, ఆయనతో పాటే ఇద్దరు ఎమ్మెల్యేలు నరేశ్ సైనీ, మసూద్ అక్తర్‌లో ఎస్పీలో చేరారు. 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలకుండా ఇప్పటికే కాంగ్రెస్, బీఎస్పీలలో మైనారిటీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేలా అఖిలేశ్ వ్యూహ రచన చేస్తున్నారు. -
చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు
లక్నో: ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఇప్పట్నుంచే ఆ రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అందులోనూ చిన్న పార్టీల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ పార్టీలపై ప్రధాన పార్టీలు వల వేశాయి. వారిని తమ వైపు లాక్కుంటే ఓట్లు చీలకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్లాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వందల ఓట్లను ఈ పార్టీలు దక్కించుకున్నా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అధికంగా ఉంది. దీంతో డజనుకి పైగా చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కెలకి దిగుతున్నాయి. అధిక సీట్లను ఆశిస్తూ బేరసారాలకు దిగుతున్నాయి. 2017 ఎన్నికల్లో వివిధ చిన్న పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో విజయాన్ని సాధించినట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సమాజ్‌వాదీ పార్టీ చెబుతూ ఉంటే, బీజేపీ కూడా వారితో పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగతంగా బలపడి తాము ఒంటరిపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మార్చి 14తో ముగియనుంది. ఆలోపే రాష్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ సత్తా ఎంత అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీ(యూ), ఆర్పీఐ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన నిషాద్ పార్టీకి దాదాపుగా ఆరు లోక్‌సభ స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక అప్నాదళ్ (ఎస్), ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు (ఎస్బీఎస్పీ) ఓబీసీల్లోని కుర్మీ వర్గంపై పట్టు ఉంది. బీజేపీతో కలిసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్బీఎస్పీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్న ప్రకాశ్ రాజ్‌భర్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. తూర్పు యూపీలో యాదవుల తర్వాత రాజ్భర్ల ప్రాబల్యమే ఎక్కువ. ఇటీవల ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ ఆధ్వర్యంలో 10 చిన్నాచితకా పార్టీలతో భగధారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. ఈ కూటమిలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 100 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలైనా తమతో చేతులు కలపవచ్చునని ఆ కూటమి పిలుపునిచ్చింది. ఇక సమాజ్‌వాదీ పార్టీకి రాష్ట్రీయ లోక్ దళ్, మహన్ దళ్, జన్వాడీ సోషలిస్టు పార్టీ, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు ఉంది. మహన్ దళ్ పార్టీకి శక్య, సైని, మౌర్య, కుష్వాహ ఓబీసీ వర్గాల్లో పట్టు ఉంది. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాల్లో వీరి ఓట్లే దాదాపు నలభై శాతం వరకు ఉన్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాడీ సోషలిస్టు పార్టీకి బింద్, కశ్మప్ వర్గాల్లో మంచి పట్టు ఉంది. డజనుకు పైగా జిల్లాల్లో ఈ పార్టీ తన ప్రభావాన్ని చూపించగలదు. శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ బీజేపీయేతర పార్టీలతో చేతులు కలపాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లోకి తొంగి చూస్తే.. ► 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ► 2017 ఎన్నికల్లో ఏకంగా 290 పార్టీలు పోటీ చేశాయి ► ఎస్బీఎస్పీ పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో గెలిచింది. ఈ పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో 34.14 శాతం ఓట్లను కొల్లగొట్టింది. ► అప్నాదళ్ (ఎస్) 11 స్థానాల్లో పోటీ చేసి 39.21 శాతం ఓట్లను సాధించింది. మొత్తం అన్ని స్థానాల ఓట్ల పరంగా చూస్తే 0.98 శాతం ఓట్లను దక్కించుకున్నట్టయింది. ► పీస్ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. అయితే తాము పోటీ చేసిన స్థానాల్లో 1.56 శాతం ఓట్లను సాధించింది. మొత్తం ఓట్లలో 0.26% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ► 2017 ఎన్నికల్లో 32 చిన్న పార్టీలకు 5 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు వచ్చాయి. ► మరో ఆరు చిన్న పార్టీలు 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే, ఇంకో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు 56 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టాయి. -
నా పెళ్లే అందుకు నిదర్శనం: అఖిలేశ్
న్యూఢిల్లీ: తానెప్పుడు కుల రాజకీయాలు చేయలేదనీ, చేయబోనని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. మరో సామాజికవర్గానికి చెందిన యువతి డింపుల్‌ను తాను పెళ్లి చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ మాట్లాడుతూ..‘కులం, మతం వంటి విషయాలను నేను నమ్మను. నా పెళ్లే దీనికి పెద్ద ఉదాహరణ. ఎందుకంటే వేర్వేరు కులాలకు చెందినవారైనప్పటికీ నేను, డింపుల్ పెళ్లి చేసుకున్నాం. కులం గోడలు బద్దలుకొట్టి వివాహం చేసుకున్నాం’ అని తెలిపారు. బీజేపీ కుల, మత రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. డింపుల్ ఘర్వాల్ సామాజికవర్గానికి చెందినవారు కాగా, అఖిలేశ్‌ది యాదవ సామాజికవర్గం. -
కుల రాజకీయాలు ఫలించవు
కనౌజ్/హర్దొయి/సీతాపూర్: విపక్ష కూటమి కుల రాజకీయాలు ఫలించవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అవకాశవాదుల కూటమికి కేంద్రంలో బలమైన (మజ్బూత్) ప్రభుత్వం కాకుండా నిస్సహాయ (మజ్బూర్) ప్రభుత్వం కావాలని, ఎందుకంటే ప్రజాధనాన్ని దోచుకుంటూ కులాల మంత్రం జపించడమే వారి లక్ష్యమని విమర్శించారు. తనను కుల రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టున్న కనౌజ్‌తో పాటు హర్దొయి, సీతాపూర్‌లలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు. ఎస్పీతో పాటు విపక్ష బీఎస్పీ, ఆర్‌ఎల్డీలపై విరుచుకుపడ్డారు. ఆదో పెద్ద కల్తీ (మహా మిలావతి) కూటమిగా అభివర్ణించారు. కుల రాజకీయాలపై తనకు నమ్మకం లేదన్నారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల యాప్‌కు ‘భీమ్’గా నామకరణం చేసిందని గుర్తుచేశారు. బీజేపీకి మద్దతు పలకాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు వేసే ప్రతి ఓటూ నేరుగా మోదీ ఖాతాలోకే వస్తుంది. మాయావతీజీ, నేను చాలా వెనుకబడిన వారం. కానీ నన్ను మాత్రం కుల రాజకీయాల్లోకి లాగొద్దని చేతులు జోడించి కోరుతున్నా. మొత్తం 130 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే. నన్ను విమర్శించేవారు చెప్పేవరకు దేశానికి నా కులమేంటో తెలియదు. వెనుకబడిన కులంలో పుట్టడమనేది దేశానికి సేవ చేయడానికి లభించిన ఓ అవకాశంగా నేను భావిస్తున్నా..’అని మోదీ అన్నారు. ఓటమి అంచుల్లో ఉన్న విపక్షాలు దుర్భాషలకు దిగుతున్నాయని విమర్శించారు. మీరెన్ని (విపక్షాలు) ప్రయత్నాలు చేసినా వచ్చేది.. అని మోదీ అనగానే ప్రజలు ‘మళ్లీ మోదీనే’అంటూ నినదించారు. ఎస్పీ, బీఎస్పీల అవకాశవాదాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అంబేడ్కర్‌ను అగౌరవ పరిచిన ఎస్పీ కోసం మాయావతి ఓట్లు అడుగుతున్నారని మోదీ అన్నారు. కేవలం అధికారం కోసమే మాయావతి ఎస్పీ మద్దతు కోరుతున్నారని విమర్శించారు. మే 23న చరిత్ర సృష్టిస్తాం కొందరు తెలివైనవారు బంగాళాదుంప నుంచి బంగారం వెలికితీస్తామనే హామీ ఇచ్చారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి హామీ తాను కానీ, తన పార్టీ కానీ ఇవ్వలేదన్నారు. నెరవేర్చలేని వాగ్దానాలు తాము చెయ్యబోమని, అబద్ధాలు చెప్పమని అన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత చరిత్ర సృష్టిస్తామని మోదీ అన్నారు. మండుటెండలో సైతం తన సభలకు జనం పోటెత్తడాన్ని బట్టి. 2014 నాటి రికార్డును తిరగరాసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టుగా కన్పిస్తోందని చెప్పారు. చౌకీదార్‌ను, రామభక్తులను విమర్శించిన వారి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను నిద్రపోనివ్వని, అవినీతిపరులను వణికించే, దేశానికి మరిన్ని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టే బీజేపీకి ఓటేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. -
నిజామాబాద్‌లో.. కుల రాజకీయం !
మోర్తాడ్(బాల్కొండ): పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు కుల సంఘాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని వివిధ గ్రామాలలో కుల సంఘాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే సత్తా కులసంఘాలపై ఉండడంతో కులాలకు గాలం వేసే పనిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అన్ని నియోజకవర్గాల పరిధిలో కుల సంఘాల ప్రభావం అధికంగా ఉంది. అయితే పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోసం జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తడం కోసం రైతులు 175 మంది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన రైతుల్లో ఎక్కువ మంది రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే రైతులు పోటీలో ఉండడంతో వారి సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు తమకు రావనే ఉద్దేశ్యంతో ఇతర సామాజిక వర్గాల ఓట్ల కోసం నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే వాటిలో గురడి కాపు, మున్నూర్‌కాపు, గౌడ, దళితులు, ముదిరాజ్, పద్మశాలి, ముస్లిం, యాదవ, గిరిజనులు తదితర కుల సంఘాలు ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసేంత మెజారిటీ ఓటర్లు వైశ్యులలో ఉన్నారు. ఈ కుల సంఘాల పెద్దమనుషులతో చర్చలను సాగిస్తున్న నాయకులు కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల మద్దతును కూడగట్టుకుంటే ఎక్కువ ఓట్లను రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు. కుల సంఘాలకు తాయిలాలను ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాలను చేయిస్తున్నారు. ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కుల సంఘాల మద్దతును కూడగట్టుకోవడానికి అన్ని పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నం వారు చేశారు. కుల సంఘాలను తమవైపు తిప్పుకుంటే సభలు, సమావేశాలకు జన సమీకరణ సులభంగా ఉండడమే కాకుండా ఎన్నికల్లో గెలుపు సునాయసం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా అందరికి కులసంఘాలు జై కొడుతున్నాయి. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ నెలకొంది. -
గుంటూరు రూరల్ ఎస్పీని కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు
సాక్షి, గుంటూరు : బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా వ్యవహరించిన గురజాల సీఐపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి గురజాల సీఐ రామరావుపై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం కేసును ప్రత్యేక డీఎస్పీతో దర్యాప్తు చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారన్నారు. అంతేకాక కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అసలు ఓట్లు తొలగించి దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. -
చంద్రబాబుకు సవాల్ విసిరిన జీవీఎల్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు బహిరంగ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేస్తోన్న కుల రాజకీయాలపై.. ఆ పార్టీపై వస్తోన్న అవినీతి ఆరోపణల నిర్థారణకు చంద్రబాబు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపవేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్ సమ్మాన్’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్ కార్యక్రమానికి తెర తీశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ జీవీఎల్ చేశారు. హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు.. నాలుగేళ్లలో అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కోతల రాయుడు చంద్రబాబు.. అమరావతి విషయంలో చెప్పింది కొండంత అయితే చేసింది మాత్రం గోరంత కూడా లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు సినీ పక్కి రాజకీయాలు చేస్తూ.. అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు దొంగ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ నాయకులు విభజన చట్టం తయారయ్యే రోజున నిద్ర పోయారా అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడదామని చంద్రబాబు కేసీఆర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కాకుండా అవినీతిలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. -
ఈ ‘జాడ్యం’ ఈనాటిది కాదు
తెలుగుదేశం అధినేతలో ప్రకోపిస్తున్న కుల జాడ్యానికి చాలా సంవత్సరాల చరిత్రే ఉంది. వెనక్కు తిరిగి చూస్తే ఆయన గత చరిత్రలో దీనికి సంబంధించి ఎన్నో దృష్టాంతాలు దొరుకుతాయి. కమ్మ సామాజిక బృందానికే చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు.. రైతుకూలీల, బడుగుజీవుల ఈతిబాధలకు దారీ తెన్నూ చూపడానికి ఎనలేని కృషి సల్పి, పలు ఉద్యమాలు నిర్వహించిన ఆచార్య రంగా తెలుగు సమాజంలో ఇతర కులాలను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో పోలిస్తే ఆయన కులంలోనే పుట్టిన చంద్రబాబు సొంతమామకు వెన్నుపోటు పొడవడమే కాకుండా, నమ్మి వచ్చిన ఆశ్రితులను మోసగించి పబ్బం గడుపుకోవడంలో ఆరితేరిపోయారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు పాలనలో ఒకే ఒక సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధా న్యం లభిస్తోందన్నది ఆరోపణ కాదు, నిజం. టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతిని నా జీవితంలో ఎన్నడూ చూడ లేదు. ప్రతిపనికీ 20 నుంచి 30 శాతం దాకా బేరాలు సాగుతున్నాయి’’ – టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుడు, అదే సామాజిక వర్గాని(కమ్మ)కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ (15.02.2019) ‘‘చంద్రబాబులో కరడుకట్టిన కులతత్వాన్ని వ్యతిరేకించడానికీ, ప్రశ్నించడానికే టీడీపీని విడిచిపెట్టి వైఎస్సార్సీపీలో చేరాను. తన కులం లోని ఉన్నత వర్గాలకు తప్ప బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిం దేమీ లేదు. చివరికి పవిత్రమైన పసుపు–కుంకుమను బాబు జారుడు బండపై పోశారు. అవినీతి మార్గంలో అది గాలికి కొంత, నేలపై కొంతా జారవిడిచేశారు’’ – టీడీపీకి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ (14.02.2019) మనిషిలో వ్యక్తిత్వ వికాసం కేవలం ఎం.ఏ.లు, రాజకీయ, ఆర్థిక శాస్త్రాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (అదీ పరీక్ష పేపర్లు దిద్దే ప్రొఫెసర్ల పుణ్యమా అని)లో పట్టాలు పొందినంత మాత్రాన కలగదు. మరి ఆ ‘వికాసం’ ఎలా ఉదయిస్తుంది– మంచి, చెడుల్ని నిర్ణయించే అతని ప్రవ ర్తనా నిబంధనావళి ద్వారానే రూపొందుతుంది. నిజానికి ఈ పరివర్తన కూడా ఒక విధంగా ‘జన్యు’ (జీన్స్) లక్షణ ఫలితమే అయి ఉండాలి. ఈ జన్యువే నాయకుడి మతిస్థిమితాన్ని కూడా తారుమారు చేస్తుంది. పార్ల మెంటు సమావేశాలు ముగిసేముందు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్న ట్టుగా బీజేపీతో నాలుగున్న రేళ్లుగా చెట్టాపట్టాలుకట్టి, కేంద్ర ప్రభుత్వ సంకీర్ణంలో భాగస్వామిగా ఉండి తన ‘తారాబలం’ వికటించేసరికి ఎత్తులు మార్చి నానా బాపతు రాజకీయ పక్షాలతో అకస్మాత్తుగా ‘పొత్తులు’ కలిపాడు బాబు. ఆ పొత్తుల్ని సమర్థించుకొని, తాను తెలుగు దేశం వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ను పొడిచిన వెన్నుపోటుతో సమానంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే వెన్నుపోటు పొడవడానికి బాబు సిద్ధమ య్యాడు. అందుకు సాకుగా మతిభ్రమించి ఢిల్లీలో ‘ఐక్య సంఘటన’ పేరిట ఏర్పాటైన సభలో ఆయన ఆడిన పచ్చి అబద్ధం ఏమిటో ఒక్కసారి పరిశీలించండి: ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డంకులు కల్గించడమే బీజేపీ –వైఎస్సార్ కాంగ్రెస్–టీఆర్ఎస్ల ఎజెండా. వీళ్లే అవంతి శ్రీనివాస్ (ఎంపీ) లాంటి వారు టీడీపీ నుంచి వెళ్లిపోవడానికి కారకులు. కనుకనే పొరుగు రాష్ట్రంలో ఆస్తులున్న టీడీపీ నాయకుల్ని బెదిరించి టీడీపీని వదిలి వెళ్లి పోతున్నట్టు వేధించేస్తున్నారు’’ (విజయవాడ 15.02.2019). అసలీ భయం వెనుక బాబు ఆందోళన వెనుక దాగిన రహస్యం ఏమిటి? ఈనెల 15వ తేదీన టీడీపీని వీడిపోయిన దాసరి రమేష్‌తో పాటు, రమేష్ సామాజిక వర్గానికే చెందిన అడుసుమిల్లి జయప్రకాశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కూడా వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డితో ఒకే వేదికపై సమావేశమై ఉండటమే– చంద్రబాబు తలనొప్పికి, మతిభ్రమణకు కూడా కారణమై ఉంటుంది. ఈ సందర్భంగా అవకాశవాద పరాకాష్టకు నిదర్శనంగా రాష్ట్ర రాజ కీయాల్లో ఒక అగ్రకులానికి, అదే సామాజిక వర్గానికి చెందిన ఒక యువ నాయకుడు మరో పెద్ద మనిషి కుమార్తెను వివాహమాడటానికి ముందు చేసిన నీతిమాలిన పని గుర్తుకొస్తోంది. అది తాడేపల్లి గ్రామం. ఆ ఊరి పిల్లను ముందు ఖాయం చేసుకున్నాడా యువనేత. కట్న కానుకల నిర్ణయం కూడా అయిపోయింది. అప్పటికి అతనికి ఉన్న ఆస్తి రెండున్నర ఎకరాలు. అయినా అతనికి పెళ్లికూతురు తల్లిదండ్రులు 3 ఎకరాల జామ తోట, 70 కాసుల బంగారం 50 వేల రూపాయల నగదు కట్నంగా ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ పిల్లతో నిశ్చితార్థం అయిపోయింది. పైగా పెళ్లికొడుకు ఊరి సర్పంచి సమక్షంలోనే తాంబూలాలు పుచ్చుకోవ డమూ అయిపోయింది. కానీ యువనేత అయిన ఆ పెళ్లికొడుకు కాస్తా మాట తప్పి, అవతల మరో పెద్ద మనిషి తాలూకు సంబంధం కళ్లకు జిగేలుమనిపించి, తనకు ‘అవతల మరొకరు 20 లక్షల కట్నం ఇవ్వ జూపారు కాబట్టి’ తాడేపల్లి సంబంధాన్ని సునాయాసంగా వదిలేశాడు. అలా ‘పసుపు–కుంకుమ’ తతంగం ‘మైల’ పట్టడం, నేలపాలు కావటం ఆనాడే జరిగిపోయింది. ఆ ఘట్టం అలా ముగియగా, తరువాత ఎదిగిన మైకంలో ‘యువ నేత’ మరో పాపపు అధ్యాయానికి తెరతీశాడు. అతనికి ఉన్న ఒక కంపెనీకి తన స్నేహితుడైన మరొక పేరుమోసిన స్నేహితుడ్ని కూడా డైరెక్టర్‌గా చేర్చుకుని అతనికి చేసిన మోసం ఓ పెద్ద ఫోర్జరీ కావటం. ఇంతకీ ఏం జరిగిందట– ‘నువ్వు పదూళ్ల పాపరాజువి, కంపెనీ ట్రాన్షా క్షన్స్కు అవసరమైన తీర్మానం చేయవలసివస్తే నీవు ఎక్కడ ఉంటావో వెతకలేం కాబట్టి రెండు తెల్ల కాగితాల మీద నీ సంతకాలు చేసి పొమ్మ’ని ఆ యువనేత కోరగానే ఆ పదూళ్ల పాపరాజు కాస్తా తెల్ల కాగితంమీద (బ్లాంక్ పేపర్) నమ్మకంగా చేవ్రాలు చేసి ఇచ్చాడు. ఇక అంతే సంగ తులు– ఆ బ్లాంక్ పేపర్‌మీద ఆ యువనేత ‘కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ’ తన స్నేహితుడికి తెలిపాడు. యువనేత నేరాన్ని సహించలేని అతని స్నేహితుడు న్యాయస్థానంలో ‘చీటింగ్ కేసు’ వేశాడు. ఆ దెబ్బతో చెమటలు పట్టిన ‘యువనేత’ ఎలాగోలా రాజీ బేరా నికి వచ్చి ‘బతుకు జీవుడా’ అని బయటపడాల్సి వచ్చింది. ఈ విష యాన్ని ప్రముఖ న్యాయ వాది బొజ్జా తారకం నాకు చెప్పి, చీటింగ్ కేసు తాలూకు దాఖలైన రుజుపత్రాన్ని కూడా నాకు చూపించాడు. విశేషమేమిటంటే ఈ ఘటన ఆ యువనేత కులస్థుడి విషయంలోనే జరిగిందని మరచి పోరాదు. దాసరి రమేష్ ప్రభృతుల విమర్శ ఆల స్యంగా వచ్చినా నిష్పాక్షికమైన విమర్శలకు ఆ అగ్రకులానికే చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఆచార్య ఎన్జీ రంగా సమాజంలో ‘కుల గజ్జి’కి సమాధానంగా గౌతులచ్చన్న, ప్రగడ కోటయ్య లాంటి వారిని కాంగ్రెస్ నిర్మాణంలో భాగస్వాముల్ని చేసి, వారి ఎదుగుదలకు చేదోడు వాదోడు కావటం రాష్ట్ర ప్రజలు మరవలేని సత్యం. పైగా నిమ్న జాతులు (మాల/మాదిగ), అణగారిన దళిత వర్గాలు అనే విభజనను రంగా ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు. ‘ఈ కుల, వర్గం విభజన గ్రామీణ సామా జిక జీవనంలో విషబీజాలు నాటిం దనీ, గ్రామీణ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండేందుకు వీలు లేకుండా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిం దనీ ఆయన ఏనాడో హెచ్చరించారు. పదమూడో శతాబ్దం దాకా కృష్ణానదికి రెండువైపులా విస్తరించి ఉన్న జిల్లా కృష్ణాజిల్లా అప్పట్లో దానికి వ్యవసాయక ప్రదేశమని పేరుం డేది. అది క్రమేపీ వ్యవసాయాధార ప్రాంతం కాబట్టి వ్యవసాయం అనేది ‘కృషి’ కాబట్టి. కృషికి మారుపేరు ‘కర్మ’ కాబట్టి, క్రమేపీ దానికి ‘కమ్మ’ రాష్ట్రమని పిలుస్తూ ఉండేవాళ్లు. అంతేగాదు, రంగాజీ మరో సామాజిక కోణాన్ని కూడా తన చారిత్రిక అధ్యయనంలో పేర్కొన్నారు: ‘‘భారతదేశంలో వ్యవసాయ కుటుంబాల మూలాలు ఆదిమ జాతి సంతతికి చెందినవనీ’ అలాంటి ఆదిమజాతి సంతతుల్లో సగం సంత తులు సోదరులుగా మెలిగేవాళ్లనీ, మిగతా సగంతో వివాహాది సంబం ధాలుండేవనీ విశాల సామాజిక దృక్పథంతో తన ‘స్వీయచరిత్ర’లో వివ రించారు కూడా. తన వంశ పునాదులు కడప–నెల్లూరుల నుంచి బయ లుదేరి గుంటూరు–కృష్ణాల దాకా విస్తరించినా ‘కులం’ దృష్టి నుంచి చరి త్రను ఆయన పరిశీలించినవాడు కాదు. వీరశైవం, వీర వైష్ణవం సమాజ సంసర్గతకు దోహదం చేసిన 12వ శతాబ్దపు బసవ సిద్ధాంతాన్ని ఆయన కొనియాడారు. అదే శతాబ్దంలో కుల వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన బ్రహ్మనాయుడి ‘చాపకూడు’ సిద్ధాంతాన్నీ అందుకే ప్రేమించాడు రంగా. వెలమ, కమ్మ, బలిజ, బోయ, ముత్రాసు, తెలిక, వొంతరి, రెడ్డి, కమ్మ కర్షక ప్రజాబాహుళ్యం నాటి సమాజాభివృద్ధికి కంటకంగా తయారవు తున్న సాంఘిక దురాచార కట్టుబాట్లను ఛేదించి సామాజికుల ఐక్యతకు, తద్వారా ఐక్యతా శక్తిగా రాజకీయ వ్యవస్థను తీర్చి దిద్దడానికి ప్రతా పరుద్రుడి దూరదృష్టిని రంగా కొనియాడిందీ ఈ ‘కులపిచ్చి’ని మాన్పిం చడానికే. అందుకే 14వ శతాబ్దపు నాయక పూర్వులైన ప్రోలయ, కాపయ, వినాయకదేవ, హరిహర, బుక్క, వీర భల్లాల, సోమ దేవా దులకు, సామాజిక ఐక్యత కోసం స్వేచ్ఛా పోరాటంలో పరస్పరం సహ కరించుకుని ఒక్కతాటిపై నడిచిన దక్షిణాపథం నాయక గణానికీ (14వ శతాబ్ది) రంగా వేనోళ్ల కీర్తించవలసి వచ్చింది. ఈ చరిత్ర పాఠంలో భాగంగా, దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంపైకి క్రమశిక్షణతో దూసుకువచ్చి ఈ కొసనుంచి ఆ కొస వరకూ ఉత్తర, మధ్యాంధ్ర, రాయలసీమ దాకా వైఎస్సార్సీపీకి బలంగా ముడి బిగించి, హత్యా ప్రయత్నం సహా అన్నిరకాల అడ్డంకులను దాటి అజా తశత్రువుగా ముందుకుపోతున్న జగన్మోహన్రెడ్డి గతకాలపు సామా జిక వివక్షా రాజకీయాలకు, విధానాలకు స్వస్తి పలకడం వేనోళ్ల హర్షిం చదగిన పరిణామం. అందుకే రాష్ట్రంలోని దాదాపుగా అన్ని సామాజిక శ్రేణులకు అతను సన్నిహితమై తలలో నాలుకగా వెలుగొందుతున్నారు. ఈ చక్రబంధంలో ఇరుక్కుపోయి, బతికి బట్టకట్టడం ఎలాగో చూసుకోవ డమే బాబుకి మిగిలిన ‘దింపుడుకళ్లం’ ఆశ. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మరాఠాలకు రిజర్వేషన్లు అమలయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయంగా చాల బలమైన వర్గమైన మరాఠాలకు ఉపాధి, విద్యావసాకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం ఆమోదించినంతరం అసెంబ్లీ హాలంతా ‘జై భవాని, జై శివాజీ’ నినాదాలతో మారుమోగిపోయింది. ఈ బిల్లు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మరాఠా నాయకులు ఫొటోలు దిగుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నత్యాలు చేశారు. పటాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర జనాభాలో 32 శాతం జనాభా కలిగిన మరాఠాల్లో మెజారిటీ వర్గాన్ని తమవైపు తిప్పుకొని 2019లో జరుగనున్న సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మరాఠాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెల్సిందే. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితే మారి పోతుందన్నది నిస్సందేహం. కానీ బిల్లు ఇంతకు చట్టం రూపం దాలుస్తుందా? అన్నది ప్రధాన ప్రశ్న. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా ఇప్పటికే రాష్ట్రంలో వివధ వర్గాలకు, కులాలకు 52 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిపైనా 16 శాతం అదనంగా రిజర్వేషన్లు కల్పించడమన్నది మామూలు విషయం కాదు. దీనిపై ఎవరూ కోర్టుకు వెళ్లరని, చట్టం తీసుకరావచ్చని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భావిస్తున్నారు. ఈ బిల్లుకు రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ కూడా సుముఖంగా ఉందని రాష్ట్ర మంత్రి వినోద్ తావ్డే తెలిపారు. ఇంతకాలం తమ పార్టీని సమర్థిస్తూ వచ్చిన మరాఠాలను దూరం చేసుకోవడం ఇష్టం ఉండదు కనుక కాంగ్రెస్ పార్టీ బిల్లును సవాల్ చేయదని భావిస్తున్నారు. అది నిజమే. బిల్లుకు కాంగ్రెస్ సభ్యులు మద్దతివ్వడమే కాకుండా బిల్లు ఆమోదం అనంతరం మరాఠా నాయకులకు కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు. ఆజాద్ మైదాన్‌లో రిజర్వేషన్ల కోసం గత పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నేతల్లో మాత్రం ఇంకా ఆనందం కనిపించడం లేదు. వారి దీక్షను కూడా విరమించలేదు. తాము నమ్మే శివసేన నుంచి కబురు వచ్చాకే వారు నిరసన దీక్షను విరమించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంటే వారికి ఇంకా రిజర్వేషన్లు చట్టరూపం దాలుస్తాయన్న నమ్మకం లేదన్న మాట. మరాఠీలు గత మూడేళ్లుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు. వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు 58 మౌన ప్రదర్శనలు జరిపారు. గత జూలై–ఆగస్టులో వారు జరిపిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర మరాఠాల్లో చిన్నకారు, సన్నకారు రైతులే ఎక్కువ ఉండడం, కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభం వల్ల వారు కష్టాల పాలవడం తెల్సిందే. మహారాష్ట్రలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల్లో కూడా మరాఠాలే ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర మరాఠాల్లో మూడు శాతం మందే ధనవంతులని ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ ఓ నివేదిక వెల్లడించింది. మరాఠాల్లో 37 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారని, 93 శాతం మంది ఏడాదికి లక్ష రూపాయలకన్నా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలని, 77 శాతం మంది మరాఠాలు వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నారని, రైతుల్లో 62.7 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని బీసీ కమిషన్ జరిపిన ఓ సర్వేలే తేలింది. మరాఠాల్లో 60 నుంచి 65 శాతం మంది కచ్చా ఇళ్లలో నివసిస్తున్నారని, వారిలో 4.3 శాతం మందే అకాడమిక్ ఉద్యోగాలు చేస్తున్నారు. మరాఠాల్లో రైతులు, వ్యవసాయ కూలీలే ఎక్కువ ఉండడం వల్ల వారు తమ పిల్లలను ఎక్కువగా ఉన్నత చదువులను చదివించలేక పోయారు. చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు దొరక్కపోవడానికి రిజర్వేషన్లే కారణమని వారికి అర్థమైంది. అందుకని వారు మూడేళ్లుగా అవిశ్రాంతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఉద్యమం తీవ్రత కారణంగానే రిజర్వేషన్ల బిల్లు వచ్చింది. అది చట్టరూపం దాలుస్తుందా అన్నదే అనుమానం. ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయిన పలు రాష్ట్రాల్లో అదనపు రిజర్వేషన్ల హామీలు ఆచరణకు నోచుకోలేని విషయం తెల్సిందే. -
సరికొత్త ‘కుల’ రాజకీయం
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ పొత్తుకు సిద్ధమవుతున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీకి కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 71 పార్లమెంటు స్థానాలు గెల్చుకున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడనున్న వినూత్న పొత్తు హిందుత్వ రాజకీయాలకు దృఢమైన సవాలును విసురుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బీజేపీ 2014 నాటి తన అద్భుతమైన పని తీరును పునరావృతం చేయాలంటే ఇలాంటి మహా కూటమి ఏర్పాటును అడ్డుకునే వ్యూహం తప్పనిసరిగా రచించాల్సి ఉంటుంది. పైగా ఉత్తరప్రదేశ్‌లో ఈ మూడు బలమైన పార్టీలను మినహాయిస్తే.. తాను ఎన్నికల పొత్తు కుదుర్చుకోగలిగే రాజకీయ పార్టీలు పెద్దగా లేవని కూడా బీజేపీకి తెలుసు. అందుచేత, ప్రతిపక్ష పార్టీల రాజకీయ పొత్తును సవాలు చేయాలంటే గత ఎన్నికలల్లో తనకు ఓటు వేసిన సామాజిక పునాదిని భారతీయ జనతాపార్టీ మరింత విస్తృత పర్చుకుని బలోపేతం కావాల్సి ఉంటుంది. ‘విభజించు–పాలించు’ వ్యూహంతో దాడి ఉత్తరప్రదేశ్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు బీజేపీ విభజించు పాలించు వ్యూహాన్ని ఎంపిక చేసుకుంది. దళితుల్లో, ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలు, సామాజికంగా ఎంతో వెనుకబడిన బృందాలను హిందుత్వ శక్తుల పక్షాన గణనీయంగా సమీకరించారు. సామాజికంగా వెనుకబడిన బృందాలకు చెందిన విస్తృత సెక్షన్లకు చెందిన ప్రజానీకానికి దళిత/బహుజన/పిచ్డా (వెనుకబడిన) వంటి సామూహిక పరిభాష అంత సులభంగా అందుబాటులో ఉండదు. అలవడదు కూడా. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు తరచుగా సంకుచితమైన కుల వర్గాలను ఉపయోగిస్తుంటారు. సమాజంలోని అన్ని కులాల తరపున ఒక ఏకైక కులం అధికారం చలాయించకూడదన్న సూచనతో కుల ప్రాతిపదికన సామాజిక విభజనను విస్తృతం చేయడమే బీజేపీ వ్యూహం. దాంట్లో భాగంగానే అత్యంత వెనుకబడిన కొన్ని నిర్దిష్ట కులాలను, బృందాలకు రాజకీయాలు అంటించిన బీజేపీ వాటిని యాదవులు, జాతవులు, ముస్లింలతో కూడిన సాంప్రదాయిక రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబెట్టింది. సామాజిక ఇంజనీరింగ్‌లో బీజేపీ పైచేయి ఉత్తరప్రదేశ్‌లో అంతవరకూ బలంగా కనిపించిన రాజకీయ శక్తులను అప్రధానమైన రాజకీయ ప్రత్యర్థులుగా వేరుపర్చడంలో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. అంతకుమించి ఆ పార్టీ తన సామాజిక ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మరింత గొప్పగా మెరుగుపర్చుకుంది. దిగువస్థాయిలోని ఓబీసీల్లోకి, రాజకీయంగా పూర్తిగా ఏకాకితనంలో ఉన్న దళిత బృందాల్లోకి విస్తరించడం ద్వారా అత్యంత సృజనాత్మక పార్టీగా బీజేపీ తనను తాను నిర్వచించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ పునాది ఒక్కసారిగా ద్విగుణీకృతం కావడానికి దారితీసిన మూలకారణం ఇదే. ఇన్నాళ్లుగా ఈ బృందాలను ఎస్పీ, బీఎస్పీ పార్టీల సాంప్రదాయిక రాజకీయ సమీకరణల్లో చాలా చిన్న చూపు చూసేవారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల సాంప్రదాయిక ఓట్లలోనూ కుల విభజనలు ప్రేరేపించిన బీజేపీ 2012లో యూపీలో సాధించిన 15 శాతం ఓట్లను 2017 అసెంబ్లీ ఎన్నికల నాటికి 42 శాతానికి పెంచుకుంది. ఈ ప్రాతిపదికన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ తన సామాజిక పునాదిని నిలబెట్టుకోగలనని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. అందుకే ప్రతిపక్షాల రాజకీయ కూటమి బీజేపీ దృష్టిలో ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది విభిన్న రాజకీయ వ్యూహాలు ఉత్తరప్రదేశ్‌లో మూడు విభిన్న రాజకీయ వ్యూహాలను అవలంబించడం ద్వారా బీజేపీ అంతటి ప్రభావశీలమైన సామాజిక పొత్తును సాధించింది. ఒకటి– రాష్ట్రంలో కుల వ్యవస్థ ఇప్పటికీ బలంగా పనిచేస్తోందని, విభిన్న కుల బృందాలు సామాజిక పొత్తులు లేక పరస్పర సంబంధాలకు ఇప్పటికీ దూరంగానే ఉన్నాయని బీజేపీ గ్రహించింది. పరస్పరం అవిశ్వాసం, శత్రుత్వం, అసూయ ప్రాతిపదికన కులాలు ఇప్పటికీ సమాజంలో పనిచేస్తున్నాయి. అలాంటి కుల విభజనలను సవాలు చేసే మౌలికమైన సంస్కరణాత్మక శక్తి సమాజంలో ఇంకా ఏర్పడలేదు. పైగా కుల బృందాలను సామాజిక సంస్కరణకు గురిచేయడంపై బీజేపీ ఎలాంటి ఆసక్తీ ప్రదర్శించలేదు. దానికి బదులుగా, అది కుల విభజనను ఎంతగా ప్రోత్సహించి, రాజకీయం చేసి పడేసిందంటే, ఉత్తరప్రదేశ్‌లో దళితులు లేక ఓబీసీల వంటి ఏకీకృత రాజకీయ సామూహిక శక్తి ఇకపై ఎన్నటికీ ఏర్పడటం కష్టం. అలాంటి పరిణామం సామాజికంగా ఉన్నత శ్రేణిలో ఉన్న ఆధిపత్య శక్తుల రాజకీయాలను తప్పకుండా సవాలు చేయగలదని బీజేపీ చక్కగా గ్రహించింది కూడా. కాబట్టి, దళితుల, ఓబీసీల సామూహిక ఉనికిని, అస్తిత్వాన్ని విచ్ఛిన్న పర్చడానికి సమాయత్తం అవుతున్న కుల బృందాలకు సహాయం చేయడం, ప్రోత్సహించడమే బీజేపీ ప్రధాన వ్యూహంలాగా మారింది. బీఎస్పీలోని జాతవ నాయకత్వానికి వ్యతిరేకంగా రాజ్‌భర్, పాసి, ధోబీ, ఖటిక్ వంటి కులాలను ప్రోత్సహించడంపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆధిపత్య కుల రాజకీయాలపై ప్రచారం ఓబీసీలలోని మౌర్యులు, కుర్మీలు, లోధీలను హిందుత్వ రాజకీయాలను బలపర్చే ప్రధాన శక్తులుగా బీజేపీ ఎగదోసింది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ కేవలం యాదవుల ఆధిపత్యం ఉన్న పార్టీ స్థాయికి పరిమితమైపోయింది. కుల బృందాల మధ్య రోజువారీగా తలెత్తుతున్న తీవ్రమైన సామాజిక వ్యత్యాసాలను విస్పష్టమైన సామాజిక, రాజ కీయ శత్రుత్వాల్లోకి మార్చడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేసింది. రెండు, యూపీలోని కుల విభేదాలను సజీవంగా ఉంచడానికి బీజేపీ పలు రాజకీయ ప్రకటనలు, విధానపరమైన వాగ్దానాలను తన ఎన్నికల ప్రచారంలో గుప్పించింది. ఉదాహరణకు, రిజర్వేషన్ విధానాన్ని వర్గీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆసక్తి ప్రదర్శించింది. దీంతో రాష్ట్రంలో యాదవులు, జాతవులు, మరికొన్ని కులాలు రిజర్వేషన్ విధానం ద్వారా లభ్యమవుతున్న ప్రయోజనాలను గుత్తకు తీసుకున్నాయని బీజేపీ ప్రచారం చేసింది. కాబట్టి రిజర్వేషన్ విధానాన్ని సంస్కరించవలసిన సమయం ఆసన్నమైందని, అప్పుడే రిజర్వేషన్ ఫలితాలు సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చేరుకుంటాయని బీజేపీ ప్రచారం చేసింది. ఆవిధంగా ఒకే కుల సామాజిక పునాదిలో అవిశ్వాసాన్ని, శత్రుత్వాన్ని పెంచి పోషించడమే కాకుండా, కీలకమైన ఆర్థిక, రాజకీయ వనరులపై అగ్రకుల కులీనుల ఆధిపత్యం కొనసాగడాన్ని కూడా బీజేపీ అనుమతించింది. మతపరమైన ఘర్షణలకు ఆజ్యం మూడు– నిమ్న కులాల్లో సామాజిక, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉండే సాంస్కృతిక, జానపద అంశాల్లో బీజేపీ మతత్వాన్ని రంగరించింది. దళిత్–ఓబీసీ కులాలకు చెందిన పలు వర్గాలు హిందూ మత సంప్ర దాయాలతో సన్నిహితంగా ఉండటంతోపాటు ఆ ఆచా రాల్లో, సంప్రదాయాల్లో పాలుపంచుకుంటాయి. ఆరెస్సెస్, బీజేపీలు ఒక పద్ధతి ప్రకారం వీటిల్లో జోక్యం చేసుకుని మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా వినియోగించుకుం టున్నాయి. గ్రామ దేవతలు, జానపద నాయకులు, గ్రామీణ సంప్రదాయాలు, ఇతర సాంస్కృతిక కళాఖం డాలు వగైరాలకు క్రమంగా హిందుత్వ రాజకీయాలతో బాంధవ్యం ఏర్పడేలా చూస్తున్నాయి. అంతేకాక గోరక్షణ, రామ మందిరం, హిందూ మహి ళల గౌరవ పరిరక్షణ వంటి సామాజిక పరమైన సున్నిత అంశాలను ముస్లిం వ్యతిరేకతకు బీజేపీ వాడుకుం టోంది. నిమ్నకులాలకు సంబంధించిన మతపరమైన, సాంస్కృతిక పరమైన అంశాల్లో తరచు ఆరెస్సెస్–బీజేపీలు జోక్యం చేసు కుంటున్న తీరు బీజేపీ మద్దతు పెరగడానికి దోహదకారి అవు తోంది. ఈ కపట వ్యూహాలు గత ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టి బీజేపీకి లబ్ధి చేకూర్చాయి. కనుక సహజంగానే రాబోయే ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఈ తరహా వ్యూహా లపైనే ఆధారపడదల్చుకుంది. కానీ ఈసారి సామాజిక, ఆర్ధిక న్యాయానికి సంబం ధించిన ప్రశ్నలకు బీజేపీ సరైన జవాబిచ్చే స్థితిలో లేదు. ఓబీసీల్లోని కింది కులాలు, దళితుల్లోని అట్టడుగు కులాలు మానవాభివృద్ధి సూచీల్లో మెరుగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ కులాలన్నీ ఇప్పటికీ సామాజికంగా వివ క్షను, వేధింపులను ఎదుర్కొంటున్నాయి. అత్యంత దారు ణమైన పేదరికంలో మగ్గుతు న్నాయి. బీజేపీ నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ఈ అట్టడుగు కులాలను దయ నీయమైన స్థితినుంచి బయట పడేయలేకపోయింది. ఇప్ప టికీ ఆ కులాలు అధికారానికి చాలాదూరంలో ఉన్నాయి. కేవలం మతతత్వ, కుల సమీకరణాల కారణంగా మాత్రమే అవి భారతీయ జనతా పార్టీ ఛత్రఛాయలో మనుగడ సాగిస్తున్నాయి. సమగ్ర వ్యూహంలేని విపక్షాలు ఎస్–బీఎస్పీ–కాంగ్రెస్ కూటమి కాగితాలపై చాలా ఆక ర్షణీయంగా కనిపిస్తుంది. యాదవ్–జాతవ్–ముస్లిం కల యిక సామాజికపరమైన అద్భుత వ్యూహమని, అది గెలుపును అందిస్తుందని విపక్షాలకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆరెస్సెస్–బీజేపీ శక్తులు దీనికన్నా అతి పెద్ద సామా జిక సముదాయాన్ని సమీకరించగలవు. క్షేత్ర స్థాయిలో బీజేపీ తన సొంత కుల–మత రాజకీయాల బ్రాండ్‌ను సమర్థవంతంగా అమలుచేస్తోంది. దానికి సమగ్రమైన ప్రతివ్యూహాన్ని విపక్షాలు ఇంకా రూపొందించుకోలేక పోయాయి. కేవలం రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడంతోనే తమ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని ఆ కూటమిలోని పార్టీలు గుర్తించాలి. ఆ కూటమి తన సామాజిక పునాదిని విస్తరించుకుని ఇంతవరకూ ఎలాంటి ప్రాధాన్యతకూ నోచని గ్రూపులకు సమాన హోదానిచ్చి వాటికి సన్నిహితం కాగలిగితే అదొక తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. తనపై ఇంతకాలంనుంచీ ఉంటున్న వ్యతిరేక భావనలను, ప్రత్యే కించి ఇందులోని పార్టీలన్నీ ఏదో ఒక కులానికే ప్రాతినిధ్యం వహిస్తుంటాయన్న అభిప్రాయాన్ని పోగొట్టుకోవటం ఈ కూటమికుండే ప్రధాన సవాళ్లు. కొత్త ఆర్థిక సంక్షేమ ఎజెండా అవశ్యం సమాజంలో బాగా అణచివేతకు గురవుతున్న కులాలకు పార్టీ కార్యకలాపాల్లోనూ, సంస్థాగత అధికార నిర్మా ణాల్లోనూ మంచి ప్రాధాన్యత నిచ్చి ఈ పార్టీలు తమ సామాజిక పునాదిని విస్తృతపరచుకోవాల్సి ఉంది. అదే సమయంలో బీజేపీ అనుసరించే అలంకారప్రాయమైన అభివృద్ధి మంత్రానికి భిన్నంగా కూటమి ఒక కొత్త ఆర్థిక సంక్షేమ ఎజెండాను రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక న్యాయం, సోషలిజం వంటి విలువల ఆధారంగా రూపొందే ప్రభావవంతమైన సైద్ధాంతిక ప్రక టన ఆ కూటమినుంచి వెలువడాలి. అది మాత్రమే భారతీయ జనతా పార్టీ వేర్పాటువాద సామాజిక నిర్మాణాన్ని తుత్తునియలు చేస్తుంది. హరీష్ ఎస్. వాంఖెడే వ్యాసకర్త జవహర్లాల్ యూనివర్సిటీ రాజకీయ అధ్యయన కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ -
‘ ప్రజలను పక్కదారి పట్టించేందుకే మత రాజకీయాలు’
హైదరాబాద్: బీజేపీ నాయకులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను తెరపైకి తెస్తున్నారని దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీ రావి నారాయణ కాలనీలో బాలవికాస్ సంస్థ ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్‌ను, సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో సమస్యలే లేనట్లు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం, గోవధను నిషేధిస్తాం అంటూ బీజేపి నాయకులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అరోపించారు. రామ మందిర నిర్మాణానికి అడ్డొస్తే తల నరుకుతానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటన చేయడం తగదని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి రామాలయ నిర్మాణాన్ని చేపడితే న్యామూర్తులు, చట్టం అడ్డు వస్తుందని వారిని ఆయన నరక గలడా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం వల్ల ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహాన్ని అణచి వేయలేరని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం వ్యాపారంగా మారాయని, దీనిపై పోరాటాలు చేయాల్సి వస్తోందని తెలిపారు. -
రాజకీయాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: కులమతాల పేరుతో ప్రజలను విభజిస్తున్న రాజకీయ నాయకులకు చెంపపెట్టు లాంటి తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. విభజన రాజకీయాలు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయనాయలెవరూ కులం, మతం పేరుతో ఓట్లు అడగరాదని ఆదేశించింది. హిందూత్వ కేసులో దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకుర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మానం ఈ మేరకు చారిత్రక తీర్పు చెప్పింది. ఎన్నికలనేవి లౌకిక విధానంలో భాగమని... కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షించింది. భగవంతుడికి, మనిషికి మధ్య సంబంధం వ్యక్తిగతమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. రెండు దశాబ్దాల నాడు ఇచ్చిన 'హిందూత్వ'తీర్పును పునఃసమీక్షించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానం సవివర తీర్పునిచ్చింది. ఎన్నికల్లో లబ్ధికి మతాన్ని దుర్వినియోగం చేయడం అవినీతి కిందకే వస్తుందని పేర్కొంటున్న ఎన్నికల చట్టంలోని ఒక సెక్షన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఉటంకించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డె, జస్టిస్ ఎ.కె.గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. కేసు నేపథ్యం హిందూత్వ కేసులో తీర్పును 1995లో అప్పటి సీజే జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లు అడినందునశివసేన నేత మనోహర్ జోషితో పాటు బీజేపీ, శివసేనకు చెందిన మరికొందరి ఎన్నిక చెల్లదని బొంబాయి హైకోర్టు 1991లో ఇచ్చిన తీర్పును జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. హిందూత్వ/హిందూయిజం అన్నది ఉపఖండంలో ప్రజల జీవన విధానమని.. అదొక మనఃస్థితి అని మతం కాదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూత్వ పేరుతో ఓట్లు కోరడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన ఏడాది తర్వాత ఇటువంటి కేసునే విచారించిన మరొక త్రిసభ్య ధర్మాసనం.. జస్టిస్ వర్మ తీర్పుతో విభేదించింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ పునఃసమీక్షించాలని సూచించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ కేసును విచారిస్తుండగా బీజేపీ నేత సందర్‌లాల్ పట్వా ఎన్నిక చెల్లదంటూ నారాయణసింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన కేసు 2002లో వచ్చింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123కు భాష్యం చెబుతూ సవివర తీర్పు వెలువరించేందుకు ఈ కేసు మొత్తాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. -
'యూపీ, బీహార్‌గా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు'
► కుల రాజకీయాలపై రాజ్ ఠాక్రే ఉద్వేగ ప్రసంగం ముంబై : మహారాష్ట్రలో జరుగుతున్న కుల రాజకీయాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇద్దరు మిత్రులు కలిసి భోజనం చేస్తే వారి మధ్య కులం చిచ్చు పెట్టే రాజకీయాలు రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదన్నారు. పుణేలో ఎమ్మెన్నెస్ కార్యకర్తల సదస్సులో ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు. కొందరు స్వార్థపరులు స్వలాభం కోసం ప్రజల్లో కులం చిచ్చు రగిలిస్తున్నారని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. రాష్ట్రాన్ని యూపీ, బీహార్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ నాయకుల ఆటలు సాగినివ్వబోమన్నారు. తన కుటుంబ సభ్యులు కులం గురించి నేర్పలేదన్నారు. మీరు నిజంగా నా శ్రేయోభిలాషులైతే కులం గురించి పట్టించుకోవద్దని కార్యకర్తలకు ఆయన హితవు పలికారు. మొన్నటి వరకు కలిసి ఉన్న మనమంత కేవలం కులం కారణంగా వైరులు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం వెనకబడిపోతుందన్నారు. వచ్చే యువతరానికి ఏమిస్తామని, రాష్ట్రంలో ఏం జరుగుతోందని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. కులానికి రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తూ అనేక వర్గాలు ర్యాలీలు, మోర్చాలు నిర్వహిస్తున్నాయన్నారు. కులానికి రిజర్వేషన్ ఎందుకు, ఆర్థికంగా వెనకబడిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని రాజ్ ఠాక్రే చెప్పారు. ఏ కులం నాయకుడు ఆ కుల ప్రజల కోసం ఏం చేశారు..? ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఎన్నికల కోసం ప్రజలను పావుల్లా వాడుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవగానే ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. కులం, రిజర్వేషన్ పేరుతో మనలో మనమే గొడవ పడుతున్నాం. కాని కులానికి రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగాలెక్కడున్నాయి...? అని ప్రశ్నించారు. భూమి పుత్రులకు అన్యాయం జరుగుతుందని, పరప్రాంతీయులే ఉన్న కాస్తా ఆ ఉద్యోగాలను కాజేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్ ఠాక్రే ఉద్ఘాటించారు. -
ఈడ్చుకుంటూ వెళ్లి అంత్యక్రియలు
-
రాజకీయం రగిల్చిన రాచపుండు
- సమకాలీనం ఎన్నికలప్పుడు ఓట్ల యావతో రిజర్వేషన్ కల్పిస్తామనడం కుల రాజకీయం కాదంటున్న వారు, ‘హామీ ప్రకారం రిజర్వేషన్ కల్పించండి’ అంటే... కుల రాజకీయాలని ముద్రవేసి దుష్ర్పచారం చేస్తున్నారు. పదవులు, హోదాలు, భూములు, కాంట్రాక్టులు, అపార సంపదలు, ఉన్నతోద్యోగాలు అన్నీ ఒకే సామాజిక వర్గానికి కల్పిస్తున్న తీరు కాపులతో పాటు ఇతర కులాల్లోనూ తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. రాజకీయ స్వార్థంతో కులాల కుంపట్లు రగిల్చే కుటిల నీతి ఆగకపోతే సామాజిక అశాంతి, అలజడులు తప్పవు. ఒక చెట్టు నుంచి కొన్ని లక్షల అగ్గిపుల్లల్ని తయారు చేయొచ్చు! ఒక అగ్గిపుల్లతో లక్షల చెట్లను కాల్చి బూడిద చేయొచ్చు! అందుకే... వస్తువు గొప్పదనం కన్నా, దాని వినియోగం ముఖ్యమంటారు. కులం కొందరికి వర్ణాశ్రమ ధర్మం, కొందరికి సామాజిక చిరునామా, మరికొందరికి వృత్తి మూలం, ఇంకొందరికి సాంస్కృతిక వారసత్వం. కొందరికయితే... కులం ఫక్తు రాజకీయాస్త్రం. కులం కార్డును రాజకీయావసరాలకు వాడుకొని, అధి కారం అబ్బి అవసరం తీరాక... కుల వివక్షలేని సామాజిక దృక్పథం ఉన్నట్టు నటించడం రివాజు. ఆచరణలో మాత్రం పక్కా ఫ్యూడల్ విధానాల్ని పాటిస్తూ కులాల మధ్య చిచ్చు రేపుతారు. ఆ మంటల్లో ఆజ్యం పోసి చలి కాచు కుంటారు. ఈ వైఖరి ముదిరి పాకాన పడటం వల్లనేమో నేడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కులం ఓ సంక్లిష్ట అంశంగా తయార యింది, ప్రమాదకర స్థాయికి చేరింది. అధికారం అనుభవించడం నుంచి సంపద పంపిణీ వరకు, నిర్లక్ష్యం చూపి కొన్ని కులాలను అణచివేయడం నుంచి తమ ఆధిపత్యాన్ని దృఢపరచుకోవడం వరకు కులతత్వ ధోరణి పెచ్చుమీరడంతో కుల వైషమ్యాలు రగులుతున్నాయి. రాజకీయం అంటిం చిన కుంపట్లు రగిలి, అవి కుల కురుక్షేత్రాలవుతాయేమోనన్న ఆందోళన పెరుగుతోంది. అంతటా అశాంతి రేగుతోంది. కాపుల రిజర్వేషన్లు, ముద్రగడ పద్మనాభం దీక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి..... దరిమిలా ఉత్పన్నమైన పరిస్థితులు ప్రమాద సంకేతాల్ని వెలువరిస్తున్నాయి. ఇది పులిపైన స్వారీ లాంటిదని తెలిసీ అధికార తెలుగుదేశం నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, పావులు కదుపుతున్న శైలి పచ్చి రాజకీయ విక్రీడగానే ఉంది. కుల వీధులు, కుల వాడలు, కుల గ్రామాల స్థాయి దాటి ఈ వైషమ్యాలు బజారు పోరా టాలు, గల్లీ గలాటాలు, తుపాకీ సంస్కృతి వరకు విస్తరిస్తాయేమోననే భయాందోళనలున్నాయి. కుల ఘర్షణల మూలాలతో ప్రసిద్ధికెక్కిన ‘బెజవాడ రౌడీ’ సంస్కృతి కొత్త రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించే ప్రమాద ముందని సామాజికవేత్తలంటున్నారు. నక్సల్ ఉద్యమం తెలుగు నేలపై బలోపేతమైన క్రమంలోనూ ఇలా జరుగలేదు, కుల వైషమ్యాలు తలెత్తలేదు. పైగా, నక్సల్ ఉద్యమంలో బడుగులకు, బలహీనవర్గాలకు దన్నుగా సాగిన సైద్దాంతిక, సాయుధ పోరులో శీర్ష భాగాన నిలిచిన వారిలో అత్యధికులు అగ్రవర్ణాల వారే! ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కుటిల ఎత్తుగడలతో రాజకీయ ప్రయోజనాల కోసం తాము నిచ్చెన మెట్లుగా వాడుకున్న కులాలనే అధికారం చేతికొచ్చాక నిష్కర్షగా తొక్కేస్తు న్నారు. ఏకపక్షంగా సంపదను, ముఖ్యంగా భూముల్ని ఒక వర్గం సొంతం చేసుకుంటున్న తీరు వారి దూకుడుని స్పష్టం చేస్తోంది. అవకాశాలు మృగ్యం చేసి ఇతర సామాజిక వర్గాల ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్న తీరు అలజడి రేపుతోంది. కాపు రిజర్వేషన్లను కోరుతూ దీక్షచేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తుంటే... ఇద్దరు మంత్రులు వ్యంగ్యోక్తులు విసరడం తాజా విచిత్రం! తన పార్టీలోని అదే కులం వారితో ఎదురుదాడులు చేయించడం చంద్రబాబు మార్కు కుటిలనీతి. సున్నితమైన సామాజికాంశాల నిప్పుతో రాజకీయ చెలగాటాలాడే దమన నీతికి పరాకాష్ఠ. కులం-రాజకీయాలు అప్పట్లో పాలు-తేనె 1931 నాటి జనాభా లెక్కలపై ఆధారపడే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కులాల జనాభా అంచనాలు సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన హిందూ కులాల నిక్కచ్చి జనాభా లెక్కల్లేవు. బ్రాహ్మణుల జనాభా రెండు శాతం కన్నా తక్కువంటారు. అప్పటి(1931) లెక్కల ప్రకారం రెడ్లు 7 శాతం, కమ్మలు 5 శాతంగా చెబుతుంటారు. కాపుల జనాభా ఆరు శాతం ఉండేదని ఒక అంచనా ఉన్నా, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వివిధ కాపు వర్గాలన్నీ ఒకటేననే వాదనతో కాపు సంఘాలు తమ జనాభా 20 నుంచి 25 శాతం అంటే మీడియా, ప్రధాన రాజకీయపార్టీలు వివాదపడకుండా ఏకీభవిస్తుం టాయి. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ఏర్పాటు నుంచి... రాజకీయాలతో సహా ప్రధాన రంగాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ఈ వర్గానికి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు(1953), హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఇదే వర్గపు బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు. వారి తర్వాత రెడ్డి కులానికి చెందిన వారే ఎక్కువమంది ముఖ్యమంత్రులై, ఎక్కువ కాలం పాలించారు. రెండు ప్రధాన వ్యవసాయాధారిత కులాలైన కమ్మలు, రెడ్లు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ, రాజకీయాధికారంలో తగినంత వాటా సంపాదించడం సహజ సామాజిక పరిణామంగా భావించవచ్చు. ఇంకోలా చెప్పాలంటే రాజ కీయాల్లో బ్రాహ్మణుల స్థానాన్ని ఆ రెండు కులాలూ ఆక్రమిస్తూ వచ్చాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 50-60 వరకూ ఉన్న బ్రాహ్మణుల సంఖ్య తెలుగుదేశం ఆవిర్భవించాక ఒకానొక దశలో ఒకటి, రెండుకు పడిపోయింది. తెలుగు రాజకీయాల్లో చైతన్యం పెరిగి ప్రజాస్వామీకరణ విస్తరించిన క్రమం లోనే చట్టసభల్లో ప్రాతినిధ్యం జనాభాను బట్టి నిర్ణయమయ్యే పరిస్థితులు కొంత మేరకు పొడచూపాయి. రైతు కుటుంబాల నుంచి వచ్చి విద్యావం తులైన రెడ్డి, కమ్మ యువకులే రాజకీయ చైతన్యంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ కులాలకు చెందిన చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, రావి నారా యణరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, కొండపల్లి సీతారామయ్య గొప్ప కమ్యూనిస్టు నేతలయ్యారు. ఈ వాస్తవాన్ని గుర్తించ నిరాకరించిన అప్పటి కాంగ్రెస్ నేతలు... కామ్రేడ్ అంటే, కామ్ (కమ్మ), రేడ్ (రెడ్లు) అంటూ ఎగతాళిగా మాట్లాడేవారు. మొదటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునాదులు తెలుగునాట బలహీనమే. 1956 నుంచి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్డి కులాల మధ్య సమతూకం పాటించడానికే ఎక్కువ శ్రమపడాల్సి వచ్చింది. దీనికి తోడు దాదాపు అంతే జనాభా ఉందని భావించే కాపుల్లో అసంతృప్తి రాకుండా వారు బలంగా ఉన్న జిల్లాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి ప్రయత్నించారు. తెలంగాణ బ్రాహ్మణ వర్గానికి చెందిన పి.వి. నర్సింహారావును ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయోగం బెడిసికొట్టినా... భూసంస్కరణల వల్ల అది వికటించిందని ఆ వర్గం ప్రచారం చేయగలిగింది. ఆ క్రమంలోనే రెడ్డి వర్గానికి చెందిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి దాదాపు 15 ఏళ్లు పాలన చేశారు. కోస్తా కమ్మ, రెడ్డి వర్గాలతో మంచి సంబంధాలున్న వెలమ నేత జలగం వెంగళ రావును 1973 డిసెంబర్లో ఏపీ సీఎంను చేయడం కాంగ్రెస్ జాతీయ నాయ కత్వం చేసిన తెలివైన నిర్ణయం అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఇద్దరు రెడ్డి సీఎంల హయాంలోనే కోర్టు తీర్పుల ఫలితంగా కాపులను బీసీల జాబితా నుంచి తొలగించాల్సి వచ్చినా... సదరు సామాజిక వర్గంలో అసంతృప్తి, అలజడి తలెత్తకుండా వ్యవహార దక్షతతో నీలం, కాసు చూసుకోగలిగారు. ఆ తెలివిడి తదనంతరం వచ్చిన తెలుగుదేశం నాయకత్వంలో లోపించింది. ఎనబై దశకం నుంచే విపరిణామాలు మొదలు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించాక కాపులను కాంగ్రెస్‌వైపే ఉంచే వ్యూహంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్పటి కాంగ్రెస్ మంత్రి సంగీత వెంకటరెడ్డి (కాపు)తో బీసీ రిజర్వేషన్ కోరుతూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహాసభ జరిపించింది. అయినా కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించలేదు. మిగిలిన వ్యవసాయ కులాల్లో మాదిరిగానే అత్యధిక కాపు ప్రజానీకం 1983 జనవరి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపార్టీకే ఓటేశారని అంచనా. 2014 ఎన్నిక ల్లోనూ కాపులు సానుకూలంగా మొగ్గడం వల్లే ఊహించని విజయం టీడీపీకి దక్కిందన్నది రాజకీయ విశ్లేషణ. తెలుగు దేశం పోకడలోని కుల ప్రాబల్య పద్ధతి, కమ్మ రాజకీయ ఆధిపత్యం, కులాల సమీకరణల కారణంగా కాపు రిజర్వేషన్ వ్యవహారం మళ్లీ మళ్లీ తెర మీదకు వస్తూనే ఉంది. తెలుగుదేశం తొలిసారి అధికారంలోకి వచ్చిన్నుంచీ కోస్తాలోని కమ్మల ప్రాబల్య ప్రాంతా లలో గణనీయ సంఖ్యలో ఉన్న కాపులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయ త్నిస్తూనే ఉంది. తెలంగాణకు చెందిన మున్నూరు కాపు(బీసీ) కేంద్రమంత్రి పి. శివశంకర్... కోస్తా కాపులను కాంగ్రెస్ వైపు సమీకరించడానికి అప్పట్లో ఉపయోగపడ్డారు. కాంగ్రెస్‌కు దూరమైన బీసీలను ఆకట్టుకోవడంలో విజయం సాధించిన ఎన్టీఆర్.. కాపులతో మాట్లాడి వారి అసంతృప్తిని తొల గించడంలో విఫలమయ్యారు. నినాదం-ఆచరణ మధ్య అంతరంవల్ల విశ్వాసం కలిగించలేక పోయారు. తదనంతర కాంగ్రెస్ (1989-94) పాలనలో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి ఓ ప్రత్యేక జీవో ద్వారా కాపు రిజర్వేషన్ వ్యవహారాన్ని కొంతవరకు పరిష్కరించే యత్నం చేశారు రాజకీయ ప్రయోజనం పొందలేకపోయినా, సామాజిక అశాంతి ప్రబల కుండా చూడగలిగారు. అందుకే, ముద్రగడ పద్మనాభం నాయకత్వాన కాపులు విజయభాస్కరరెడ్డిని ‘కాపుల అంబేడ్కర్’ అన్నా.. కాపు రిజర్వేషన్ వివాదానికి అది ముగింపు పలకలేకపోయింది. ఆ సమస్య నిరంతరం రగల డానికి తెలుగుదేశం అనుసరించిన కుల ప్రాపకం కూడా కొంత కారణమనే వాదన ఉంది. టీడీపీ హయాంలో కులాధిపత్య రాజకీయాల నీడన 1984లో జరిగిన కారంచేడు దళితుల ఊచకోత, తదనంతర సామాజిక పరిణామాల క్రమాన్నే మార్చింది. కులాధిపత్య రాజకీయాల వల్ల దళితోద్యమాలు, విభ జించి పాలించే టీడీపీ నీతివల్ల ఎస్సీల్లో మాల-మాదిగ ఎబీసీడీ వర్గీకరణ వివాదం రగులుతూనే ఉన్నాయి. టీడీపీ రాజకీయ ప్రాపకం వల్లే రాయల సీమ ముఠా తగాదాల్లోనూ ‘కుల’ ప్రమేయం పెరిగింది. 1984 టీడీపీలో తిరుగుబాటు, ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం, 1988 రంగా హత్య, 1995 టీడీపీలోనే అధికార మార్పిడి వంటి పరిణామాల తర్వాత తమ రాజకీయ సుస్థిరత కోసం పార్టీలో, పార్టీ నేతృత్వపు పాలనలో కులతత్వం మరింత తీవ్రస్థాయికి చేరింది. అవసరానికో మాట, అధికారంలో మరో మాట మాదిగలకు తానే పెద్దన్నగా, ప్రతినిధిగా ఉంటానన్న చంద్రబాబు ఎన్నికల తర్వాత ఆ మాట మరిచారు. మాదిగలు ఆక్రోశిస్తూనే ఉన్నారు. ఓట్లేయలే దన్న కోపంతో రెండేళ్లుగా ఎస్టీలకు కూడా టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయక పోవడం ఆయా వర్గాల్లోనూ అసంతృప్తికి కారణమౌతోంది. ఇతర బీసీ కులా లలాగే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, ఆధికారం చేజిక్కాక భిన్నంగా వ్యవహరించడం కాపుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. పార్టీలకతీతంగా కాపు నాయకులంతా ఒక్కటై ముద్రగడ ఒంటరి కాదని చేసిన హెచ్చరిక తీవ్రమైంది. ఎన్నికలప్పుడు ఓట్ల యావతో రిజర్వేషన్ కల్పి స్తామని హామీ ఇవ్వడం కుల రాజకీయం కాదంటున్న వారు, ‘హామీ ప్రకారం రిజర్వేషన్ కల్పించండి’ అని కాపులు అడిగితే... అవి కుల రాజకీయాలని దుష్ర్పచారం చేస్తున్నారు. పదవులు, హోదాలు, భూములు, కాంట్రాక్టులు, అపార సంపదలు, ఉన్నతోద్యోగాలు, ఇతరేతర అవకాశాలన్నీ ఒకే సామాజిక వర్గానికి కల్పిస్తున్న తీరు కాపులతో పాటు ఇతర కులాల్లోనూ తీవ్ర అసంతృ ప్తిని రేపుతోంది. పాలకులు తమ సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రిన్సిపల్‌ను వెనుకేసుకొస్తే, అమాయక విద్యార్థిని రిషితేశ్వరి దుర్మరణం దర్యాప్తునకు మోక్షముండదు. ఓ వీసీని వెనుకేసు కొస్తే.. రోహిత్ అకాల మరణానికి అసలు కారణాలు బయటకు రావు. ఇదీ పరిస్థితి! ఈ వాతావరణం వైషమ్యాలకు దారి తీస్తోంది. ఈ దేశంలో... పెరియార్ (తమిళనాడు), నారాయణగురు (కేరళ), సాహూ మహరాజ్ (మహారాష్ట్ర) వంటి మహనీయులు సామాజిక అంతరాలు తగ్గించడానికి కృషి చేసి, వెనుకబడిన, బలహీన వర్గాలకు దన్నుగా నిలిచారు. వారు అగ్ర-సంపన్న వర్గాలతో పోరాడి ఉద్యమించినా అది కులతత్వంతో కాదు. కుల వివక్ష లేకుండా సాగించిన ఆ పోరు... ఫ్యూడల్ పాలనా వ్యవస్థల్ని ఛేదించి, అట్టడుగువర్గాల ప్రగతికి బాటలు పరిచింది. అవి సామాజిక సంస్కరణ ఉద్యమాలుగా చరిత్రలో నిలిచాయి. కానీ, ఇప్పుడు సాగుతున్నవి సం‘కుల’సమరాలు. రాజకీయ స్వార్థం కోసం కులాల కుంపట్లు రగిలించే కుటిల నీతి ఆగనంత వరకు, సామాజిక అశాంతి, అలజడుల కత్తి మెడపై వేలాడుతూనే ఉంటుంది, కాళ్ల కింద నేలలో మందు పాతర కాచుకొనే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త! - దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
'ఇక్కడ కులమే పెద్ద స్టార్'
బిహార్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. కులరాజకీయాలు ప్రధాన పాత్ర పోషించే ఈ రాష్ట్రంలో ఆ చిచ్చును మరింత రెచ్చగొట్టేందుకే నాయకులు ప్రయత్నిస్తున్నారు. చేతికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. బిహార్ రాజకీయాల్లో కులానిదే ప్రధాన పాత్ర అని, ఇక్కడ కులమే పెద్ద స్టార్ అని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ తాజాగా వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ మాట అన్నారు. బీజేపీ నేతృత్వంలోని అగ్ర కులాలకు, మహాకూటమి తరఫున ఉన్న వెనకబడిన కులాలకు మధ్య యుద్ధంగానే ప్రస్తుత ఎన్నికలు ఉండబోతున్నాయని లాలు వ్యాఖ్యానించారు. మన దేశంలో కులాన్ని ఎప్పుడూ వదలిపెట్టలేమని, అది పచ్చి వాస్తవమని అన్నారు. ఇప్పటికే ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో కులాల ప్రస్తావన తెచ్చినందుకు ఎన్నికల కమిషన్ లాలుపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక్కడ జంతువులకు కూడా కులాలు ఉంటాయని, ప్రధానంగా ఏనుగులకు కులాలు ఉంటాయని లాలు చెప్పారు. బిహార్‌లో బీజేపీ పని అయిపోయిందని, గురుశిష్యులిద్దరూ (మోదీ, అమిత్ షా) మూటా ముల్లో సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.