
బీహార్ డీఎన్‌ఏలోనే కులతత్వం
పాట్నా: కుల రాజకీయాలకు వ్యతిరేకమన్న బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఆ పార్టీ సీనియర్ నేత నితిన్ గడ్కారీ కులతత్వాన్ని ఆకాశానికెత్తేశారు. బీహార్ డీఎన్‌ఏలోనే కులతత్వం దాగిఉందని... అందుకే రాష్ట్రంలో కులాల గురించిన చర్చ ఎక్కువగా సాగుతోందని శనివారం పాట్నాలో వ్యాఖ్యానించారు. పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ కులం గురించి బీహార్ బీజేపీ నేతలు పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న విలేకరుల ప్రశ్నకు గడ్కారీ ఈ బదులిచ్చారు. అయితే అంతలోనే ఆయననాలిక్కరుచుకొని బీహార్ డీఎన్‌ఏ పదం స్థానంలో బీహార్ రాజకీయాలు అనే పదాన్ని వాడాలని విలేకరులను కోరారు.