'యూపీ, బీహార్గా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు' | Raj Thackeray Emotional speech on caste politics in maharashtra | Sakshi
Sakshi News home page

'యూపీ, బీహార్గా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు'

Published Wed, Nov 9 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

'యూపీ, బీహార్గా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు'

'యూపీ, బీహార్గా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు'

కుల రాజకీయాలపై రాజ్ ఠాక్రే ఉద్వేగ ప్రసంగం
ముంబై :
మహారాష్ట్రలో జరుగుతున్న కుల రాజకీయాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇద్దరు మిత్రులు కలిసి భోజనం చేస్తే వారి మధ్య కులం చిచ్చు పెట్టే రాజకీయాలు రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదన్నారు. పుణేలో ఎమ్మెన్నెస్ కార్యకర్తల సదస్సులో ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు.

కొందరు స్వార్థపరులు స్వలాభం కోసం ప్రజల్లో కులం చిచ్చు రగిలిస్తున్నారని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. రాష్ట్రాన్ని యూపీ, బీహార్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ నాయకుల ఆటలు సాగినివ్వబోమన్నారు. తన కుటుంబ సభ్యులు కులం గురించి నేర్పలేదన్నారు. మీరు నిజంగా నా శ్రేయోభిలాషులైతే  కులం గురించి పట్టించుకోవద్దని కార్యకర్తలకు ఆయన హితవు పలికారు. మొన్నటి వరకు కలిసి ఉన్న మనమంత కేవలం కులం కారణంగా వైరులు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం వెనకబడిపోతుందన్నారు. వచ్చే యువతరానికి ఏమిస్తామని, రాష్ట్రంలో ఏం జరుగుతోందని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు.

కులానికి రిజర్వేషన్ కావాలని డిమాండ్‌ చేస్తూ అనేక వర్గాలు ర్యాలీలు, మోర్చాలు నిర్వహిస్తున్నాయన్నారు. కులానికి రిజర్వేషన్ ఎందుకు, ఆర్థికంగా వెనకబడిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని రాజ్ ఠాక్రే చెప్పారు. ఏ కులం నాయకుడు ఆ కుల ప్రజల కోసం ఏం చేశారు..? ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఎన్నికల కోసం ప్రజలను పావుల్లా వాడుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవగానే ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. కులం, రిజర్వేషన్ పేరుతో మనలో మనమే గొడవ పడుతున్నాం. కాని కులానికి రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగాలెక్కడున్నాయి...? అని ప్రశ్నించారు. భూమి పుత్రులకు అన్యాయం జరుగుతుందని, పరప్రాంతీయులే ఉన్న కాస్తా ఆ ఉద్యోగాలను కాజేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్ ఠాక్రే ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement